పార్ధసారధి పోట్లూరి …… గల్ఫ్ జలాలు వేడెక్కుతున్నాయి ! సౌదీ అరేబియాని బెదిరిస్తూ అమెరికన్ న్యూక్లియర్ జలాంతర్గాములు సౌదీ అరేబియా సముద్రంలో ప్రత్యక్షo అయ్యాయి! గత కొన్ని నెలలుగా సౌదీ రాజు అమెరికాని లెక్క చేయకుండా తన ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే !
రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికా విధించిన ఆంక్షల వల్ల ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుదల సూచీ ఆకాశం వైపు చూస్తున్న తరుణంలో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచి ధరలు తగ్గించాల్సిందిగా పదే పదే జో బిడెన్ కోరినా సౌదీ రాజు పట్టించుకోలేదు… సరికదా ఉత్పత్తిని తగ్గిస్తూన్న ట్లుగా ప్రకటించి అమెరికాకి సవాల్ విసిరాడు సౌదీ రాజు! సౌదీ ఆరేబియాతో పాటు మిగతా క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసే గల్ఫ్ దేశాలు కూడా ఉత్పత్తిని తగ్గిస్తూ పోతున్నాయి దాంతో క్రూడ్ ఆయిల్ కి డిమాండ్ పెరిగిపోతూ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో యూరోపుతో పాటు అమెరికాకి కూడా క్రూడ్ ధరల సెగ బాగానే తగిలింది !
యూరోపుకి న్యాచురల్ గ్యాస్ కొరత కారణంగా హీటర్ల వాడకం మీద రేషన్ విధిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు. ప్రస్తుతం పగటిపూట అంటే ఎండ ఉన్న సమయంలో ఇళ్ళలో హీటర్ల వాడకాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నాయి ప్రభుత్వాలు. కొన్ని పరిశ్రమలు అయితే వచ్చే నెలలో పూర్తిగా మూతబడే అవకాశాలు ఉన్నాయి చలి కాలం పోయేదాకా ! ముఖ్యంగా జర్మనీలోని భారీ పరిశ్రమలు న్యాచురల్ గ్యాస్ కొరత వలన ఇప్పటికీ పని గంటలని తగ్గించాయి. వచ్చే నెలలో చలి తీవ్రంగా ఉంటుంది కాబట్టి గ్యాస్ వాడకం మీద రేషన్ విధిస్తారు. దాని బదులు మూడు నెలలు పూర్తిగా మూసేస్తే మంచిది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి భారీ పరిశ్రమలు.
Ads
ముఖ్యంగా జర్మనీలోని ప్రజలు ఇప్పుడిప్పుడే కొద్ది సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అంటే ఉక్రెయిన్ రష్యాలు వాళ్ళ సమస్యని వాళ్ళే పరిష్కరించుకుంటారు మనం రష్యాతో బాగుందాము, అలాగే న్యాచురల్ గ్యాస్ సప్లై ని మళ్ళీ పొందుదాము అనే భావనలోకి వచ్చేశారు. బహుశా చలి తీవ్రత పెరిగే కొద్దీ ప్రజలలో ఆగ్రహం పెరుగుతూ పోతుంది తద్వారా ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరుగుతుంది !
ప్రస్తుతం నేచురల్ గ్యాస్ కి బదులుగా కట్టెలని వాడుతున్నారు ఇళ్ళలో వేడి కోసం ! ఇన్నాళ్ళూ కట్టెలతో పని లేకపోవడం వలన అవి అమ్మే కేంద్రాలు చాలా స్వల్పంగా ఉండడంతో ఇప్పుడు అవి డిమాండ్ ని తట్టుకోలేక ధరలు పెంచేశాయి. అందరూ కట్టెల కోసం ఎగబడడం వలన వాటి కొరత తీవ్రంగా ఉంది. దాంతో ఇతర ప్రత్యామ్నాయ వనరులు అయిన పెట్రోల్, డీజిల్ మీద ఆధారపడుతున్నారు ప్రజలు. పెరిగిన ఇంధన ధరల మీద సబ్సిడీ ఇస్తున్నాయి ప్రభుత్వాలు కానీ ఇళ్ళలో హీటర్ల కోసం పెట్రోల్ లేదా డీజిల్ వాడుతూ పోతే వాటికీ కొరత ఏర్పడుతుంది.
ఇప్పుడెలా ?
అటు తిరిగి ఇటు తిరిగి ఆ అసహనం అమెరికా వైపు మళ్ళితే నాటో దేశాలని కోల్పోవాల్సి వస్తుంది అమెరికా ! అందుకే సౌదీ అరేబియా మీద ఒత్తిడి తేవడానికి న్యూక్లియర్ సబ్ లని అరేబియా సముద్రంలో మోహరించి బెదిరించాలని చూస్తున్నది! ఇది అసాధారణ చర్యగా భావిస్తున్నారు నిపుణులు ! అయితే వారం క్రితం ఒక పెద్ద అమెరికన్ రవాణా నౌకని ఇరాన్ అడ్డగించింది సముద్రంలో. అయితే దానిని బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని చూసిందా లేదా ఏవైనా ఆయుధాలని జారవిడవడానికి వచ్చిందనే అనుమానంతో దానిని అడ్డగించిందా అనేది తెలియరాలేదు కానీ దానికి ప్రతి చర్యగా అమెరికా తన ఒహియో క్లాస్ న్యూక్లియర్ సబ్ ని అరేబియా సముద్ర జలాలోకి తీసుకురావడం మీద సౌదీ అరేబియా ఆగ్రహంగా ఉంది!
సాధారణంగా అమెరికన్ న్యూక్లియర్ సబ్ లు సముద్ర ఉపరితలం మీదకి రావు. కేవలం అమెరికాలోని తమ స్థావరాల దగ్గర నిర్వహణ కోసం వెళ్ళినప్పుడు మాత్రమే పైకి వస్తాయి ! 70 రోజుల పాటు సముద్ర గర్భంలో ఏకధాటిగా ఉండగల సబ్ లు కేవలం ఆహారం మరియు మందులు, ఇతర స్పేర్ పార్ట్శ్ కోసం సముద్రం నుండి పైకి వస్తాయి అదీ ఎక్కడో దూరంగా ఎవరూ కనిపెట్టలేని ప్రాంతంలో పైకి వచ్చి తమకి కావాల్సిన వాటిని తీసుకోని తిరిగి కిందకి వెళ్లిపోతాయి మళ్ళీ 70 రోజుల తరువాత మాత్రమే పైకి వస్తాయి !
జెనెరల్ ఎరిక్ కురిల్ల [General Erik Kurilla] అమెరికన్ మిలటరీ కమాండర్ , మిడిల్ ఈస్ట్ కమాండ్… ఎరిక్ కురిల్లా అమెరికన్ నావీ కి చెందిన USS వర్జీనియా న్యూక్లియర్ కాపబుల్… లాంగ్ రేంజ్ న్యూక్లియర్ బాలిస్టిక్ మిస్సైల్స్ ని ప్రయోగించగలిన సబ్ మెరైన్ లో 8 గంటల పాటు ప్రయాణించింది… సౌదీ అరేబియాకి దగ్గరలో సముద్ర ఉపరితల జలాల మీదకి వచ్చింది ! ఇది నేరుగా సౌదీ అరేబియాని బెదిరించడమే ! ఇది అసాధారణ చర్య !
క్రూడ్ ఉత్పత్తిని పెంచి ఆయిల్ ధరలు తగ్గేలా చూడక పోతే ఏమవుతుందో చూడండి అంటూ తన అత్యాధునిక జలాంతర్గామిని అదీ కమాండర్ స్థాయి అధికారి ఆ జలాంతర్గామిపై నుండి హెచ్చరికల సంకేతం పంపడం తీవ్రమయిన చర్యగా భావిస్తున్నారు!
ఇరాన్- సౌదీ ఆరేబియాలు దగ్గరవుతాయా ?
అమెరికా చేస్తున్న పిచ్చి చేష్టలని చూస్తే అదే జరగవచ్చు అనే అంటున్నారు ! సౌదీ, ఇరాన్ దేశాల మధ్య ఆయిల్ పోటీతో పాటు సున్నీ- షియా వర్గ వైరం ఉంది. ఇన్నాళ్ళూ అమెరికా ఈ విభేదాలని చాలా చక్కగా తనకి అనుకూలంగా వాడుకుంది. కానీ తమ మధ్య ఉన్న సున్నీ- షియా విభేదాలని పక్కన పెట్టి ఒక్కటయితే మాత్రం అది అమెరికాకి కోలుకోలేని పెద్ద దెబ్బ అవుతుంది !
ఇరాన్, సౌదీల మధ్య స్నేహం వెల్లివిరిస్తే అది మొత్తం క్రూడ్ ఉత్పత్తి చేసే అరబ్ దేశాలు ఒక్కటయిపోతాయి! డాలర్లలో ఆయిల్ కొనుగోళ్లకి మధ్యే మార్గంగా ఏదో ఒక కరెన్సీ ని ఏర్పాటు చేస్తే మాత్రం ఇక అమెరికా పని అయిపోయినట్లే ! అంతా ఒక్కటి అయిపోతే అది రష్యా చైనాలకి లాభం అవుతుంది ! మా దగ్గర డబ్బు ఉంది మీరు అత్యాధునిక ఆయుధాలని తయారుచేయండి మేము కొంటాము అని కనుక రష్యాకి హామీ ఇస్తే అది పెద్ద అంతర్జాతీయ ఘటనగా నమోదు అవుతుంది చరిత్రలో !
మూడవ ప్రపంచ యుద్ధ సమీకరణాలు భారీగా మారిపోతాయి !
యుద్ధం అంటూ జరిగితే ఆయిల్ తో సమృద్ధిగా ఉన్న రష్యా, గల్ఫ్ దేశాల కూటమికి ఎదురు ఉండదు ! అదే యూరోపు దేశాలకి ఆయిల్ సమస్య ఉంటుంది ఎందుకంటే అమెరికా ఏక మొత్తంలో యూరోపుకి ఆయిల్ సప్లై చేయలేదు. అమెరికాలో కూడా ఆయిల్ నిల్వలు భారీగానే ఉన్నాయి కానీ అవి రాతి పొరల మధ్యలో ఉన్నాయి. అందుకే అమెరికన్ ఆయిల్ ని షెల్ ఆయిల్ అని పిలుస్తారు కానీ ఆ ఆయిల్ ని బయటికి తీయాలంటే ఒక్కో బారెల్ కి అయ్యే ఖర్చు $70 అవుతుంది. దానిని ప్రాసెస్ చేయడానికి మరో $20 ఖర్చు అవుతుంది. అమెరికాలో ఒక్కో బారెల్ ధర షుమారుగా $100 అవుతుంది దానిని యూరోపుకి సరఫరా చేయాలి ఆంటే మరో $10 ఖర్చు అవుతుంది ఒక్కో బారెల్ కి. So ! అమెరికా యూరోపుకి ఆయిల్ సరఫరా చేయాలి అంటే $110 ధర పలుకుతుంది అన్నమాట ! ఈ ధర ఎలా చూసినా అత్యధికం అందులోనూ యుద్ధ సమయంలో అది చాలా ఖర్చుతో కూడినది అవుతుంది !
ఉక్రెయిన్ యుద్ధానికి ముందు రష్యా దగ్గర ఒక బారెల్ కి $30 డాలర్లకి కొంటూ వచ్చిన అమెరికా కి యుద్ధ సమయంలో తాను స్వంతంగా ఆయిల్ ఉత్పత్తి చేయాలి అంటే దాని ఖర్చు భారీగా ఉంటుంది పైగా ఉత్పత్తిని పెంచడానికి అయ్యే ఖర్చు వేల బిలియన్ డాలర్లు అవుతుంది. ఎలా చూసినా గల్ఫ్ దేశాల సహకారం లేకుండా అమెరికా, యూరోపులు యుద్ధం చేయలేవు!
సౌదీ రాజు ని బెదిరించడం కంటే ఒకటికి రెండు సార్లు అభ్యర్ధిస్తే బాగుండేది ! ఇన్నాళ్లూ తాము సౌదీకి రక్షణ కల్పిస్తున్నాము అనే అహంకారం ఆమెరికాది ! కానీ అదే సమయంలో గల్ఫ్ దేశాల పెట్రో డాలర్ల వల్లే తాము కూడా బాగుపడ్డాము అనే విశ్వాసం ఆమెరికన్లలో లేదు. సౌదీ ఆరేబియాకి రక్షణ దేనికి ? దక్షిణ యెమెన్ దేశంతో సౌదీకి సుదీర్ఘమయిన సరిహద్దు ఉంది. యెమెన్ దేశంలో ప్రభుత్వ తిరుగుబాటుదార్లు షియా ముస్లిమ్స్ ! వీళ్ళకి మరో షియా దేశం అయిన ఇరాన్ మద్దతు ఇస్తున్నది!
సౌదీ- ఇరాన్ దేశాలు విభేదాలని మరిచిపోయి ఒక్కటయిపోతే సౌదీకి రక్షణ అవసరం లేదు ! అమెరికాలోని పెంటగాన్ అధికారులకి ఈ లాజిక్ అర్ధమవలేదా ? లేక ఇరాన్ సౌదీలు ఏకమవుతాయి అని విశ్వసించడం లేదా ?
ఒక అంచనా ప్రకారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ లు ఇప్పటికే ఇరాన్- సౌదీ ల మధ్య సయోధ్య కుదర్చడానికి కావాల్సిన అన్ని మార్గాలని సిద్ధం చేసే ఉంటారు కానీ బయటపడట్లేదు ! సౌదీ రాజు అమెరికా పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణి కి కారణం రష్యా, చైనాలు కావొచ్చు ! అంతగా అవసరం అయితే రష్యా, చైనా, ఇరాన్ లతో కూడా సైన్యం సౌదీకి రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉంటాయి అమెరికాతో దూరం జరిగితే !
బహుశా బిడెన్ వృద్ధాప్యంతో బాధ పడుతున్నాడు కానీ నిర్ణయాలు అమెరికా ఆయుధ లాబీ తీసుకొని బిడెన్ చేత ఆమోద ముద్ర వేయించి పరోక్షంగా అమెరికా నాశనానికి కారకులు అవుతున్నారు ! లేకపోతే సౌదీ రాజుని బెదిరించే పిచ్చి నిర్ణయం తీసుకోరు బుద్ధి ఉన్నవాడు ఎవడయినా !
Share this Article