Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈసారి భద్రతా వ్యవస్థలోనే..! కొనసాగుతున్న అమెరికా *టెక్ కష్టాలు !!

November 18, 2026 by M S R

.

మొన్నటి నుంచీ చెప్పుకుంటున్నాం కదా… అమెరికా సాంకేతిక వ్యవస్థలన్నీ పరీక్షకు గురవుతున్నాయి… అవి సైబర్ అటాకా..? ఎఐ వైఫల్యాలా..? అతిగా టెక్నాలజీపై ఆధారపడటమా..? ఇంకేదైనా కుట్ర జరుగుతోందా..? ప్రస్తుతానికి అంతర్గత సాంకేతిక వైఫల్యాలు అని బయటికి చెబుతున్నా సరే… సందేహాలు మాత్రం ముసురుకుంటూనే ఉన్నాయి…

అవి బలపడటానికి కారణం… చివరకు అత్యంత కీలకమైన, రహస్యమైన భద్రత నెట్‌వర్క్‌కు కూడా అంతరాయాలు ఏర్పడటం… ఆమధ్య ఏదో దేశంలోని ఓ సప్లయ్ చెయిన్‌కు సంబంధించిన ప్రతి షాపులో ఫ్రీజర్లు చెడిపోయాయి… ఒకేసారి… ఒకదానికొకటి ఇంటర్ లింక్డ్… ఏదో సాఫ్ట్ వేర్ ప్రోగ్రాం ద్వారా… ఒక బగ్ మొత్తం కూల్చేయగలదు… ఓవర్ డిపెండెన్సీ…

Ads

అమెరికా విషయానికి వద్దాం… మైక్రోసాఫ్ట్… విమానయానం స్థంభన… బ్యాంకు సేవల్లో అంతరాయాలు… పేమెంట్స్ సంబంధ కంపెనీల్లో చిక్కులు… వరుస సాంకేతిక అంతరాయాలు… బ్యాంకింగ్, విమానయానం నుంచి అత్యంత రహస్యమైన NSA నెట్‌వర్క్ వరకు ప్రభావం!

నవంబర్ 17న అమెరికా జాతీయ భద్రతా సంస్థ (NSA) అత్యంత రహస్య సమాచార మార్పిడి నెట్‌వర్క్‌ నిలిచిపోయినట్లు CNN ప్రత్యేక కథనంతో సహా పలు నివేదికలు వెల్లడించాయి… అమెరికా జాతీయ భద్రతా సంస్థ (National Security Agency – NSA) ఉద్యోగులు అత్యంత రహస్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే NSA Net అనే అంతర్గత నెట్‌వర్క్ పనిచేయడం నిలిచిపోయింది…

us tech failures continue

కీలకమైన విషయం ఏమిటంటే… ఈ అంతరాయం కారణంగా అమెరికా అధ్యక్షుడికి అందించాల్సిన అత్యవసర నిఘా సమాచార పంపిణీకి ఆటంకం కలగలేదు… ప్రత్యామ్నాయ బ్యాకప్ వ్యవస్థల ద్వారా ఆ సమాచార మార్పిడి కొనసాగుతోంది…

ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక నివేదికల్లో పలు సాంకేతిక అంతరాయాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం లేదా AI ఆధారిత సాంకేతిక మార్పులే కారణమని గానీ, సైబర్ అటాక్స్ అని గానీ ఎక్కడా నిర్ధారించలేదు… కానీ..?

