ఒక ఫోటో… కేసీయార్ కుమారుడు కేటీయార్ పలువురు ఉద్యోగాభ్యర్థులతో మాట్లాడుతున్న ఫోటో… ఫోటో యాంగిల్ బాగుంది… ఎన్నికల వేళ నిరుద్యోగుల్లో వ్యతిరేకతను తగ్గించడానికి ఈ ప్రయత్నం, ఈ ఆలోచన కూడా బాగుంది… మరోవైపు ఇస్తామన్న హామీకన్నా ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చాం అనే ప్రచారం… అదే సమయంలో ‘జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఖాళీలు భర్తీ చేస్తాం’ అనే హామీ…
బాగా కొలువులు ఇస్తుంటే… కొత్త హామీల అవసరం ఎందుకొచ్చింది..? తెలంగాణ ఉద్యమ మూల నినాదాల్లో ఒకటి ‘నియామకాలు’… మరెందుకు పదేళ్లయినా సరే ఆ నియామకాలు గాడి తప్పే ఉన్నయ్… ఎందుకు నిరుద్యోగుల్లో అసంతృప్తి ప్రబలింది… ఉద్యోగకల్పన మాటెలా ఉన్నా అసలు ఖాళీల భర్తీ ఎందుకు సవ్యంగా లేదు… ఇవన్నీ ప్రశ్నలే…
ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ఏమైంది..? కంట్రాక్టు కొలువులు, ఔట్ సోర్సింగ్ మాటలే ఈ రాష్ట్రంలో వినిపించకూడదు అనే పాత భీషణ ప్రతిజ్ఞలు ఏమయ్యాయి..? ఆ పరిస్థితి ఎందుకు మారలేదు..? ఇవీ ప్రశ్నలే…
Ads
TSPSC ప్రశ్నపత్రాల లీకేజీల ఆరోపణల్ని ఇదే కేటీయార్ తీవ్రంగా ఖండించాడు మొదట్లో… కానీ అరెస్టులు సాగుతూనే ఉన్నాయి… దర్యాప్తు నడుస్తూనే ఉంది… దాదాపు వంద మంది దాకా అరెస్టయి ఉంటారు… మరి ఏమీ లేనిది ఎందుకీ అరెస్టులు..? ఇంత ఘోరమైన వైఫల్యం ఉన్నా కమిషన్ బాధ్యులు కడుపులో చల్లకదలకుండా నిక్షేపంగా అక్కడే ఉన్నారు… ఎందుకిలా..? కమిషన్ ప్రక్షాళన అని ఇప్పుడు హరీష్ వంటి నేతలూ మాట్లాడుతున్నారు… మరి ఇన్నాళ్లూ ఎందుకు చేయలేదనేది కదా అసలు ప్రశ్న…
మరొక మంచి వార్త కనిపించింది… ప్రధాన పత్రికల్లో లేదు గానీ, సూర్యలో కనిపించింది… ఒక గిరిపుత్రిక ఏకంగా ఏడు కొలువులు సాధించిందట… గుడ్… కేసీయార్ మస్తు నోటిఫికేషన్లు వేయకపోతే ఇన్ని కొలువులు ఎలా వచ్చాయంటూ గులాబీ బ్యాచ్ ప్రచారం అందుకుంది… కానీ తీరా ఆ క్లిప్పింగ్ సావధానంగా చూస్తే అది 2019 నాటిది అని కనిపిస్తోంది…
Gurram Seetaramulu విశ్లేషణ ఏమిటంటే..? ‘‘ఈ పదేళ్ళ ల్లో ఒక్కసారి కూడా గ్రూప్ I జరగలేదు. ఒక్క విశ్వవిద్యాలయంలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒక్క JL/DL ( TSPSC ) (గురుకులం కాదు…) ఇవ్వలేదు. ఒక్క గ్రూప్ iii జరగలేదు. ఇక జరిగిన పరీక్షల కథలు పెద్దవి.
ఎనకటి వెనకబాటు కాలం నేటి బానిస కాలంకన్నా గొప్పదే… ఇది మధ్యయుగాల బానిస రాజ్యం… ఈ చెట్టుకు వేలాడుతున్న ఆ ఫోటోకు బదులు ఆమె పెళ్ళికి దారి చూపే ఫ్లెక్సీ అయి ఉండాలి… కానీ స్మశానానికి దిక్శూచి అవడం ఎవరి వైఫల్యం ? అందుకే గుర్తులు గుర్తుంచుకోవాలి… దొంగలు, దొరల గుర్తులు గుర్తుంచుకోవాలి…
Share this Article