Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఉండమ్మా బొట్టు పెడతా… అప్పట్లో మహిళల్ని విశేషంగా ఏడ్పించింది…

February 18, 2024 by M S R

Subramanyam Dogiparthi…. మహిళలకు నచ్చిన సినిమా . మహిళలు మెచ్చిన సినిమా . బాగా ఆడింది . మంచి పేరు కూడా వచ్చింది . గొప్ప మహిళా సెంటిమెంట్ పిక్చర్ . ఉమ్మడి కుటుంబం , పండంటి కాపురం వంటి చాలా సినిమాలకు భిన్నంగా కుటుంబం కోసం , లక్ష్మీ దేవిని ఇంట్లో నుంచి వెళ్ళకుండా ఆపటానికి ఆత్మాహుతి చేసుకునే కధ . జమున బాగా నటించింది . సినిమా ఆఖరిలో లక్ష్మీ దేవి పాత్రలో ఉన్న అంజలీదేవి , జమున సంభాషణల సీన్ చాలా బాగుంటుంది .


1967 లో వచ్చిన మరాఠీ చిత్రం “లక్ష్మి కుంకుంలావితే” అనే సినిమా మన తెలుగు సినిమాకు మాతృక . మన తెలుగు సినిమాల వాతావరణానికి అనుగుణంగా మార్పులను చేసారు . స్క్రీన్ ప్లే ఆదుర్తి సుబ్బారావు అందించగా , ఆయన శిష్యుడు కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించారు .
ఈ సినిమాకు మరొక బలం దేవులపల్లి వారి పాటలు , కె వి మహదేవన్ సంగీతం . పాటలన్నీ హిట్ అయ్యాయి . అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది , రావమ్మా మహాలక్ష్మి రావమ్మా, నీ కోవెల ఈ ఇల్లు కొలువై పాటలు సూపర్ హిట్ . శ్రీశైలం మల్లన్న శిరసొంచేలా చేలంతా గంగమ్మ వాన , పాతాళ గంగమ్మ రారారా ఉరికి ఉబికి ఉబికి రారారా , చుక్కలతో చెప్పాలని ఏమని , ఎందుకీ సందె గాలి , చాలులే నిదురపో పాటలు శ్రావ్యంగా ఉంటాయి . దేవులపల్లి వారి మార్క్ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది .కృష్ణ , జమున , జానకి , నాగయ్య , నాగభూషణం , ధూళిపాళ , సూరేకాంతం , సూర్యకళ , ఆర్జా జనార్ధనరావు , ప్రసన్నరాణి , రాజబాబు , మాడా , సాక్షి రంగారావు ప్రభృతులు నటించారు . పూర్తిగా గ్రామీణ నేపధ్యంలో తీసారు .

మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసా . టి విలో కూడా చూసా . యూట్యూబులో ఉంది . సంసారపక్షమైన పాత విలువల సినిమా . పాటలు , నటన , సినిమా గోయింగ్ బాగుంటాయి . చూడదగ్గ సినిమా .

Ads

#తెలుగుసినిమాలసింహావలోకనం #telugureels #తెలుగుసినిమాలు #TeluguCinemaNews #telugucinema

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రోహిణి సింధూరి..! చీట్… నో క్లీన్ చిట్…! శుద్ధపూస ఏమీ కాదట..!!
  • యువ సన్యాసి విషాదకర మరణం… విషాదంలో జైన సమాజం…
  • అందరూ ఆడుకునేవాళ్లే..! అమరావతి రాజధాని ఓ విషాదగాథ…
  • శని అంటే శని… అంతే… ఎవరూ అతీతులు కాదు… ఐదూళ్ల కథ కూడా…
  • మోటోక్రాస్ రేసింగ్..! టెక్నికల్లీ హైస్టాండర్డ్స్… ఎమోషనల్లీ వీక్…!!
  • పాండవులు అడిగారు ఐదూళ్లు… ఇప్పుడు తెలంగాణ అడుగుతోంది…
  • రకాస ముచ్చట… దెయ్యాల కోటలో పెళ్లి ఆపిన పెళ్లికాని ప్రసాదు..!
  • హిందీ రాముడికన్నా మన తెలుగు రాముడే బాగున్నాడు..!!
  • హీరో రాజేంద్రప్రసాద్ మరో పెళ్లాం… కానీ పెద్దగా అచ్చిరాలేదు పాపం…
  • ఇప్పుడంటే సిలిం‘డర్’… కానీ అప్పట్లో బాబును గెలిపించిన గ్యాస్ బుడ్డి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions