Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రోజుల శిశువుకు ఉప్మా తినిపించిందట… నోరుజారింది, పట్టుబడిపోయింది…

April 1, 2023 by M S R

బెంగుళూరు… మగది రోడ్ దగ్గరలోని బిన్నీ మిల్ ఏరియా… నలభయ్యేళ్ల హేమావతి తన కొడుకుతో ఎటో వెళ్తోంది… కంఠీరవ క్రాంతివీర సంగోలి రాయన్న మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఓ గుంపును దాటేటప్పుడు ఓ శిశువును ఎత్తుకున్న ఓ మహిళ కనిపించింది… మరీ రోజులనాటి పసి శిశువులా కనిపిస్తోంది… గుక్క పెట్టి ఏడుస్తోంది… శిశువును ఎత్తుకున్న మహిళకు ఊరడించడం చేతకావడం లేదు… హేమవతిలో అనుమానం మొలకెత్తింది… ఏదో కృత్రిమత్వం, అసహజత్వం కనిపిస్తోంది… ఆమె కూడా ఓ తల్లి కదా…

ఏయ్, ఎవరు నువ్వు..? నీ బిడ్డేనా..? అనడిగింది… అవును అందామె తడబడుతూ… ఆ తడబాటు చూశాక హేమావతిలో సందేహాలు మరింత బలపడ్డాయి… ఇది ఖచ్చితంగా పిల్లల్ని ఎత్తుకుపోయే కేరక్టరే అనుకుంది… ఎందుకు ఏడుస్తోంది..? ఏం తినిపించినవ్..? ఏం తాపించినవ్..? అని గట్టిగా అడిగింది… ఆమె ‘ఉప్మా మరియు పాలు పట్టించాను’ అని బదులిచ్చింది… ఇంకేముంది..? హేమవతికి దొరికిపోయింది… రోజుల శిశువుకు ఉప్మా తినిపించడం ఏమిటి..?

Ads

ఇది గమనిస్తున్న హేమావతి పొరుగింటావిడ నాగమ్మ అక్కడికి వచ్చింది పరుగుపరుగున… తనూ ప్రశ్నలు వేయసాగింది… ఏందమ్మా, నన్ను దబాయిస్తున్నారు..? నేనేమైనా పిల్లల్ని ఎత్తుకుపోయేదానిలా కనిపిస్తున్నానా..? అని ఉల్టా అరవసాగింది ఆ శిశువును ఎత్తుకున్నామె… హేమావతికి మరింత చిర్రెక్కింది… ఏమండీ బాలసుబ్రహ్మణ్యం గారూ, భోపాల్ గారూ, విష్ణు గారూ, హేమంత్ ఓసారిలా రండి అని అరిచింది… వాళ్లు వస్తూ వస్తూ 112 పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి, అడ్రెస్ చెప్పి, అర్జెంట్ అని అలర్ట్ చేశారు… ఆ పరిసరాల్లోనే ఉన్న ఓ పోలీస్ పెట్రోలింగ్ వెహికిల్ వెంటనే అక్కడికి వచ్చింది… సూపర్…

ఈలోపు హేమావతి కజిన్ ప్రియాంక ఆ మహిళ చేతిలోని శిశువును లాక్కోబోయింది, ఆమె ప్రియాంక మీదపడిపోతూ కొట్టడంతో ఇక వెనక్కి తగ్గింది… పోలీసులు ఇన్వాల్వయిపోయి, ఆ ఆడ శిశువును లాక్కొన్నారు, నాగమ్మ చేతుల్లో పెట్టారు… ఆమె శిశువును వెంటనే రైల్వే హాస్పిటల్‌కు తీసుకుపోయింది… డాక్టర్లు పరీక్షించి శిశువు సంపూర్ణ ఆరోగ్యంగా ఉందనీ చెప్పారు…

