.
Pardha Saradhi Potluri
…. పాకిస్థాన్‌లోని అణు వార్ హెడ్స్ అమెరికావే... పార్ట్-2
విదేశాంగ మంత్రి జైశంకర్ మాటలని గుర్తు చేసుకుంటే అసలు విషయం అర్ధమవుతుంది!
నవంబర్, 2024 న డోనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి రాబోతున్నాడు, దాని మీద మీ స్పందన ఏమిటీ అని విలేఖరి అడిగినపుడు జైశంకర్ స్పందన….
“ Lot of countries nervous, We are not “
చాలా దేశాలు ట్రంప్ అధికారంలోకి రాబోతున్నాడని భయపడుతుండవచ్చు కానీ భారత్ మాత్రం కాదు.
Ads
****************
నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో ఉన్న అణు వార్ హెడ్స్ అమెరికావి అయితే అవి పాకిస్థాన్ లో ఎందుకు రహస్యంగా ఉంచినట్లు?
ఒకవేళ అవసరం పడితే అటు చైనా మీద ప్రయోగించవచ్చు లేదా ఇరాన్ మీద ప్రయోగించ వచ్చు!
So! మాజీ CIA ఆఫీసర్ వెల్లడించిన దానిని మనం పలు కోణాలలో చూస్తే అది నిజం అయ్యుండవచ్చు అనే అనుమానాలు కలుగుతున్నాయి.
1.2014 లో మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత RAW ఆపరేషన్స్ ఊపు అందుకున్న సంగతి తెలిసిందే! బహుశా 2019 కి ముందే RAW పాకిస్తాన్ దగ్గర ఉన్న అణు వార్ హెడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టి ఉండవచ్చు.
2.సర్గోదా ఎయిర్ బేస్ దగ్గరకి రక్షణ ఎక్కువగా ఉండడం, పరిసర ప్రాంతాలలో స్థానిక ప్రజలు ఎవరూ ఉండకుండా సైన్యం జాగ్రత్త పడడం వెనుక అమెరికా ప్రయోజనాలు ఉన్నాయి తప్పితే వేరే సరైన కారణం లేదు.
3.నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పరిసరాలలోకి పాకిస్థాన్ కి చెందిన హై రాంకింగ్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులకి తప్పితే వేరే ఎవరికి ప్రవేశం ఉండదు.
4.కేవలం న్యూక్లియర్ ఎమర్జెన్సీ సమయంలోనే ఉపయోగించే ‘US B -350 AMS ‘ అనే ఎయిర్క్రాఫ్ట్ ని హడావిడిగా అమెరికా ఖతార్ నుండి పాకిస్తాన్ కి పంపించడం, దానిని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన చక్కర్లు కొట్టిస్తూ, రేడియేషన్ ఏమన్నా వ్యాపించిందా అని పరీక్షించడం చూస్తే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ భూగర్భంలో ఉన్న అణు వార్ హెడ్స్ అమెరికాకి చెందినవే అని అర్ధం అవుతుంది.
US B-350 AMS అనే విమానంలో గామా కిరణాలని ప్రసరించి రేడియేషన్ ఎంత మేరకి వ్యాప్తి చెందిందో నిర్ధారణ చేసే అత్యాధునిక రేడియేషన్ మ్యాపింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అంత హడావిడి ఎందుకు చేసినట్లు?
5. నూర్ ఖాన్ ఎయిర్ బేస్, అక్కడ ఉన్న అమెరికా అణు వార్ హెడ్స్ విషయం భారత్ కి తెలుసు!
6.అమెరికా, పాకిస్తాన్ అణు బంధం బయటపెట్టడానికే భారత్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడి చేసింది.
7. అమెరికన్ అణు వార్ హెడ్స్ పాకిస్థాన్ లో ఉన్నాయని బయటి ప్రపంచానికి తెలిసినా తెలియకపోయినా చైనాకి తెలియాలని భారత్ వ్యూహం!
8 పాకిస్తాన్ కి అంటూ అణు ఆయుధాలు ఏమీ లేవు. ఒకవేళ పాకిస్థాన్ దగ్గర అణు వార్ హెడ్స్ ఉంటే వాటినే అమెరికా ఉపయోగించుకుంటుంది కానీ తన వార్ హెడ్స్ ని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కి తరలించి అక్కడ రహస్యంగా ఎందుకు భద్రపరుస్తుంది?
9. ఎన్ని అణు వార్ హెడ్స్ ని తరలించారో తెలియదు కానీ కోవిడ్ లాక్ డౌన్ సమయంలో సౌదీ అరేబియాకి చెందిన మిలిటరీ రవాణా విమానంలో పాకిస్థాన్ నుండి సౌదీకి తరలించబడ్డాయి అన్నది వాస్తవం!
10. మా దగ్గర అణు బాంబులు ఉన్నాయని పాకిస్తాన్ తరుచూ బెదిరించడం వెనుక అమెరికా అణు వార్ హెడ్స్ దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ఉత్తుత్తి బెదిరింపులు అని ఆపరేషన్ సిందూర్ తో తేలిపోయింది!
11. అందరూ గమనించని అంశం ఏమిటంటే… 1999 కార్గిల్ యుద్ధ సమయంలో అప్పటి పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషర్రాఫ్ భారత్ మీద అణు బాంబ్ వేస్తానని బెదిరించాడు. ప్రతిగా అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అటల్ బిహారీ వాజపేయికి ఫోన్ చేసి చర్చలకి రమ్మని ఆహ్వానించగా వాజపేయి నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.
బదులుగా క్లింటన్ పాకిస్తాన్ అణు ప్రయోగం చేస్తుంది అనగా వాజపేయి బదులిస్తూ ‘ రేపు పాకిస్తాన్ సూర్యోదయం చూడదు- I assure you Pakistan will not see tomorrow’s sunrise’ అంటూ జవాబు ఇచ్చారు. తరువాతి రోజుల్లో వాజపేయి చాలా సందర్భాలలో పాకిస్తాన్ ని ఉద్దేశిస్తూ ‘ పాకిస్తాన్ కల్ కా సూరజ్ నహి దేఖేగా’ అని అంటూ వచ్చారు.
(మొన్నటి ఆపరేషన్ సిందూర్ వేళ కూడా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్ తీవ్రంగా రియాక్ట్ కాబోతున్నదని హెచ్చరించాడు ఇండియాను…)
12. బిల్ క్లింటన్ పాకిస్తాన్ వైపు మొగ్గు చూపకపోగా అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ తో భేటీ అయినప్పుడు షరీఫ్ బేషరతుగా కార్గిల్ నుండి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకోవడంలో సహాయం చేయమని క్లింటన్ ని అభ్యర్థించాడు!
13. ప్రస్తుతానికి వస్తే పహాల్గామ్ ఉగ్ర దాడి తరువాత అసలు విషయం తెలియని కొంతమంది పాకిస్తాన్ రాజకీయ నాయకులు అణు దాడి గురుంచి మాట్లాడారు కానీ సైనిక అధికారులు అణు దాడి గురుంచి ఎందుకు మాట్లాడలేదు?
14.ఆపరేషన్ సిందూర్ కి విరామం ప్రకటించాక కూడా సైనిక అధికారులు ఎవరూ ఆవేశంతో భారత్ మీద అణు దాడి చేస్తాము అంటూ ప్రగల్భాలు ఎందుకు పలకలేకపోయారు?
15. ఎయిర్ బేస్ లు ధ్వంసం అయిపోయాయి కానీ ఇంతవరకూ వాటిని ఆపరేషన్ లోకి తీసుకురాలేక పోయింది పాకిస్తాన్ దేనికని? ఎందుకంటే, ఎయిర్ బేస్ లలో ఉండే రన్ వేలని తిరిగి పూర్తి స్తాయిలోకి ఆపరేషన్ లోకి తీసుకు రావాలి అంటే మూడు నెలల నుండి ఆరునెలల సమయం పడుతుంది పాకిస్తాన్ లాంటి దేశానికి.
16.ఎయిర్ బేస్ లు పనికిరాకుండా పోయాయి సరే బాలిస్టిక్ మిస్సయిల్ తో అణు దాడి చేయవచ్చు కదా? అసలు ఆ ప్రసక్తే రాలేదు పాకిస్తాన్ వైపు నుండి ఎందుకు?
17.ఎందుకంటే బాలిస్టిక్ మిసైల్ తో అణు దాడి చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఇలా అనుకున్నదే తడవుగా గంటల్లోనే బాలిస్టిక్ మిసైల్ కి అణు వార్ హెడ్ ని తగిలించి ప్రయోగించలేరు. మొత్తం 8 దశలలో ఆణు వార్ హెడ్స్ ని అసెంబుల్ చేసి మిసైల్ కి తగిలించాల్సి ఉంటుంది. అసలు అణు వార్ హెడ్స్ ఉంటేనే కదా బెదిరించడానికి?
Share this Article