Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?

May 8, 2025 by M S R

.

=== ఉండవల్లి గారికి ఒక ఆత్మీయ లేఖ ===

సార్,

Ads

” ఆ కేసు సంగతి నాకేమీ తెలియదు, ఆయన నా ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి వెళ్లి పలకరించాను ” అని చెప్పి ఊరకుంటే ఎంత హుందాగా ఉండేది! అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టి మీ తెలివెందుకు ఇన్వెస్ట్ చేశారు, మీ ఇమేజ్ ని ఎందుకు పణంగా పెట్టారు ?

ఉదాహరణకి –

” ఆయన ఆసియాలో ఆరో పెద్ద ధనవంతుడు” – ( ధనవంతుల మీద కేసు పెట్టకూడదా ? )

” రేపు అటెంప్ట్ కాదు, ఏకంగా రేపు చేశాడనే కేసు పెట్టింది” – ( ధనవంతులు అటెంప్ట్ మాత్రమే చేసి ఊరుకుంటారా, మన చట్టానికి భయపడి ? )

“డీజీపీ స్థాయి అధికారిని జైలులో పెట్టడం ఇదే మొదటిసారి” – ( ప్రపంచంలో ఎందరో నియంతలు, అమెరికా అధ్యక్షులు తమపైన వచ్చిన నిందలకి ప్రజలకి వినయంగా సమాధానాలు చెప్పుకున్నారు. కోర్టుల ద్వారా రక్షణ కోరారని మీకు తెలుసుగా)

” పది రోజులు జైలుకి పోవాలని ఉంది, అందుకే బెయిల్ అప్లై చెయ్యలేదు అన్నాడు ” – ( ఇంత కొవ్వు పనికిరాదు మిత్రమా అని మీరెందుకు చెప్పలేదు ? )

” నువ్వు జైలుకి వెళితే నేను చూడ్డానికి వస్తానని మాటిచ్చాను, అందుకే వెళ్లాను ” ( ఇదొక్కటే కరెక్ట్ గా చెప్పారు. అక్కడితో ఆపేయాల్సింది )…

” వైఎస్సార్ అతన్ని హలో మిస్టర్ అంజన్ అని భుజం మీద తట్టేవారు. అందుకే వైఎస్సార్ కొడుకు కాబట్టి జగన్ మీద ఆయనకి కొంత అభిమానం ” ( ఒక ముఖ్యమంత్రి భుజం మీద తట్టినంత మాత్రాన ఆయన వారసులకు ఊడిగం చేసేవాడు కానిస్టేబుల్ గా కూడా పనికి రాడు, డీజీపీగా ఎలా పనికొస్తాడు ? )

” ఆమె మీద ఒక కంప్లైంట్ వచ్చింది, పోలీసు బలగం ముంబై వెళ్లి ఆమెను ఎత్తుకొచ్చారు, దీన్ని తప్పుపడితే పోలీసులు ఎలా పని చెయ్యాలి ” ( ఛీ! ఛీ! సిగ్గుమాలిన కామెంట్ )…

పైవన్నీ ఎవడో ఒక రాజకీయ నాయకుడో, వ్యక్తి పూజ చేసుకునే ఒక బానిసో మాట్లాడితే సరే గాని మీరు ఒక లాయర్, ప్రస్తుతం రాజకీయాల్ని వదిలేసి న్యూట్రల్ గా ఉన్నారు. మంచి విశ్లేషకులు , మంచి వక్త. మీ నుంచి ..

దిగ జారింది చాలు. తర్వాతి ప్రెస్ మీట్ లలో కొంచెమైనా ఎగబాకండి…

*

రామ్మోహన్ కరణం…. (మహానాడు డిజిటల్ పత్రిక నుంచి సేకరణ) (పాపం ఉండవల్లి, ఎంత లాజికల్‌గా మాట్లాడేవాడు పాపం, ఎలా అయిపోయాడు కదా…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చందమామ మీదకు వెళ్లడం కాదు… క్షేమంగా తిరిగి రావడమే పే-ద్ద ఘనత…
  • ఈ ‘సీతాకోకచిలుక’ చాన్నాళ్ల తరువాత మళ్లీ తెరపై… అదే నవ్వుతో…
  • లెఫ్ట్, రైట్, సెంట్రల్, రీజనల్… ప్రతి పార్టీ నాదే… లాటరీ మార్టిన్ కథ…
  • భార్య… అల్లుడు… కొడుకు… మరి ‘లాటరీ మామ గారా… మజాకా…’
  • ఈ అభ్యర్థి దగ్గర 19 కిలోల బంగారం… 13 కిలోల వెండి… ఎవరీమె..?
  • విజయ్ పార్టీకి రథసారథి… తను తమిళ ప్రశాంత్ కిషోర్… కింగ్ మేకర్…
  • మహానగరంలో మాయగాడు… 39 ఏళ్లుగా మిస్టరీ వీడని ‘నగల చోరీ’…
  • అసలు సినిమా కథకన్నా… కోట- బాబూమోహన్ కామెడీయే హైలైట్…
  • కేసీయార్ గడీలోకి జీవన్‌రెడ్డి..!? ఓ మానసిక విశ్లేషణ ఇదుగో..!!
  • ఎరుపు లోలాకు కులికెను కులికెను… ఆమె గుర్తుందా మీకు..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions