సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా… నితిన్ హీరో జీవితం అలా కొనసాగుతూనే ఉంటుంది… డబ్బులున్నయ్, బలమైన సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంది, ఏదో సినిమాలు తీసేస్తూనే ఉంటారు… అయితే డబ్బులకన్నా హీరో ఇమేజీని ఎప్పటికప్పుడు లెక్కవేసుకుంటే నితిన్ టాలీవుడ్ సెకండ్, థర్డ్ లేయర్స్‌లోనే ఉండిపోయాడు హీరోగా… అంతే తప్ప అగ్రహీరోల సరసకు రాలేకపోయాడు, ఇప్పుడప్పుడే వచ్చే సీనూ లేదు… కనీసం ఆ సెకండో, థర్డో కాపాడుకోవాలి కదా… అదే కష్టమైపోతోంది… ఫాఫం, ఆమధ్య రంగ్‌దే కొట్టేసింది… మహానటి కీర్తి ఉన్నా పెద్దగా ఉపయోగపడిందేమీ లేదు… సినిమా మటాష్… చివరకు టీవీల్లో కూడా ఆరో ఏడో రేటింగ్స్ వచ్చి, ఢమాల్ అయిపోయింది… రంగు వెలిసినట్టయింది…
మొన్నామధ్య జెమిని టీవీ చెక్ సినిమాను ప్రసారం చేసింది… ఆ చానెల్‌కు సినిమా కొనడం, ప్రసారం చేయడం తప్ప ఇంకో సోయి ఏమీ ఉండదు, ప్రచారం చేసుకోవడం వంటివేమీ పట్టవు దానికి… నిజానికి ఈ సినిమా కరోనా వల్ల ఆగడం, నడవడం, మళ్లీ ఆగడం… ఎలాగోలా పూర్తిచేసుకుని థియేటర్లలో రిలీజ్ అయ్యింది కానీ… ఫట్‌మని పేలిపోయింది… దారుణమైన ఫ్లాప్… ఏడెనిమిది కోట్లు కూడా వచ్చాయో లేదో డౌటేనట… పోనీ, ఓటీటీలో ఏమైనా ఉద్దరించిందా అంటే, అక్కడా ఫట్… సరే, కరోనా రోజులు కాబట్టి థియేటర్లకు ఎవడూ వెళ్లలేదు అనుకుందాం, కానీ ఓటీటీలోనైనా చూడాలి కదా… ఆ దర్శకుడు యేలేటి చంద్రశేఖర్‌కు కాస్త మంచిపేరే ఉందిగా… ఐదేళ్ల తరువాత ఆయన సినిమా వచ్చింది, చూడాలి కదా… నో, తన్నేసింది…
Ads
పెద్దగా రకుల్ ప్రీత్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఆకర్షించడం లేదు… (ఈమధ్య మరీ అస్థిపంజరంలా మారింది… అల్ట్రా జీరో సైజు, కారణం తెలియదు)… అందుకని కేరళ నుంచి ప్రియా వారియర్‌ను తీసుకొచ్చారు… కాస్త గ్లామర్ విషయంలో ఫ్రీగా ఉండమ్మా అని చెప్పారు… తన పాత్ర కనిపించిన అరగంటో, పావున్నర గంటో ఆ ఫ్రీడం కూడా చూపించింది ఆమె… తీసుకున్న పారితోషికానికి న్యాయం చేస్తుంది ఆమె… కథ కూడా… ఓ టెర్రరిజం కేసులో నిందితుడు హీరో… రకుల్ లాయర్‌గా విడిపించాలని తెగ ప్రయత్నిస్తుంది… ఆ జైలులో ఉన్న సాయిచంద్ అనే ముసలాయన హీరోకు చెస్ మెళకువలు నేర్పిస్తాడు… హీరోకు గతంలో ప్రియా వారియర్‌తో ఓ ప్రేమకథ… జైలు నుంచి ఎస్కేపింగు గట్రా ఉన్నయ్… ఐనా సినిమా తన్నేసింది… ఎహెఫోవోయ్ అనేశారు… ఎందుకు..? ఎమోషన్, లాజిక్ గట్రా సమపాళ్లలో పడితేనే వంట రుచిగా ఉంటుంది, యేలేటి చంద్రశేఖర్ వంట మరిచిపోయినట్టున్నాడు…
పైగా మనవాళ్లకు క్రికెట్, బాక్సింగు తప్ప మరో క్రీడ పట్టదు… ఈ చెస్ చాలామందికి అర్థం కాదు కూడా… అందులోనూ హీరో కదా, వరల్డ్ చాంపియన్‌షిప్ రేంజుకు రాకెట్ వేగంతో వెళ్లిపోతాడు… అసహజంగా… దర్శకుడు ఏలోకంలో ఉన్నాడో అని మనం నవ్వుకునే సీన్లు చాలానే ఉన్నయ్… జైల్ ఎస్కేప్ సీన్ మరీ అసహజం… ఇలా మౌత్ టాక్ కూడా భీకరంగా సినిమాకు నెగెటివ్‌గా పనిచేసింది… ఐనా సరే, జెమిని టీవీలో ఈ సినిమా ఏకంగా 8.89 రేటింగ్స్ వచ్చాయి… అంటే దాదాపు 9 రేటింగ్…. నిజానికి ఈమధ్య కాలంలో తెలుగు సినిమాల రేటింగ్స్‌తో పోలిస్తే ఇది మంచి రేటింగే… సినిమా థియేటర్లలో తన్నేసి, ఓటీటీలో చీదేసినా సరే, టీవీలో హిట్టయినట్టే చెప్పాలి…
సినిమా పోయిందే అని బాధపడాలా..? పోతేపోయింది, టీవీలో క్లిక్కయిందని ఆనందపడాలా నితిన్..? తన సినిమా పాత్రల ఎంపికలో లైన్ మార్చుకోవాలా, వెళ్తే ఏ లైన్‌లో వెళ్లాలి, తమిళ-మళయాళ హీరోలు కొత్త కొత్త పాత్రల్ని, కొత్త కథల్ని ఎంపిక చేసుకుంటూ దున్నేస్తున్నారు… కానీ తెలుగు హీరోలు పాత సొల్లు కథల్ని వదలడం లేదు… అదే ఫార్ములా, అదే హీరోయిజం… ఈ స్థితిలో టీవీ రేటింగ్స్ బాగానే రావడం నితిన్‌ను డైలమాలో పడేయడం ఖాయం… థియేటర్, ఓటీటీ, టీవీల నడుమ తేడా ఏమిటో మెదడు చించుకోకుండా… మడత నలగని హీరోయిజం భ్రమల నుంచి బయటపడటం నితిన్ వంటి హీరోలకు అత్యవసరం… మారితే నిలుస్తారు, మారకపోతే ఇంకేముంది..? రంగ్ దే, చెక్… ఎట్సెట్రా…! తరువాత కొన్నాళ్లకు… ‘‘గతంలో నితిన్ అనే హీరో ఉండేవాడు’’ అని రాస్తాయి టీవీలు, పత్రికలు, సైట్లు…!!
Share this Article