.
Pardha Saradhi Upadrasta …. అమెరికా వీసాలపై భారీ నిర్ణయం … 75 దేశాలకు వీసా ప్రాసెసింగ్‌కు తాత్కాలిక నిలుపుదల
అమెరికా US State Department జనవరి 21, 2026 నుంచి 75 దేశాల పౌరులకు సంబంధించిన అన్ని వీసాల ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది.
Ads
స్టేట్ డిపార్ట్‌మెంట్ మెమో ప్రకారం… వీసా దరఖాస్తుదారుల్లో భవిష్యత్తులో Public Charge (ప్రభుత్వంపై ఆధారపడే అవకాశం ఉన్నవారు) అయ్యే ప్రమాదం ఉన్నవారిని అడ్డుకునే ఉద్దేశంతో ప్రస్తుత చట్టాల ప్రకారమే కాన్సులర్ అధికారులు వీసాలను నిరాకరించాలని ఆదేశాలు… స్క్రీనింగ్ & వెట్టింగ్ విధానాలపై పునఃసమీక్ష పూర్తయ్యే వరకు ఈ నిలుపుదల అనిర్దిష్ట కాలం కొనసాగుతుంది…
Fox News నివేదిక ప్రకారం ఈ జాబితాలో ఉన్న దేశాలు ఇవి
Afghanistan 🇦🇫, Albania 🇦🇱, Algeria 🇩🇿, Antigua and Barbuda 🇦🇬, Armenia 🇦🇲, Azerbaijan 🇦🇿, Bahamas 🇧🇸, Bangladesh 🇧🇩, Barbados 🇧🇧, Belarus 🇧🇾, Belize 🇧🇿, Bhutan 🇧🇹, Bosnia 🇧🇦, Brazil 🇧🇷, Burma 🇲🇲, Cambodia 🇰🇭, Cameroon 🇨🇲, Cape Verde 🇨🇻, Colombia 🇨🇴, Cote d’Ivoire 🇨🇮, Cuba 🇨🇺, DR Congo 🇨🇩, Dominica 🇩🇲, Egypt 🇪🇬, Eritrea 🇪🇷, Ethiopia 🇪🇹, Fiji 🇫🇯, Gambia 🇬🇲, Georgia 🇬🇪, Ghana 🇬🇭, Grenada 🇬🇩, Guatemala 🇬🇹, Guinea 🇬🇳, Haiti 🇭🇹, Iran 🇮🇷, Iraq 🇮🇶, Jamaica 🇯🇲, Jordan 🇯🇴, Kazakhstan 🇰🇿, Kosovo 🇽🇰, Kuwait 🇰🇼, Kyrgyzstan 🇰🇬, Laos 🇱🇦, Lebanon 🇱🇧, Liberia 🇱🇷, Libya 🇱🇾, Macedonia 🇲🇰, Moldova 🇲🇩, Mongolia 🇲🇳, Montenegro 🇲🇪, Morocco 🇲🇦, Nepal 🇳🇵, Nicaragua 🇳🇮, Nigeria 🇳🇬, Pakistan 🇵🇰, Republic of the Congo 🇨🇬, Russia 🇷🇺, Rwanda 🇷🇼, St Kitts & Nevis 🇰🇳, St Lucia 🇱🇨, St Vincent & Grenadines 🇻🇨, Senegal 🇸🇳, Sierra Leone 🇸🇱, Somalia 🇸🇴, South Sudan 🇸🇸, Sudan 🇸🇩, Syria 🇸🇾, Tanzania 🇹🇿, Thailand 🇹🇭, Togo 🇹🇬, Tunisia 🇹🇳, Uganda 🇺🇬, Uruguay 🇺🇾, Uzbekistan 🇺🇿, Yemen 🇾🇪.
గమనిక: ఈ జాబితా మీడియాలో వచ్చిన నివేదికల ఆధారంగా ఉంది… తుది నిర్ధారణ కోసం అధికారిక అమెరికా ప్రభుత్వ ప్రకటనలను తప్పక పరిశీలించాలి… వీసా నియమాలు, దేశాల జాబితా మారే అవకాశం ఉంది…
ఇది అమలులోకి వస్తే ప్రభావం ఎవరిపై?
✔️ స్టూడెంట్ వీసాలు
✔️ వర్క్ వీసాలు
✔️ టూరిస్ట్ వీసాలు
✔️ ఇతర అన్ని నాన్-ఇమ్మిగ్రెంట్ & ఇమ్మిగ్రెంట్ వీసాలు
అమెరికా వలస విధానాల్లో ఇది మరో కీలక మలుపు అని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా US State Department విడుదల చేసిన లిస్టు ప్రకారం అమెరికాలో ఒక్క భారతీయుడు కూడా అక్కడి ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలు, అమెరికా ప్రభుత్వం నేరుగా ఇచ్చే ఉచిత సదుపాయాలు ( ఇళ్లు , నిరుద్యోగ భృతి, కొన్ని రకాల పింఛన్ లు etc) పొందటం లేదు.
అక్కడకు వెళ్ళిన ప్రతి భారతీయుడు కష్టపడి తన జీతం తాను సంపాడించుకుంటున్నట్లు నివేదికలు చెప్పాయి. తనకు సరి పడే ఉద్యోగం రాకపోయినా ఏదో ఒక odd Job చేసి బతుకుతారు. … — ఉపద్రష్ట పార్ధసారధి
#PardhaTalks #USVisa #USStateDepartment #VisaBan #ImmigrationPolicy #GlobalNews #America #PublicChargeRule #BreakingNews
Share this Article