.
ఏసేశాడు, మళ్లీ ఏసేశాడు…. ఈ ఫేమస్ డైలాగ్ అందరికీ పరిచయమే కాదు… దీన్ని వాడే సందర్భాలు వేర్వేరు, మీమ్స్‌లో మాత్రం ప్రధానంగా కామెడీ, సెటైర్, వెక్కిరింపుకే వాడుతుంటారు కదా…
ఎస్, ట్రంపు ఏం మాట్లాడినా అది కామెడీయే అయిపోతోంది… వాచాలత్వపు కూతలు రోజురోజుకూ తను అసలు ఓ అగ్రదేశం అధ్యక్షుడేనా..? తెలుగు సినిమా లేక జబర్దస్త్ కమెడియనా అనేలా ఉంటున్నాయి…
Ads
తాజాగా ఏమంటున్నాడంటే..? ‘‘నిజాయితీగా చెప్పాలంటే, ప్రధాని మోడీ అందంగా కనిపిస్తాడు, (nicest-looking guy)… మా నాన్నగారు ఇలా ఉంటే బాగుండు అని చాలా మంది కోరుకుంటారు… నాకు తనంటే గౌరవం, ప్రేమ… కానీ ఆయన ‘కిల్లర్’… మొండి, ఎంతకూ కొరుకుడుపడడు (tough as hell)…”
పారడాక్స్ అనిపిస్తోందా..? ట్రంపు ఏది మాట్లాడినా అంతే… మోడీ అంటే గౌరవం, ప్రేమ… అదేసమయంలో టెర్రర్ కంట్రీ ఆర్మీ చీఫులు కూడా ట్రంపు కళ్లకు, మనస్సుకు ఇంకా సుందరంగా కనిపిస్తారు, వాళ్లంటే మరీ ఎక్కువ గౌరవం, అత్యంత భారీ ఎక్కువ ప్రేమ కూడా…
మోడీ గనుక రిటార్ట్ ఇవ్వదలిస్తే… ‘‘ట్రంపు అంటే నాకు గౌరవం, ప్రేమ… మనిషి ఓ ఆర్మీ ఆఫీసర్‌లా కనిపిస్తాడు కానీ టెర్రరిస్టు కేరక్టర్…’’ అని ఇవ్వాలి… కానీ మోడీ ట్రంపు కాదు కదా, పేలడు, తను వాచాలుడు కాడు…
ట్రంపు చర్యలు పైకి చూస్తే ఇండియాతో ట్రేడ్ డీల్ కోసం ఎడాపెడా టారిఫులు, ఆంక్షలు, బెదిరింపులు, బ్లాక్ మెయిలింగు అన్నట్టు కనిపిస్తాయి గానీ… తను పక్కా భారత ద్వేషి… మోడీకి ఇప్పటికైనా అర్థమైందో లేదో తెలియదు గానీ… ట్రంపు ఓ ప్రమాద హెచ్చరిక జారీచేశాడు…
త్వరలో ఇండియాతో అమెరికా ట్రేడ్ డీల్ ఖరారు కాబోతున్నదీ అని..! ఒకవేళ ట్రంపు కోరుకున్నట్టు ట్రేడ్ డీల్ జరిగితే అది భారత రైతాంగానికి తీవ్ర నష్టదాయకమే…
ఏ అంశాల మధ్య చిక్కుముడి పడింది (Sticking Points)?
- వ్యవసాయం & పాడి పరిశ్రమ పరిరక్షణ….
- దేశంలోని చిన్న, సన్నకారు రైతులు, పాడి పశువుల పెంపకందారుల జీవనోపాధిని కాపాడేందుకు, ఈ రంగాలలో అమెరికా ఉత్పత్తులకు పూర్తి మార్కెట్ ప్రవేశం కల్పించడానికి భారత్ నిరాకరిస్తోంది…
- ముఖ్యంగా, కొన్ని జన్యు మార్పిడి (GM) పంటలను అనుమతించడానికి భారత్ సుముఖత చూపడం లేదు…
- సుంకాల (Tariffs) తగ్గింపు డిమాండ్…
- అమెరికా విధించిన అధిక సుంకాలను (ముఖ్యంగా జౌళి, తోలు ఉత్పత్తులు, రొయ్యల వంటి అధిక ఉపాధి కల్పించే భారతీయ ఎగుమతులపై) తొలగించాలని లేదా గణనీయంగా తగ్గించాలని భారత్ పట్టుబడుతోంది…
- వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి….
- వాణిజ్య ఒప్పందంలో డిజిటల్ రంగం, ఈ-కామర్స్, మేధో హక్కుల వంటి అంశాలపై దేశీయ విధానాలను దెబ్బతీసే మినహాయింపులు ఇవ్వడానికి భారత్ సిద్ధంగా లేదు…
- చైనాతో వాణిజ్యం వంటి ఇతర దేశాలతో సంబంధాలపై అమెరికా నిబంధనలు విధించకుండా తమ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకోవాలని భారత్ స్పష్టం చేస్తోంది…
ప్రస్తుత పరిస్థితి…
నివేదికల ప్రకారం, ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుంది… చాలా అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ, ముఖ్యంగా వ్యవసాయం (ముఖ్యంగా పాల ఉత్పత్తులు) టారిఫ్‌ల తగ్గింపు అంశాలు ఇప్పటికీ పూర్తిగా పరిష్కారం కాలేదు…
నాన్ వెజ్ పాలు (Dairy/Milk Products)…. పాల ఉత్పత్తుల విషయంలో భారతదేశం ‘రెడ్ లైన్’ (ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడని అంశం) ను గీసింది…
- సమస్య ఏమిటి?
- అమెరికాలో, పాడి పశువులకు (ఆవులకు) కొన్నిసార్లు జంతు ఉత్పత్తులు, మాంసం లేదా రక్తం కలిగిన దాణా (Animal-Based Feed) ను తినిపిస్తారు…
- భారతదేశంలో, ముఖ్యంగా శాకాహారులైన ప్రజలు, మతపరమైన ఆచారాలలో, పాలను శాఖాహార ఉత్పత్తిగా పరిగణిస్తారు… జంతు మాంసం తినిపించిన ఆవుల నుంచి వచ్చే పాలను ‘నాన్ వెజ్ పాలు’గా పరిగణించి, దీనిని దిగుమతి చేసుకోవడానికి భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది…
- భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు… అమెరికా నుంచి చౌకైన పాల ఉత్పత్తులు దిగుమతి అయితే, అది దేశంలోని 8 కోట్లకు పైగా ఉన్న చిన్న, సన్నకారు పాడి రైతులకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తుంది…
జన్యు మార్పిడి (GM) మొక్కజొన్న, సోయా (GM Corn & Soya)
వ్యవసాయ రంగంలో, జీఎం పంటల దిగుమతులపై కూడా భారత్ గట్టిగా వ్యతిరేకిస్తోంది…
- సమస్య ఏమిటి?
- అమెరికా తమ దేశంలో విరివిగా పండించే జన్యు మార్పిడి మొక్కజొన్న (GM Corn), సోయా వంటి పంటలకు భారత మార్కెట్‌లో ప్రవేశం కల్పించాలని ఒత్తిడి చేస్తోంది.
- వీటిని ప్రధానంగా పశువుల దాణా కోసం, ఆహార పరిశ్రమలో ఉపయోగిస్తారు.
- భారత్ అభ్యంతరం ఎందుకు?
