.
Pardha Saradhi Upadrasta … USA వలసదారులకు భారీ షాక్ – వందల వేల కుటుంబాలు గందరగోళంలో!
అమెరికా ప్రభుత్వం 19 దేశాల నుండి వచ్చే ఇమ్మిగ్రేషన్ కేసులు, వీసా అప్లికేషన్లు, న్యాచురలైజేషన్ (సిటిజెన్షిప్) ప్రక్రియలను పూర్తిగా నిలిపివేసింది.
దీంతో ఆ దేశాల ప్రజల్లో ఆందోళన పెరిగింది.
Ads
నిలిపివేసిన దేశాలు
అఫ్గానిస్తాన్, బర్మా, బురుండి, తుర్కమెనిస్తాన్, ఇరాన్, యెమెన్, సోమాలియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, చాద్, లిబియా, సూడాన్, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, సియెర్రా లియోన్, టోగో, వెనిజులా, క్యూబా, హైతి…
1) U.S లో ఇప్పటికే ఉన్నవారికి పౌరసత్వ ము ఇచ్చే కార్యక్రమాలు కూడా వాయిదా / నిలిపివేత.
2) TPS (Temporary Protected Status) రద్దు అవకాశమూ
3) అమెరికాలో ప్రస్తుతం నివసిస్తున్న 3,48,187 హైతీ పౌరుల TPS రద్దు పరిశీలనలో
4) రద్దైతే — అక్రమ వలసదారులుగా పరిగణించబడి ICE ద్వారా డిపోర్ట్ అయ్యే ప్రమాదం
5) సోమాలియా TPS కూడా రద్దు చేసే ప్రతిపాదన → మిన్నిసోటాలో భారీ మోసాల కేసులు నేపథ్యంగా
TPS అంటే ఏమిటి?
TPS = ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారికి U.S ఇచ్చే తాత్కాలిక రక్షణ & వర్క్ పర్మిట్
ఇది Permanent Residency లేదా Citizenship కాదు
ఇది ఎప్పుడు అయినా రద్దు చేయవచ్చు.
ఈ స్టెప్ ఎందుకో? (అసలు కారణాలు)
U.S National Security… : రీసెంట్‌గా U.S లో జరిగిన మిలిటరీ/రాజకీయ దాడుల తరువాత, వలస బ్యాక్‌గ్రౌండ్ స్క్రీనింగ్ మరింత కఠినం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది
High-Risk Country Category…. : ఈ 19 దేశాలు “High Security Concern Nations”గా గుర్తించబడ్డాయి..
Immigration Fraud Issues… ; Minnesota సహా పలు రాష్ట్రాల్లో వలస దారులు మోసాల కేసులు వెలుగులోకి రావడం
Policy Shift “Citizenship is a privilege, not a right” అన్న సూత్రంతో వలస విధానంలో కఠిన మార్పు
ఇది ప్రజల మీద ఎలా ప్రభావం చూపుతుంది?
వేలాది కుటుంబాలు తమ భవిష్యత్తుపై అనిశ్చితిలో
వర్క్ పర్మిట్లు, ఉద్యోగాలు, నివాస హక్కులు ప్రమాదంలో
Legal status కోల్పోయే రిస్క్
ICE Raids & Deportation chances పెరుగవచ్చు
సారాంశం
అమెరికా ఇప్పుడు Security-First పద్ధతిలోకి మారింది. ఎవరికి పడితే వారికి తాత్కాలిక పౌరసత్వాలు ఇచ్చే పరిస్థితి పోయింది.
వలస విధానం కఠినం
కుటుంబాలకు, ఉద్యోగాలకు పెద్ద ప్రమాదం
అమెరికా వలసదారులకు అమెరికా కల ఇప్పుడు మరింత దూరమైంది…. — ఉపద్రష్ట పార్ధసారధి
#USAImmigration #TPS #ImmigrationBan #ICE #Haiti #Somalia #MigrationCrisis #USPolitics #NationalSecurity #PardhaTalks
Share this Article