.
ఆరోగ్యశ్రీ… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిపిన ఉపయుక్త పథకం… నిజానికి జనానికి పైసలు పంచిపెట్టడం కాదు, ఇవిగో అవసరానికి అండగా నిలబడే ఈ పథకాలే అవసరం…
జగన్‌కు ఏమాత్రం అర్థం కాని వైఎస్ స్పిరిట్ ఇది… వైఎస్ ఆచరణలో చేసి చూపించిందీ ఇదే… ఈరోజు సొసైటీకి అతి పెద్ద జబ్బు, కార్పొరేట్ వైద్య దోపిడీ..,. ప్రభుత్వ హాస్పిటల్స్‌ను నిర్వీర్యం చేశారు, మరోవైపు ప్రైవేటు దోపిడీ… ప్రపంచంలోనే ఇది చికిత్స లేని అతి పెద్ద నిలువు దోపిడీ నెట్‌వర్క్… ఇంకోవైపు పెరుగుతున్న రోగాలు…
Ads
చాలా కుటుంబాలు చితికిపోతున్నయ్ హాస్పిటళ్ల దోపిడీతోనే… ప్రత్యేకించి అల్పాదాయ, గ్రామీణులు… ఇంకా దాని గురించిన లోతు చర్చకన్నా ఇక్కడ ఓ వార్త ఆసక్తికరంగా అనిపించింది… ఆరోగ్యశ్రీ అనగానే వైఎస్ గుర్తొస్తాడు కాబట్టి ఆ పథకం ఏదో పేరు మార్చాడు అప్పట్లో చంద్రబాబు… (ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సలహా..?) సరే, అదో పిచ్చి రాజకీయం…
మరోవైపు కేంద్రంలో మోడీ ఆయుష్మాన్‌భవ ప్రవేశపెట్టాడు… కానీ అర్హులు తక్కువ, తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ మెరుగైన ఆరోగ్యశ్రీ ఉండటంతో మోడీ పథకాన్ని ఎవరూ పట్టించుకోలేదు… నిజానికి కేంద్ర ఏ పథకమైనా ఇలాగే ఉంటుంది… మోడీకి కూడా జనాన్ని కనెక్టయ్యే పథకాలు పెద్దగా పట్టవు…
ఇప్పుడు కనిపించిన ఓ వార్త మాత్రం బాగుంది… నిజంగా సరైన స్పిరిట్‌తో గనుక అమలు చేస్తే చంద్రబాబు తన రాజకీయ విధానాల లోపాలు, వైఫల్యాలు, చెడ్డ పేర్ల నుంచి కాస్త పుణ్యం సంపాదించి విముక్తి పొందుతాడు… ఎటొచ్చీ చంద్రబాబు అలా ఎప్పుడూ సరైన స్పిరిట్‌తో చేయడు కదానేదే సందేహం…
విషయం ఏమిటంటే..? మోడీ మార్క్ ఆయుష్మాన్‌భవ పథకాన్ని వైఎస్ మార్క్ ఆరోగ్యశ్రీని (ఎన్టీఆర్ వైద్యసేవ) కలిపేసి… ఓ కొత్త పథకం తీసుకొస్తున్నారు.,. నిన్నో మొన్నో ఏపీ మంత్రిమండలి దాన్ని ఆమోదించింది… దిక్కుమాలిన అనేక బాబు భజనల్ని మోసే యెల్లో మీడియా దీనికి తగినంత ప్రాచుర్యం ఇచ్చినట్టు లేదు కానీ, నిజానికి ఇది చరిత్రాత్మకం అవుతుంది…
ఏపీలోని ప్రతి కుటుంబానికీ ఏటా ₹25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే యూనివర్సల్ హెల్త్ పాలసీ… ప్రాథమిక వార్తల ప్రకారం పేద, మధ్యతరగతి, ధనిక… ఏ ఆర్థికస్థాయి తేడాలు పరిగణనలోకి తీసుకోకుండా అందరికీ… అక్షరాలా అందరికీ వర్తిస్తుందని తెలుస్తోంది…
ఈ నగదు రహిత వైద్య పథకం ద్వారా మొత్తం 3,257 రకాల వైద్య ప్రక్రియలకు ఉచితంగా చికిత్స అందిస్తారు… ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 2,493 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను నెట్‌వర్క్‌లో చేర్చారు… రోగులు తమకు నచ్చిన నెట్‌వర్క్ ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చు…
₹2.5 లక్షల వరకు అయ్యే వైద్య ఖర్చుల క్లెయిమ్‌లను ప్రైవేట్ బీమా కంపెనీలు నిర్వహిస్తాయి… ₹2.5 లక్షల నుంచి ₹25 లక్షల వరకు అయ్యే పెద్ద క్లెయిమ్‌లను ప్రభుత్వానికి చెందిన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పర్యవేక్షిస్తుంది…
ఆసుపత్రిలో చేరిన 6 గంటల్లోపే చికిత్సకు అనుమతులు… బిల్లుల చెల్లింపులు 15 రోజుల్లో పూర్తి… మెయిన్ పాయింట్స్… ఐతే ‘అందరికీ వర్తింపు’ అనేది అమలైతేనే చంద్రబాబుకు మంచి పేరు… ఆ క్లారిటీ కావాలి… ఇవ్వాలి… లేదు, అర్హులకు మాత్రమే అనే నిబంధన ఉంటే… ఇక మరిచిపొండి, ఆరోగ్యశ్రీకి దీనికీ తేడా లేదు… జై వైఎస్సార్…
అంతేకాదు, వెంటనే అనుమతులు, సత్వరం బిల్లుల చెల్లింపులు కూడా ముఖ్యమే… రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ బకాయిల్ని చెల్లించడం లేదు సరిగ్గా… దాంతో చాలా హాస్పిటళ్లు కొత్త కేసులనే తీసుకోవడం లేదు…
అన్నట్టు… ఈ యూనివర్శల్ హెల్త్ పాలసీని రేవంత్ రెడ్డి ఎందుకు అమలు చేయకూడదు..? కేంద్ర నిధులూ కలిసొస్తాయి… సర్లెండి, ఇప్పటి బకాయిలైతే చెల్లించమనండి ముందుగా అంటారా..? అవును, అదీ నిజమే..!!
Share this Article