.
మొదటి రోజు, శుక్రవారం, జస్ట్ 1.35 కోట్లు… మరుసటి రోజుకు 150 శాతం జప్, 3.25 కోట్లు… ఆదివారం మరో 110 శాతం జంప్, 6.50 నుంచి 7 కోట్లు… 3 రోజుల్లో 11.5 కోట్లు… అంటే 3 రోజుల్లో దాదాపు 400 శాతం జంప్… మరో కలెక్షన్ల సైట్ లెక్కప్రకారం 4 రోజుల్లో 22 కోట్లు… ఒక్క ఆదివారంనాడే 11.5 కోట్లు వచ్చాయని సినిమా టీం చెబుతోంది…
ఇందులో హిందీ 15 కోట్లు… తెలుగులో 5 కోట్లు… ఇవీ మహావతార్ నరసింహ వసూళ్లలో పెరుగుదల… 800 థియేటర్లలో రిలీజ్ చేయగా… శనివారానికి 1100, ఆదివారంకల్లా 2000 థియేటర్లకు ఈ సంఖ్య పెరిగింది… అనూహ్యమైన ఆదరణ… 31న విదేశాల్లో రిలీజ్ చేయబోతున్నారు…
Ads
ఏమాత్రం ప్రమోషన్లు లేవు… సోకాల్డ్ కమర్షియల్ వాసనల్లేవు… స్టార్ హీరోలు లేరు, బెనిఫిట్ షోలు లేవు, టికెట్ల ధరల పెంపు లేదు… జస్ట్, ఒక యానిమేటెడ్ పురాణ కథ… ఐతేనేం, ఫ్యామిలీస్‌ను థియేటర్లకు రప్పిస్తోంది, పిల్లలతో…!!
నిన్న ఎక్కడో దర్శకుడు అశ్విన్ కుమార్ మాట్లాడుతూ చాలా అంశాలు చెప్పాడు… అందులో ఒకటి ఇంట్రస్టింగ్ అనిపించింది…
‘స్టార్లను తీసుకుంటే వాాళ్ల ఇమేజీ ప్రభావం సినిమా కథ మీద పడుతుంది… వాళ్ల కోసం పిచ్చి ఎలివేషన్లు, కమర్షియల్ వాసనలు గుప్పించాలి… రక్తి చేరుతుంది, భక్తి మాయం అవుతుంది… సో, యానిమేటెడ్ సినిమా అయితేనే ఈ అవలక్షణాలు రావు, పిల్లలకు ప్లెయిన్‌గా స్ట్రెయిట్‌గా పురాణం చెప్పొచ్చు’ అనే కదా అందరూ అనుకున్నది… కానీ కాదట…
నాలుగేళ్ల క్రితం ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేశాం, ఇప్పుడు రిలీజ్ చేయగలిగాం… ఒక హీరో ఇన్నిరోజుల సమయం ఇవ్వగలడా..? అందుకే పర్‌ఫెక్ట్ కథ, దానికి తగిన గ్రాఫిక్స్‌కు ఇంతకాలం పట్టింది… ఇది ఊహించే స్టార్లు వద్దనుకున్నాం, నాలాంటి కొత్త దర్శకుడికి అంత చాన్స్ ఇస్తారా హీరోలు అంటున్నాడు…
అవును, అందరూ రాజమౌళిలు కాలేరు, రాజమౌళికి ఇచ్చినట్టు ఏళ్ల కాల్షీట్లు ఇవ్వలేరు కదా… ఒకవేళ స్టార్లను తీసుకుంటే ఎవరిని తీసుకునేవాడివి అనడిగితే… నరసింహస్వామి పాత్రకు ఎవరూ లేరు, కేవలం యానిమేషనే… హిరణ్యకశిపుడు పాత్రకు మాత్రం రానా, మోహన్‌లాల్, విజయ్ సేతుపతిల్లో ఎవరైనా సరే అన్నాడు… ఇంట్రస్టింగు…
దేవుళ్ల కథలు ఇప్పుడు ట్రెండ్… హిందీ బెల్టుకు భలే కనెక్టయిపోతున్నాయి… ఆ ట్రెండ్ అందిపుచ్చుకుంది హొంబలె ఫిలిమ్స్… రాబోయే రోజుల్లో విష్ణు అవతారాల్లో హొంబలె ఫిలిమ్స్ వాళ్లు తీయబోయే కథలు, సినిమా టైటిళ్లు ఇవీ… ప్రతి సినిమాకు నడుమ కనీసం రెండేళ్లు గ్యాప్… మరో పదేళ్ల వరకూ ముందుగానే షెడ్యూల్…
మహావతార్ పరుశురాం (2027)… మహావతార్ రఘునందన్ (2029)… మహావతార్ ద్వారకాధీశ్ (2031).., మహావతార్ గోకులానంద (2033).., మహావతార్ కల్కి (2035–2037)… నరసింహతో కలిసి ఐదే అవుతున్నాయి కదా, దశావతారాలు అన్నారు కదా మరి అనేదేనా మీ ప్రశ్న… ఇదే దర్శకుడు అశ్విన్ కుమార్ మళ్లీ మీడియా మీట్ పెట్టి క్లారిటీ ఇస్తాడు..!!
Share this Article