.
అమెరికా దేశం అనేది మొదట్లో 13 బ్రిటీష్ కాలనీల ఒక చిన్న భూభాగం మాత్రమే, కానీ అది 50 రాష్ట్రాల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా ఏర్పడి ఎలా అగ్రరాజ్యం గా అయ్యింది అంటే…!
2026 జూలై 4 నాటికి అమెరికా ఏర్పడి 250 సంవత్సరాలు అవుతుంది. కానీ 248 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 1776 జూలై 4 న ఏర్పడిన అమెరికా దేశం చాలా చిన్న భూభాగం, మన ఉత్తర ప్రదేశ్ లో సగం అంత కూడా ఉండదు. అది కూడా, బ్రిటీష్ వారితో చిన్న యుద్ధం జరిపి 13 కాలనీల చిన్న ముక్కని తమ దేశం అని 1776 జూలై 4 న అమెరికాగా ప్రకటించుకున్నారు.
Ads
ఆ తర్వాత 1803 లో ఇండియన్ రిజర్వ్‌ను కొన్నారు. 1805 లో అప్పటి ఫ్రాన్స్ భూభాగం, ప్రొవిన్స్ ఆఫ్ క్యుబెక్ (Northwest territory) ను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేశారు. తర్వాత స్పెయిన్, అప్పటి గ్రేట్ బ్రిటన్‌ను ఓడించడానికి ఫ్రాన్స్‌తో చేతులు కలిపి పెద్ద భూభాగాన్ని ఆక్రమించుకొని తమ లో కలిపేసుకున్నారు.
1846 లో మెక్సికో మీద దాడి చేసి ప్రస్తుత క్యాలిఫోర్నియా, నెవాడా, ఆరిజోనా, న్యూ మెక్సికో, కొలరాడో, వయోమింగ్, కాన్సస్, ఒక్లహోమా వంటి రాష్ట్రాలను ఆక్రమించుకొని తమలో కలిపేసుకున్నారు.
ఆ తర్వాత మెక్సికోతో శాంతి ఒప్పందం కుదుర్చుకుని ప్రస్తుత టెక్సాస్‌ను పొందారు. 1867 అక్టోబర్ 18న రష్యా నుంచి అలాస్కాను 7.2 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసి, నాలుగు సంవత్సరాలకే కొన్ని బిలియన్ డాలర్లకు లీజ్‌కి ఇచ్చి ఆయిల్ బావులు తవ్వి లక్షల కోట్లు సంపాదించారు.
అంతటితో వాళ్ల సామ్రాజ్య వాంఛ ఆగలేదు; చాలా దూరంలో ఉన్న వియత్నాంలో యుద్ధం చేసి చాలా ఏళ్లు అలజడి సృష్టించారు. కానీ చివరికి 1979లో ఓటమి చెంది వెనుతిరిగారు.
248 ఏళ్ల అమెరికా చరిత్రని చూస్తే, 203 సంవత్సరాలు అమెరికా చేసింది యుద్ధాలు, ఆక్రమణలే. అందుకే ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్థలో గెలవాలంటే కష్టపడి పని చేయాలి, వేరే వాళ్ళతో జత కలిపి ఎదుటి వాడిని మోసం చేయాలి, అప్పుడే గెలుస్తావ్ అంటాడు ఒక రోమన్ తత్వవేత్త.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యక్తిత్వ వికాస నిపుణులు, అమెరికాలోని వ్యక్తిత్వ కోచ్‌లు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులే. కానీ, యధార్ధం వేరు. గెలవాలంటే కష్టపడి పని చేయాలి, ఎదుటి వాడిని మోసం చేయాలి. అదీ చేతకాకపోతే, వేరే వాళ్ళతో జత కలిసి వ్యూహాలతో ముందుకు సాగాలి, అప్పుడే గెలుస్తావ్ – ఇదే అమెరికా చరిత్ర నుంచి మనం నేర్చుకోగలిగింది.
నా దృష్టిలో ఈ భూమి మీద ఉన్న మనుష్యులు రెండే రకాలు
1. కష్టపడి మాత్రమే పని చేసేవాళ్లు
2. కష్టపడి పని చేస్తూ మోసం చేసేవాళ్లు
ఈ ప్రపంచం లో ప్రతిదీ ఒక యాపారం; కష్టపడి పని చేసి మోసం చేయగలిగిన వాడు గెలుస్తాడు, కష్టపడి మాత్రమే పనిచేసేవాడు ఓడిపోతాడు, అంతే. దీనికి మించి ఎవరు ఏం చెప్పినా వినే వాడి మూర్ఖత్వాన్ని బట్టి చెప్పేవాడి మాటలు ఉంటై…… జగన్నాథ్ గౌడ్ వ్యక్తిగత అభిప్రాయం
Share this Article