- దేశీయ రైతుల ప్రయోజనాలు: జీఎం పంటల దిగుమతులు, దేశీయ మొక్కజొన్న, సోయా రైతులపై తీవ్రమైన పోటీని సృష్టించి వారి ఆదాయాలను దెబ్బతీస్తాయి…
- ఆహార భద్రత, పర్యావరణం: జీఎం పంటల వల్ల ఆహార భద్రతకు, సంప్రదాయ పంటల పరాగ సంపర్కానికి (Cross-Pollination) ఎలాంటి హాని జరుగుతుందోనన్న పర్యావరణపరమైన ఆందోళనలు కూడా ఉన్నాయి…
- భారత్ విధానం: భారతదేశంలో ప్రస్తుతం Bt కాటన్ (పత్తి) మినహా, ఇతర ఏ జీఎం ఆహార పంటల సాగుకు అనుమతి లేదు… దిగుమతుల విషయంలో కూడా భారత్ చాలా కఠినమైన విధానాలను అనుసరిస్తోంది…
భారత్ కోరుకుంటున్న ముఖ్య అంశాలు….
- అదనపు సుంకాల (Additional Tariffs) తొలగింపు:
- రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగా భారత్‌పై అమెరికా విధించిన 25% అదనపు సుంకాలను (Punitive Tariffs) పూర్తిగా తొలగించాలని భారత్ డిమాండ్ చేస్తోంది.
- అలాగే, ఇతర ఉత్పత్తులపై విధించిన 50% వరకు ఉన్న మొత్తం సుంకాలను గణనీయంగా తగ్గించాలని కోరుతోంది.
- సాధారణ సుంకాల తగ్గింపు:
- వస్త్రాలు (Textiles), రొయ్యలు (Shrimp), తోలు ఉత్పత్తులు (Leather Goods), ఆభరణాలు (Gems & Jewellery) వంటి శ్రమ-ఆధారిత (Labour-intensive) భారతీయ ఎగుమతులపై ప్రస్తుతం ఉన్న సాధారణ దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని భారత్ కోరుతోంది…
- ఈ రంగాల ఎగుమతులపై పన్నులు తగ్గించడం ద్వారా, ద్వైపాక్షిక వాణిజ్యం $500 బిలియన్ల లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుందని భారత్ అభిప్రాయపడుతోంది…
జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (GSP) పునరుద్ధరణ
- డిమాండ్: భారతీయ ఉత్పత్తులకు అమెరికా ఇంతకు ముందు కల్పించిన జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (GSP) హోదాను తిరిగి పునరుద్ధరించాలని భారత్ కోరుతోంది…
- ప్రయోజనం: GSP కింద, కొన్ని భారతీయ ఉత్పత్తులు సుంకాలు లేకుండా (Duty-free) అమెరికా మార్కెట్‌లోకి ప్రవేశించేవి. ఈ హోదా పునరుద్ధరించబడితే, భారతీయ ఎగుమతిదారులకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుంది….
- కోరిక: టారిఫ్‌లతో పాటు, అమెరికా మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తుల ప్రవేశాన్ని అడ్డుకుంటున్న ఇతర నాన్-టారిఫ్ అడ్డంకులను (ఉదా: కఠినమైన సాంకేతిక ప్రమాణాలు, ధృవీకరణ అవసరాలు) తగ్గించాలని కూడా భారత్ చర్చల్లో ప్రస్తావిస్తోంది…
భారత వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ చెప్పినట్లుగా, భారత్ తమ జాతీయ ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను కాపాడుకుంటూనే, ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన ‘ఫెయిర్ అండ్ బ్యాలెన్స్‌డ్ డీల్’ కోసం పట్టుబడుతోంది… ప్రపంచంలో నేను ఏ దేశాన్నయినా సరే బెదిరించి, నాకు అనుకూలమైన, నేను డిమాండ్ చేసినట్టుగానే ట్రేడ్ డీల్‌కు ఒప్పించగలననేది ట్రంపుడి ధీమా… మరి తన దృష్టిలో బాగా టఫ్ కేరక్టర్ మోడీ ఏం చేస్తాడో చూడాలిక..!!
Share this Article