ఇంతకీ ఆమె ఎవరు..? పేరు నందిని అలియాస్ ఆయేషా… ముల్బగల్‌, కోలార్ నేటివ్… శివాజీనగర్‌లో ఉంటోంది… అదుపులోకి తీసుకుని నాలుగు తగిలించేసరికి నిజాలు చెప్పేసింది… ఆ శిశువును కలిసిపాల్యా, దుర్గమ్మ టెంపుల్ స్ట్రీట్ నుంచి ఎత్తుకొచ్చినట్టు అంగీకరించింది… అప్పటికప్పుడు పోలీసులు ఆ శిశువును తీసుకెళ్లి తల్లికి అప్పగించారు… జస్ట్, గంటారెండు గంటల్లో జరిగిపోయింది ఇదంతా…

ఇంతకీ ఆ శిశువు తల్లి ఎవరో తెలుసా..? కలసిపాల్యాలో ఉండే ఫర్హీన్ బేగం…. డెలివరీ కోసం పుట్టింటికి వచ్చింది… హాల్లో శిశువుకు పాలిచ్చి, నిద్రొస్తే అలా ఒరిగింది… ఈలోపు నందిని అలియాస్ ఆయేషా ఆ శిశువును ఎత్తుకుని వెళ్లిపోయింది… బిడ్డ కనిపించకపోయేసరికి ఆ కుటుంబం అప్పటికే పోలీసులకు రిపోర్ట్ చేసింది… ఈ సమాచారం ప్రతి పోలీస్ స్టేషన్‌కు చేరవేశారు అప్పటికే పోలీసులు… వెతుకులాట ప్రారంభమైంది కూడా… ఈలోపు హేమావతికి నిందితురాలి మీద సందేహాలు రావడం, మిగతా కథంతా చదివారు కదా…

నిందితురాలిని పట్టించిన వారందరినీ డీసీపీ లక్ష్మణ్ నింబార్గి అభినందించాడు… అదంతా వేరే కథ ఇక… ఇంతకీ ఈ నేరకథలోని నీతి ఏమిటయ్యా అంటే… దొంగతనం ఈజీ కాదు, మనం ఏం దొంగతనం చేస్తున్నామో దానికి సంబంధించిన పూర్వాపరాలు, విషయాలు అన్నీ నేర్చుకుని, సాధన చేసి, ఆకళింపు చేసుకుని గానీ దొంగతనానికి వెళ్లొద్దు…. అంతేకదా మరి… రోజుల శిశువుకు ఉప్మా తినిపించానని చెబితే డౌట్ రాదా మరి..?! ఉప్మా కడుపు నింపడమే కాదు, ఇలా కూడా మేలు చేస్తుందన్నమాట…!!

ఇదే నేరకథ మన పత్రికల్లో ఎలా వస్తుందో తెలుసా..? ‘‘నలభై రోజుల శిశువును ఎత్తుకుపోతున్న ఓ మహిళా దొంగను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు… పోలీసులు ఆ శిశువును తల్లికి అప్పగించి, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక డీసీపీ లక్ష్మణ్ విలేకరులకు తెలిపారు… ప్రజలు ఇలాంటి దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు…’’ ఇక టీవీల్లో ఎలా వస్తుందని అంటారా..? వద్దులెండి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమృతాంటీ… మరీ అనసూయాంటీ ఆవహించిందా ఏమిటి..?!
  • డాక్టర్ సాబ్… 20 ఏళ్ల క్రితం నా ప్రాణాలు కాపాడారు గుర్తుందా..?
  • నవలా రాక్షసుడు + సినిమా రాక్షసుడు + నట రాక్షసుడు…!!
  • ఐఫోన్-17 సీరీస్… ఈ కొత్త మోడళ్ల అదిరిపోయే కీలక ఫీచర్స్ ఇవే…
  • ‘‘నీ పేరే పెట్టుకున్నాం, మా డ్రగ్ రాకెట్‌ను ఆశీర్వదించు మాతా…’’
  • లిటిల్ హార్ట్స్ సక్సెస్ సినిమా ఇండస్ట్రీకి చెబుతున్న పాఠమేమిటంటే..!
  • ఏమో, రమ్యకృష్ణే కావాలని ఆ బాహుబలి నిర్మాతే కోరుకున్నాడేమో…!
  • కాదు… ఆమె మరో షర్మిల కాదు… రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం ఉంటుంది…
  • మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్… జనాగ్రహం బద్దలు..!
  • … బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ సైద్ధాంతిక గందరగోళం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions