.
Pardha Saradhi Potluri
…. నిజంగా ఒక్కటే నిజం, రహస్యం తెలిసే క్షణం, ప్రపంచం పరమ వికృతం, ముసుగు తీసి చూస్తే అసత్యం సహజ సుందరం, అనంతం దాని వైభవం, అబద్ధం కరిగి పోయేనా, బ్రతుకు సాగదంతే… ప్రతీదీ పచ్చి బూటకం… నిజం ఒక నిత్య నాటకం……..
సిరివెన్నెల వారు మూడు దశబ్దాల కిందట వ్రాసిన ఈ మాటలు అక్షర సత్యాలు!
అనుమానం నిజం అయ్యింది!
పాకిస్థాన్ లో ఉన్న అణు వార్ హెడ్స్ అమెరికావి!
Ads
జాన్ కిరియాకౌ – Kiriakou… జాన్ కిరియాకౌ అమెరికా స్పై ఏజెన్సీ అయిన CIA లో 25 ఏళ్ళు ఆఫీసర్ గా పనిచేశాడు!
జాన్ కిరియాకౌ ఇప్పటికే ఉన్న అనుమానాలని నిజం చేశాడు!
పాకిస్థాన్ లో ఉన్న అణు వార్ హెడ్స్ అమెరికాకి చెందినవి అంటూ బాంబు పేల్చాడు!
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్ యుద్ధ విమానాలు పాకిస్థాన్ లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడులు చేసిన సంగతి తెలిసిందే!
అయితే ఆ దాడులలో భూగర్భంలో ఉన్న అణు వార్ హెడ్స్ దెబ్బతిని ఉండవచ్చు అని అనుమానాలు కలగడంతో ఆపరేషన్ సిందూర్ ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది!
ఆపరేషన్ సిందూర్ ని నేనే ఆపాను అని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, అదేం లేదు పాకిస్థాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జెనరల్ హాట్ లైన్ ద్వారా భారత్ ని అభ్యర్థించడం వలనే ఆపరేషన్ సిందూర్ కి భారత్ విరామం ప్రకటించింది అని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రకటించడం జరిగింది!
భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాకిస్తాన్ అభ్యర్ధన మేరకు ఆపరేషన్ సిందూర్ ని ఆపాము కానీ ఇది తాత్కాలిక విరామం మాత్రమే అని బహిరంగంగా ప్రకటించారు కూడా!
నూర్ ఖాన్ ఎయిర్ బేస్ భూగర్భంలో అణు వార్ హెడ్స్ ఉన్నట్లు మాకు తెలియదు, కానీ విషయం బయటపడినందుకు ధన్యవాదములు అంటూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అనడం కూడా జరిగింది మే 10 న జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో!
దాడులలో భాగంగా అన్ని ఎయిర్ బేస్ ల మీద దాడులు చేసాము, అందులో నుర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడి చేసాము తప్పితే ప్రత్యేకంగా నూర్ ఖాన్ బేస్ మీద మాత్రమే దాడులు చేయలేదని కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే!
జాన్ కిరియకౌ చెప్తున్న దానికి విలువ ఉందా?
Yes! జాన్ కిరియాకౌ 25 ఏళ్ళ పాటు CIA కౌంటర్ టెర్రరిజిమ్ ఆపరేటివ్ ( Counter Terrorism Operative in Pakistan) గా పాకిస్థాన్ లో పనిచేశాడు.
So! జాన్ కిరియకౌ చెప్తున్న దానికి విలువ ఉంది!
జాన్ కిరియకౌ CIA రహస్యాలని బయటపెట్టడం ఇదే మొదటిసారి కాదు!
2007 లో CIA కష్టడీలో ఉన్న అల్ ఖైదా టెర్రరిస్టుల నుండి నిజాలు రాబట్టడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అల్ ఖైదా టెర్రరిస్టులని వాటర్ బోర్డింగ్ అనే చర్యతో హింసించింది! ఈ విషయం బయటికి రావడంతో మానవ హక్కుల సంఘాలు ఆందోళనకి దిగాయి. విషయం అంతర్జాతీయంగా విమర్శల పాలయింది. దాంతో CIA బహిరంగంగా వివరణ ఇస్తూ తాము అంతర్జాతీయ న్యాయ సూత్రాలకి అనుగుణంగానే వ్యవహారిస్తున్నామని ఎలాంటి మానవహక్కుల ఉల్లంఘనలకి పాల్పడటం లేదని ప్రకటించాల్సి వచ్చింది.
CIA వివరణ ఇచ్చిన కొద్ది రోజులకే అప్పటికే CIA తరుపున విధులలో ఉన్న జాన్ కిరియకౌ ఒక పత్రికా విలేఖరికి ఇంటర్వూ ఇస్తూ అల్ ఖైదా టెర్రరిస్టులని CIA వాటర్ బోర్డింగ్ తో చిత్రహింసలు పెట్టిన విషయం నిజమేనని ఒప్పుకున్నాడు! ఇది అంతర్జాతీయంగా సంచనల వార్త అయ్యింది!
దాంతో ఫెడరల్ గవర్నమెంట్ జాన్ కిరియానౌ మీద కేసు పెట్టింది!
2012 లో కోర్టు ఇంటెలిజెన్స్ ఐడెంటిటీస్ ప్రొటెక్షన్ యాక్ట్ ( Intelligence Identities Protection Act) కింద జాన్ కిరియానౌ కి రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది!
Water boarding అంటే?
నేరస్థుల నుండి నిజాలు రాబట్టే ప్రక్రియలో భాగంగా నేరస్థుడిని కాళ్ళు చేతులు కట్టేసి గుడ్డతో ముఖం కప్పేసి ఒక పైపుతో నీళ్ళని అధిక ఒత్తిడితో ముఖంపై కొడతారు దాంతో నేరస్తుడు తాను సముద్రంలో మునిగిపోతున్నట్లు భయంతో వణికిపోతాడు!
So! జాన్ కిరియానౌ మాటకి విలువ ఉంది!
జూన్ 5న జాన్ కిరియానౌ మరో నిజాన్ని వెల్లడించాడు.
జాన్ కిరియానౌ మాటల్లో…. ‘‘పాకిస్థాన్ లో ఉన్న అణు వార్ హెడ్లు ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఒక అమెరికన్ జనరల్ కమాండ్ లో ఉంది. అక్కడికి పాకిస్తాన్ మిలిటరీ అధికారులకి కూడా ప్రవేశం ఉండదు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ని ఆపరేట్ చేసేది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అన్నది నిజమే అయినా, కేవలం కొద్ది ప్రాంతం వరకే అంటే రోజు వారీ ఆపరేషన్స్ కోసం రాడార్ ఉన్న ప్రాంతం, రన్వే, ఇతర అడ్మినిస్ట్రీటివ్ బిల్డింగ్ ల వరకే ఎయిర్ ఫోర్స్ కి అనుమతి ఉంటుంది.
ఇక అదే ఎయిర్ బేస్ లో ఉండే అత్యాధునిక మిలిటరీ కాంప్లెక్స్ మరియు అదే కాంప్లెక్స్ నుండి అండర్ గ్రౌండ్ నుండి సొరంగ మార్గం ద్వారా భూగర్భంలోకి వెళ్లే ప్రాంతంలోకి ఒక్క అమెరికన్స్ కి తప్పితే ఎవరికీ ప్రవేశం ఉండదు’’
ఈ విషయం జాన్ కిరియానౌ బయటపెట్టింది CIA రహస్య ఆపరేషన్ కాబట్టి మళ్ళీ అతని మీద కేసుపెట్టే అవకాశం ఉంది… ( Contd… Part 2 )
Share this Article