.
కర్ణుడి ఔన్నత్యం…..
ద్రోణుడు తగ్గించలేదు…
పరశురాముడు తగ్గించలేదు…
కృష్ణుడు తగ్గించలేదు…
వ్యాసుడు తగ్గించలేదు…
హిందూ సమాజం తగ్గించలేదు..
ఒక్క సెల్ఫ్ పిటీ తప్పు అన్నారు… అధర్మం వైపు నిలపడొద్దు అన్నారు.. వివక్షలో కూడా ఎలా ఎదగొచ్చో చెప్పారు…
కర్ణుడు ద్రౌపది విషయంలో మాట్లాడిన దుర్మార్గం… ద్రౌపది, భీముడు తన కులం విషయంలో తక్కువ చేసి మాట్లాడిన దుర్మార్గంతో సమానమే కదా..
Ads
అనంత శ్రీరామ్, భారత రామాయణాల్లో మంచి చెడు రెండూ చెప్పారు.. నిజంగా సినిమాల పైత్యాల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయ్.. అర్జెంటుగా కర్ణుడి వ్యక్తిత్వ హననం చేయాల్సిన పని లేదు..
నీ తాపత్రయం మంచిదే, కానీ తీసుకున్న టాపిక్ సరైనది కాదు.. …. – మారం దిలీప్ కుమార్
కల్కి సినిమా రిలీజైనప్పుడు కర్ణుడు ధూర్తుడా..? గొప్పవాడా..? అర్జునుడికన్నా గొప్పవాడా…? వంటి చర్చలు జోరుగా జరిగాయి… మళ్లీ ఇప్పుడు సినీగేయ రచయిత ఆ చర్చను పునఃప్రారంభించాడు నిన్నటి హైందవ శంఖారావం సభలో కొన్ని వ్యాఖ్యలతో…
మళ్లీ ఇప్పుడు ఆ చర్చతో ఆ శంఖారావం సభ ఎజెండా ఎక్కడోపోయింది… అనవసర చర్చ… ఎందుకంటే..? ఏ పురాణం తీసుకున్నా సరే, ఒక పాత్ర కోణంలో చూస్తే ఒకరకంగా ఉండొచ్చు, మరో పాత్ర కోణంలో చూస్తే మరోరకంగా ఉండొచ్చు…
కర్ణుడు చాలా అంశాల్లో దుర్యోధనుడితో కలిసి నిందితుడు, ధూర్తుడు కావచ్చుగాక… కానీ నిజానికి ఆ భారతంలో అందరికన్నా ఎక్కువ బాధితుడు… కులవివక్షను అనుభవించినవాడు… కానీ వితరణశీలి, నమ్మిన స్నేహధర్మం కోసం నిలబడ్డాడు, నష్టపోయాడు తప్ప శిబిరం మార్చలేదు, వ్యక్తిగా దిగజారలేదు…
రావణుడికి, కర్ణుడికి కూడా గుళ్లున్నాయి ఈ దేశంలో… పూజించేవాళ్లున్నారు… వాళ్లందరూ ధర్మద్రోహులేనా..? హైందవులు కారా..? రావణుడిలో కీర్తించదగిన సుగుణాలు లేవా..? తవ్వుతూ పోతే, విశ్లేషిస్తూ పోతే అనేక ప్రశ్నలు… ఎవరి కోణం వాళ్లది… ఠాట్, కర్ణుడు ధూర్తుడు అనేస్తే ఎలా..? మరి దుర్యోధనుడి పక్షాన నిలిచి పోరాడిన అశ్వత్థామ, ద్రోణుడు, భీష్ముడు కూడా ధర్మద్రోహులేనా..?
కర్ణుడు, అర్జునుడు ఎవరు గొప్ప అనే పోలిక రాసుకుంటూ పోతే మరో మహాభారతం అవుతుంది… అనంత శ్రీరామ్ పరిణతి చాలా తక్కువగా అనిపిస్తోంది… అసలు రామాయణం, భారతం కాల్పనిక గాథలా..? చరిత్రా..? ఈ సందేహాలే ఇప్పటికీ తీరనివి… అది తప్పు, ఇది తప్పు అని జడ్జిమెంట్ పాస్ చేసేంత లోతు జ్ఞానం తనకు ఉన్నట్టు కనిపించదు…
అదంతా ఎలా ఉన్నా సరే, ఆ హైందవ శంఖారావం అసలు ఎజెండా పక్కకు పోవడం మాత్రం నిజం… హిందూ ప్రార్థన స్థలాలపై, ఆస్తులపై సర్కారీ పెత్తనాలు ఏమిటి..? గుళ్ల ఆదాయాన్ని పక్కదారి పట్టించడం ఏమిటి…? మా గుళ్లు మావే, చెర విడిపించండి అనేది ఎజెండా… అది కదా చర్చకు రావల్సింది… ఆర్జిత సేవలు, టికెట్లు, ఇతర వ్యాపార మార్గాలతో గుడిని ఆదాయవనరుగా చేసుకున్నాయి ప్రభుత్వాలు… సో, అనంత శ్రీరామ్ వ్యాఖ్యల మీద చర్చలను పొడిగించడం కూడా అనవసరం..!!
Share this Article