Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆహా… తాజా బాబు జైలు పరిణామాలపై బాలకృష్ణ అన్‌స్టాపబుల్ విసుర్లు…

October 14, 2023 by M S R

మేం తలవంచమని మీకు తెలుసు… మమ్మాపడానికి ఎవరూ రాలేరని మీకు తెలుసు… అనిపించేది అందం, అనుకున్నది చేద్దాం, ఎవ్వడాపుతాడో చూద్దాం…… ఇది బాలకృష్ణ అన్‌స్టాపబుల్ తాజా సీజన్‌ తాలూకు ప్రోమోలో మొదటి డైలాగ్… అది వింటుంటే చంద్రబాబు జైలు, తెలుగుదేశం ఆందోళనలు, కోర్టుల్లో పోరాటాలు, కార్యకర్తల ఆరాటాలు గట్రా గుర్తొస్తున్నాయా..? అబ్బే, ఇది కామన్ అన్‌స్టాపబుల్ డైలాగే అంటారా..? సరే…

సినిమాలో ఐనా, లైఫులో ఐనా అంతా బాగున్నప్పుడే ఒకడు దిగుతాడు… సర్వం నాశనం చేయడానికి బయల్దేరతాడు… మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి బయటికి రావాలి…. ఇది మరో డైలాగ్… పోనీ, ఇది విన్నాకనైనా అనిపిస్తోందా..? మొత్తం నాశనం చేసేవాడు జగన్ అనీ, సెట్ చేయడానికి చంద్రబాబు హీరోలా జైలు నుంచి బయటికి రావాలని బాలయ్య కోరుకుంటున్నాడని… అదీ కాదా..? సరే, ఇక వదిలేయండి…

ఆహా ఓటీటీలో రెండు సీజన్లపాటు బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో నడిచింది తెలుసు కదా… మొదటి సీజన్ సూపర్ హిట్… సెకండ్ సీజన్ అంతగా క్లిక్ కాలేదు… గెస్టుల ఎంపిక సరిగ్గా లేదు, కూర్పు బాగాలేదు… ఏమేమిటోగా సాగిపోయింది… ఒక దశలో గెస్టులు  ఎవరూ రాకపోవడంతో ఎపిసోడ్‌కూ ఎపిసోడ్‌కూ నడుమ గ్యాప్ కూడా వచ్చింది… సరే, ఇప్పుడా సీజన్ల విశ్లేషణలోకి ఎందుకులే గానీ… మరి ఇదెలా ఉండబోతోంది..? ఫ్యాన్లను పిలిచి, వారి ఎదుటే ఎపిసోడ్ షూట్ చేశారు…

Ads

ఇది ఫుల్ ప్లెడ్జ్‌డ్ సీజన్ కాదట… జస్ట్ లిమిటెడ్ ఎడిషన్ అట… అంటే అవసరానికి ప్రచారం చేసుకుని, చాప చుట్టేస్తారన్నమాట… ఉన్నమాటేనండీ బాబూ… తొలి ఎపిసోడ్‌లోనే తన రాబోయే సినిమాకు ప్రమోషన్ చేసుకున్నాడు… నేలకొండ భగవంత్ కేసరో మరొకటో ఓ సినిమా వస్తోంది కదా… అఖండ హ్యాంగోవర్ సినిమా అనుకున్నారు గానీ ట్రెయిలర్లు కాస్త భిన్నంగా బాగానే కనిపిస్తున్నయ్… మరీ శ్రీలీలతో స్టెప్పులు వేస్తూ రొమాన్స్ చేస్తాడా అని జనం కంగారుపడ్డారు గానీ… బిడ్డ పాత్ర అట… కాజల్ హీరోయిన్… వెటరనే కదా, బాలయ్యకు సెట్టయింది…

ఈ ఎపిసోడ్‌కు దర్శకుడు అనిల్ రావిపూడి, కాజల్, శ్రీలీల వచ్చారు గెస్టులుగా… మరో హిందీ నటుడు వచ్చాడు… బహుశా సినిమాలో మరో ప్రధాన పాత్రధారి అయి ఉంటాడు… (అర్జున్ రాంపాాల్..?) ఈమధ్య గ్రౌండ్ ఫ్లోర్ బాపతు బూతులు యథేచ్ఛగా వదులుతున్నాడు కదా… ఈసాారి అనిల్ రావిపూడి దొరికాడు… బాలయ్య బ్లడ్డు బ్రీడ్ బాపతు ఇగో తెలిసినవాడు కదా… బాలయ్య పది చాలు అనుకుంటే వందశాతం విధేయతను కనబరుస్తున్నాడు…

కళ్లద్దాలు ఎక్కడ పెట్టుకుంటావ్, ఎక్కడ పడితే అక్కడ పెట్టుకో… ఇదీ ఓచోట బాలయ్య డైలాగు… తెలిసింది కదా, తను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి ఎదగ.., సారీ ఎక్కలేకపోతున్నాడు… మరి తన బ్లడ్డు, బ్రీడ్ మామూలువా… మనిద్దరం కలిసి ఫస్ట్ టైం చేస్తున్నాం అనిల్ ఏదో చెప్పబోతే… ఏంటీ అని ఏదో గూఢార్థం స్పురించేలా చూశాడు బాలయ్య… ఒకరిద్దరు ఇబ్బందిగా తలలు దించుకున్నారు… హేమిటో బాలయ్య భాషే వేరు… ఒక్క సినిమా ప్రమోషన్ కోసం ఒక పాపులర్ షో లిమిటెడ్ సీజన్, అనగా లిమిటెడ్ ఎడిషన్… ఏమో చెప్పలేం, అఖండ సినిమాకు దంచి కొట్టిన థమన్‌ను, నిర్మాతల్ని, ఫైట్ మాస్టర్లను కూడా పిలిచి మరో ఒకటో రెండో ఎపిసోడ్లు కూడా లాగిస్తాడేమో… వారెవ్వా… జై బాలయ్యా…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎన్సీపీ, శరద్ పవార్ కుటుంబ తదుపరి రాజకీయ వారసుడు ఎవరు..?
  • గళ మాధుర్యం..! నడత, నడక అన్నీ విశేషమే… అరుదైన కేరక్టర్ అర్జీత్…
  • ‘ముసలి సమాజాలు’… రష్యా, చైనా, జపాన్ బాటలో తెలుగు రాష్ట్రాల అడుగులు…
  • ఈ నేరం చేస్తే… శిక్షతో సంస్కరించగలమా..? ‘వ్యక్తి నిర్మూలనే’ మంచిదా..?
  • చైనాలో ఏదో అంతర్గత సంక్షోభం… సైనిక తిరుగుబాటు కుట్ర విఫలం…
  • వార్త అంటే… కొన్నిసార్లు జనానికి తెలియకూడని సమాచారం కూడా…
  • రేవంత్ రెడ్డి కొత్త చదువు ఎందుకు స్పెషల్..? ఏమిటి ఈ కొత్త పాఠాలు..!!
  • ఆ ఎలుకల చెవుల్లో కోరికలు చెప్పుకోవాలి… తరువాత గణేషుడికి చేరతాయి…
  • 500 ఏళ్ల అబద్ధం… తిమ్మరుసును రాయలు శిక్షించనే లేదు… 
  • సింగిల్ కాలమ్ దాటని కథ… నో, నో… పోస్టుకు ఎక్కువ- కథకు తక్కువ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions