Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Unsung Hero of IPL… భువనేశ్వర్ కుమార్… పక్కా పర్‌ఫామర్…

May 4, 2026 by M S R

.

(  గోపు విజయకుమార్ రెడ్డి  ) …. వయసు 36 అంటే పొట్టి క్రికెట్లో ఇక తట్టాబుట్టా సర్దుకునే వయసు… కానీ, భువి వయస్సు పెరుగుతున్నా కొద్దీ మరింతగా రాటుదేలుతున్న వైన్ లాంటి వాడు… ఐపీఎల్ అంటేనే మనీ, ఫేమ్, పవర్… అటువంటి లీగ్ లో తన పని తను నిశ్శబ్దంగా చేసుకుని పోతున్న ఓ అలుపెరుగని బాటసారి…

సొంత PR ఏజెన్సీలు, సోషల్ మీడియా టీంలు ఏమీ లేవు.. బహుశా అందుకేనేమో ఒక్క ఇన్నింగ్స్, ఒక్క మ్యాచ్‌తో కొందరు హీరోలుగా మారుతున్న ఐపీఎల్ లో పెద్దగా మీడియాలో రావలసినంత పేరు రాలేదు భువికి… బ్యాటింగ్ లో కోహ్లీ, రోహిత్, ధోనీలకు ఏమాత్రం తీసిపోని ఈ బౌలర్ ఇంకా ఐపీఎల్ లో తన మార్క్ చూపిస్తుండటం చాలా గ్రేట్…

Ads

ఒక జోఫ్రా ఆర్చర్ లాగా పేస్ ఉండదు, ఒక బుమ్రాలాగా వైవిధ్యం లేదు, కానీ వికెట్లు తీస్తూనే ఉంటాడు.. ఏ సీజన్ లోనైనా సరే, తన టీం రిజల్ట్స్ తో సంబంధం లేకుండా తన పని తను చేసుకొని పోతుంటాడు.. యావరేజ్ బౌలింగ్ స్పీడ్ 132- 135 KM/H … అంటే ఐపీఎల్ లాంటి ఫ్లాట్, జీవం లేని బాటింగ్ పిచ్ లపై మనోడు ఎప్పుడో తెరమరుగు కావలసినోడు…

కానీ ఇప్పటికీ దాదాపు 15 సీజన్ల తర్వాత కూడా లీగ్ లో వన్ అఫ్ ది బెస్ట్ బౌలర్ తనే… దానికి చిన్న ఉదాహరణ… గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సాయి సుదర్శన్ ని అవుట్ చేసిన తీరు… ప్రాపర్ లైన్ అండ్ లెంగ్త్ బాల్ అది… ఎంతో టెక్నిక్ ఉంటే తప్పించి అటువంటి బంతులని ఆడలేరు… ఇంకోటి జోస్ బట్లర్ కి వేసిన ఫుల్ లెంగ్త్ యార్కర్… లెగ్ స్టంప్ ఎగిరి అవతల పడింది…

ఇప్పటి వరకు ఈ సీజన్లో 42 మ్యాచులు జరిగితే, 200 రన్స్‌కు పైగా నమోదయిన మ్యాచులు 30… భువి ఎకానమీ రేట్ 7.4 రన్స్ పర్ ఓవర్… అంటే దంచుడే దంచుడు లాంటి పిచ్ లపైన కూడా ఎంత ప్రభావం చూపిస్తున్నాడో అర్ధం చేసుకోవాలి…

విరాట్ కోహ్లీ అన్నట్టు భువి వయస్సు పెరుగుతున్న కొద్దీ మోర్ డేంజరస్ గా మారుతున్నాడు అనడానికి ఈ క్రింది పట్టికనే example. వీరేందర్ సెహ్వాగ్ అన్నట్టు, మళ్ళీ బుమ్రా, భువి ఇండియన్ నేషనల్ టీంకి జత కట్టినా ఆశ్చర్యం లేదు…

భువనేశ్వర్

ఒక్కో సీజన్ కు ఒక్కో టీం మారిపోయే ఈ జనరేషన్ లో దాదాపు 16 ఇయర్స్ మనోడు ఆడింది కేవలం మూడు జట్లకే అంటే కొంచెం ఆశ్చర్యమే… దానిలో ఒకటి టెంపరరీ పూణే జట్టు… ప్లేయర్స్ రిటెన్షన్లలో సన్‌రైజర్స్ యాజమాన్యం ఇప్పటికీ బాధపడేది ఏదయినా ఉందంటే భువిని రిటైన్ చేసుకోలేకపోవడమే.. 16 ఏళ్ళ కెరీర్…  2009 లో RCB తో మొదటి రెండు సంవత్సరాలు… అవకాశాలు ఏమీ రాలేదు.. అందుకే పూణేకు… అక్కడినుండి హైదరాబాద్ కు… మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే, అంటే బెంగుళూరుకు.. బహుశా ఇక ఇదే ఐపీఎల్ చివరి మజిలీ అనుకుంటా…

199 మ్యాచులు, 215 వికెట్లు, 7.68 ఎకానమీ… రెండుసార్లు పర్పుల్ కాప్ హోల్డర్..16 ఇయర్స్ అఫ్ కన్సిస్టెన్సీ. లాయల్ to టీం మేనేజమెంట్.. జీరో కంట్రవర్సీ.. నో హై ప్రొఫైల్.. తెలిసింది ఒక్కటే లైన్ అండ్ లెంగ్త్ తో సీజన్ ఆఫ్టర్ సీజన్ బౌలింగ్ చెయ్యడమే…

బహుశా ఐపీఎల్ లో బుమ్రా అంతటి పేరు రాకపోవడానికి ముంబయ్ క్రికెట్ లాంటి లాబీయింగ్ లేని ఉత్తరప్రదేశ్ ఘజీయాబాద్ నుంచి రావడమేనేమో.. భువీ,, నువ్వు ట్రూ రోల్ మోడల్ ఫర్ కరెంట్ అండ్ అప్‌కమింగ్ ఐపీఎల్ ప్లేయర్స్.. ‘ముచ్చట’ నుండి సలాం భువి భాయ్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Unsung Hero of IPL… భువనేశ్వర్ కుమార్… పక్కా పర్‌ఫామర్…
  • IPL 2026… తోపుల తోకలు కత్తిరించబడ్డయ్… పంజాబ్, హైదరాబాద్ ఓటమి…
  • ’వారణాసి‘కి నీటిఎద్దడి… జలమండలి నిర్ణయం భేష్… కానీ..?
  • రష్మిపై బూతుల ట్రోలింగు… భయపడటం లేదు, బదులిస్తోంది…
  • పాప్ స్టార్‌తో రెండు హాట్ సాంగ్స్… పైగా వాణి విశ్వనాథ్ హొయలు…
  • టిఫినీల్లో రారాజు మసాలా దోశ… టేస్ట్ అట్లాస్ కూడా అదే చెప్పింది…
  • ‘టాక్సిక్… బోల్డ్‌నెస్ ఎక్కువైంది… కాస్త కత్తిరించి, నా ఇజ్జత్ కాపాడండి ప్లీజ్’…
  • వైభవ్ బలహీనతల్ని పట్టుకున్న ఎఐ… ఔట్ చేసేస్తున్నారు…
  • సిగ్గూజ్ఞానం లేనిది మన మీడియాకే… గుడ్డిగా పెడబొబ్బలు, శోకాలు…
  • పోయింది, గాన్, గయా, పోయి, పొచ్చు… ‘ఏక్‌దిన్’మే ఖల్లాస్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions