.
( పొట్లూరి పార్థసారథి ) …. అమెరికా Vs రష్యా, చైనా! 2026వ సంవత్సరంలో ఏమేమి జరగబోతున్నాయో భవిష్య వాణి వినిపించే బాబ వంగ ( Vangelia Gushterova- వంగెలియా గుస్తేరోవా) చెప్పినవి చెప్పినట్లుగానే జరుగుతున్నాయి!
బల్గేరియా దేశానికి చెందిన బాబ వంగ 1911 లో ఉత్తర మేసిడోనియాలో పుట్టింది. తన జీవితంలో ఎక్కువ భాగం బల్గేరియాలో గడిపింది! చిన్నతనంలో ఒక టోర్నడోలో చిక్కుకొని కళ్ళు పోగొట్టుకుంది! కానీ కొన్ని అధ్బుత శక్తులతో భవిష్యత్ గురుంచి చెప్పేది.
Ads
1996 లో బాబ వంగ చనిపోయింది! బాబా వంగ ముందే చెప్పిన కొన్ని చారిత్రిక సంఘటనలు… 1. రెండవ ప్రపంచ యుద్ధం గురుంచి ముందే చెప్పింది. 2. రష్యాలోని చేర్నో బిల్ అణు విద్యుత్ కేంద్రం ప్రమాదవశాత్తు పేలిపోయి జన నష్టం జరుగుతుందని చెప్పింది, అది జరిగింది. 3. అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద దాడి (09/11) జరిగి వందలాది పౌరులు మరణిస్తారని చెప్పింది. అది జరిగింది. 4. ముస్లిమ్ సంతతికి చెందిన ఆఫ్రికన్ అమెరికా అధ్యక్షుడు అవుతాడని చెప్పింది. బరాక్ ఒబామా అధ్యక్షుడు అయ్యాడు.
5. రష్యన్ సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది అని చెప్పింది. అది జరిగింది. 6. 1991 లో USSR కుప్పకూలి, కఠినమైన గుండె కలిగినవాడు రష్యాకి అధిపతిగా వస్తాడని చెప్పింది. పుతిన్ రూపంలో 2001 లో వచ్చాడు. 1996 లో బాబ వంగ చనిపోయిన తరువాత కూడా చాలా వరకూ చెప్పినవే జరుగుతూ వస్తున్నాయి. నొస్ట్రాడమస్ అఫ్ బాల్కన్స్ అని బాబ వంగకి బిరుదు!
1996 లో చనిపోయిన బాబ వంగ ప్రసక్తి ఇప్పుడెందుకు? బాబ వంగ 2026 లో జరగబోయే భౌగొళిక స్థిగతుల గురుంచి ముందే చెప్పింది కాబట్టి… 2026 లో ప్రపంచవ్యాప్తంగా అగ్ని పర్వతాలు ఒకేసారి ప్రజ్వరిల్లుతాయి అని జోస్యం చెప్పింది. అయితే 2025 డిసెంబర్ నుండే అగ్నిపర్వతాలు ఒక్కోటి ప్రజ్వరిల్లడం మొదలయ్యింది. 2025 డిసెంబర్ 30 నాటికి ప్రపంచవ్యాప్తంగా 71 అగ్నిపర్వతాలు ప్రజ్వరిల్లాయి!
స్మిత్ సోనియన్ / USGS డేటా ప్రకారం గత డిసెంబర్ నెలలో కొత్తగా 29 చోట్ల అగ్నిపర్వతాలు ఆక్టివ్ అయి బూడిద, లావాని వెదజల్లుతున్నాయి ఇప్పటికీ! కలవరపరిచే అంశం ఏమిటంటే అంటార్కిటికాలో నిద్రాణ స్థితిలో ఉన్న అగ్నిపర్వతం యాక్టివ్ అయి లావాని వెదజల్లడం! అది లావాని వెదజల్లడం కొనసాగుతూ పొతే మంచు ఫలకాలు వేడికి కరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగితే తీర ప్రాంతాలలో ఉన్న నగరాలు మునిగిపోయే అవకాశం ఉంది!
రింగ్ ఆఫ్ ఫైర్ లేదా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ( Ring of fire or Pacific Ring of Fire) గా పిలవబడే తీవ్ర భూకంపాలు ఏర్పడే జోన్ లో ఇప్పటికే తీవ్ర భూకంపాలు రావడానికి సూచనగా అగ్నిపర్వతాలు యాక్టివ్ అవుతున్నాయి. పసిఫిక్ రింగ్ అఫ్ ఫైర్ జోన్ లోకి వచ్చే దేశాలు మొత్తం 15 ఉన్నాయి అవి: ఇండోనేసియా, న్యూ జీలాండ్, ఫీలిప్పిన్స్, జపాన్, యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా, కెనడా, రష్యా, గ్వాటేమాల, పేరూ, చిలీ దేశాలు ఉన్నాయి.
రష్యాలో ఒక అగ్నిపర్వతం యాక్టివ్ అయ్యింది ఇప్పటికే. అమెరికాలోని ఎల్లో స్టోన్ పార్క్ లో మరో అగ్నిపర్వతం యాక్టివ్ అయ్యింది గత డిసెంబర్ లో. ఈ 15 దేశాలు కూడా అగ్నిపర్వతాల వల్ల తీవ్రంగా నష్టపోవాల్సిందే!
బాబ వంగ చెప్పిన మరొక జోస్యం 2026 లో ప్రపంచ యుద్ధం జరుగుతుందని! తూర్పు తీరంలో రెండు దేశాల మధ్య చిన్నగా యుద్ధం మొదలయ్యి అది క్రమంగా ప్రపంచదేశాలకి విస్తరిస్తుంది అని! ఇది తైవాన్ ని చైనా ఆక్రమించుకునే క్రమంలో మూడవ ప్రపంచ యుద్ధం మొదలవుతుందా? ఇప్పటికే ఆ సూచనలు కనపడుతున్నాయి!
తూర్పు తీరంలో ప్రస్తుతం ఉన్నవి రెండే వార్ జోన్లు! చైనా-తైవాన్, భారత-పాకిస్థాన్ లు. ఆపరేషన్ సిందూర్ కి తాత్కాలిక విరామం మాత్రమే ప్రకటించింది భారత్! ఇక తైవాన్ ద్వీపం చుట్టూ చైనా తన నావీని మొహరించి యుద్ధ విన్యాసాలు చేస్తున్నది చాలా సీరియస్ గా! ఈసారి వార్ డ్రిల్స్ లో నిజమైన రాకెట్స్, మిసైల్స్ ని ఉపయోగిస్తున్నది చైనా కాబట్టి తైవాన్ ఆక్రమణకి పూనుకోవచ్చు! తైవాన్ కి సహాయంగా అమెరికా ఉంటుంది కాబట్టి….. ముందు చైనాకి క్రూడ్ ఆయిల్ సప్లై తగ్గించే ప్రయత్నంలో భాగంగా వెనుజులా మీద దాడికి దిగింది అమెరికా!
****
Share this Article