JPMorgan ఘటనకు ఆన్-ప్రెమైజ్ హార్డ్‌వేర్ వ్యవస్థల్లో సాఫ్ట్‌వేర్ బగ్ కారణమని పేర్కొన్నారు… United Airlines ఘటనకు పైలట్ యాప్‌లలో అంతర్గత సాంకేతిక సమస్య కారణం… NSA Net విషయంలో సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్లతో సంబంధం ఉండవచ్చనే సమాచారం మాత్రమే ఉంది…

కానీ, AI వినియోగం పెరుగుతున్న కొద్దీ సాంకేతిక వ్యవస్థల్లో సంక్లిష్టత కూడా పెరుగుతోందని విస్తృతంగా చర్చ జరుగుతోంది… కొన్ని నివారణ మార్గాలు…
🔹 Exhaustive Testing: ఏదైనా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లేదా అప్‌గ్రేడ్‌ను అమలు చేయడానికి ముందు అన్ని పరిస్థితుల్లోనూ సమగ్ర పరీక్షలు నిర్వహించాలి.
🔹 Staged Rollouts: కొత్త అప్‌డేట్లను ఒకేసారి అన్ని వ్యవస్థల్లో అమలు చేయకుండా దశలవారీగా ప్రవేశపెట్టాలి. సమస్యలు కనిపిస్తే వెంటనే నిలిపివేసే అవకాశం ఉండాలి.

🔹 Redundancy & Failover: ప్రధాన వ్యవస్థలు విఫలమైనప్పుడు ప్రత్యామ్నాయ వ్యవస్థలు వెంటనే బాధ్యతలు స్వీకరించేలా బలమైన బ్యాకప్, ఫెయిలోవర్ సామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవాలి.
🔹 Manual Procedures: డిజిటల్ వ్యవస్థలు పనిచేయని పరిస్థితుల్లో కూడా కార్యకలాపాలు కొనసాగించడానికి అవసరమైన మాన్యువల్ విధానాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
🔹 Reliability Engineering: సాంకేతిక వ్యవస్థల్లో సంక్లిష్టత పెరుగుతున్న కొద్దీ వాటి విశ్వసనీయత, భద్రత, నిరంతర కార్యకలాపాల కోసం కూడా అంతే స్థాయిలో పెట్టుబడులు పెట్టాలి.

టెక్నాలజీ ఎంత ఆధునికమైనదైనా, ఒక చిన్న సాఫ్ట్‌వేర్ బగ్ లేదా అప్‌గ్రేడ్‌లోని లోపం కీలకమైన వ్యవస్థలన్నింటికీ వరుసగా సమస్యలు సృష్టించగలదు. అందుకే కేవలం కొత్త టెక్నాలజీని స్వీకరించడం మాత్రమే కాదు.. అది విఫలమైనప్పుడు కూడా వ్యవస్థలు పనిచేసేలా రూపొందించడం అత్యంత ముఖ్యం.
Technology Advancement ఎంత ముఖ్యమో, Technology Reliability కూడా అంతే ముఖ్యం!   (పార్థసారథి ఉపద్రష్ట నుంచి కొన్ని ఇన్‌పుట్స్ ఆధారంగా)…

.

Update… తాజాగా Apple system down…

.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈసారి భద్రతా వ్యవస్థలోనే..! కొనసాగుతున్న అమెరికా *టెక్ కష్టాలు !!
  • ప్రతి పేద ఇంటికీ సర్కారీ భరోసా – రేవంత్ రెడ్డి గుర్తుండిపోతాడు
  • ఎవరి కోసం… ఈ హఠాత్ వరుస టెక్ ఇక్కట్లు !!
  • ‘‘సాక్షి బురద రాతలు- రోత రాతలు- నీచపు రాతలు- తప్పుడు కూతలు’’
  • మరో బాబా బయోపిక్ రుద్రయోగి! కానీ నిజచరిత్ర తెలియని మర్మయోగి!!
  • తెలుగు సీఎస్‌లు ఏం చేయగలరు పాపం..? శబరిమలలో బట్టల పంచాయితీ!
  • సాయి పల్లవిని టార్గెట్ చేసేందుకే ‘మాండవి’ని పైకి లేపారు !!
  • 007 కథ ముగిసిపోలేదు – అదుగో కొత్త జేమ్స్ బాండ్ వస్తున్నాడు…
  • మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక భేటీలు!- సుప్రియా సూలేకు పగ్గాలు?
  • రామోజీ స్మరణ సరే… కానీ ఎవరి జయంతి రాష్ట్ర ఉత్సవం కావాలి..? కొలమానాలేమిటి..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions