Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వారసత్వ పన్ను..! కాంగ్రెస్ ప్రాణానికి నువ్వెక్కడ దొరికావురా నాయనా…!!

April 25, 2024 by M S R

Subramanyam Dogiparthi……   సున్నప్పిడతలు . ఇంగ్లీషులో foot in mouth batch . అంటే అసందర్భ ప్రేలాపనలతో దారిన పోయే అశుధ్ధాన్ని ఒంటికి పూసుకునే బేచ్ . చెత్త మాట్లాడి ఉత్త పుణ్యానికి తన్నులు తినే బేచ్ . ఈ గడ్డమాయన ఆ బేచ్ లో ఒకడు . పేరు శ్యాం పిత్రోడా . కాంగ్రెస్ పార్టీ Overseas Congress చైర్మన్ .


ఈయన ఎక్కడో సోది మాట్లాడుతూ అమెరికాలో ఉన్న వారసత్వ పన్ను ( Inheritance Tax ) ఇండియాలో కూడా ఉంటే ఈయన మొహంలా ఉంటుందని వక్కాణించారు . అసలీ పన్ను అమెరికా అంతా లేదు . ఇది ఫెడరల్ టాక్స్ కాదు . కేవలం ఆరు రాష్ట్రాలలో ఉంది . అవి : అయోవా , కెంటుకీ , మేరీలాండ్ , నెబ్రాస్కా , న్యూజెర్సీ , పెన్సిల్వేనియా . ఇది కూడా ఒక పరిమితి దాటిన తర్వాత 1% నుండి 10% దాకా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంది .

ఇలాంటి పన్ను మన దేశంలో ఎస్టేట్ డ్యూటీ అనే పేరుతో దేశమంతా ఉండేది . 1985 లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం రద్దు చేసింది . మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఇలాంటి అనవసర , అసందర్భ ప్రేలాపనల వలన కాంగ్రెసుకు అనవసర నష్టం . నేనలా అనలేదు ; ఇలా అనలేదు అంటే భా జ పా వంటి అత్యంత బలమైన అధికార పార్టీ ఊరక ఉంటుందా ?

అసలేమీ లేకపోతేనే లేపి లేపి కొడుతుంది . అన్నాక వదలిపెడుతుందా !? ఏడ దొరుకుతార్రా నాయనా మీరందరూ ? సైధ్ధాంతిక గందరగోళం . అంతర్గత మేధోమధనం లేకపోవటమే ఇలాంటి గందరగోళానికి కారణం .

కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావాలనుకోవటం భ్రమే అని . ఎవడే సుబ్రమణ్యం అనే సినిమాలో కృష్ణంరాజు డైలాగ్ ఒకటి ఉంటుంది . నేను డబ్బుల కోసం పని చేయటం లేదు ; పనిచేస్తుంటే డబ్బులు వస్తున్నాయి అని . అలాగే దేశం కోసం నిఖార్సుగా పనిచేసుకుంటూ పోతుంటే అధికారం వస్తుంది . అధికారం కోసం రాజకీయ పార్టీలు పని చేయకూడదు . కాంగ్రెస్ పార్టీ సైధ్ధాంతిక గందరగోళంలో నుండి బయటపడనంత కాలం ఇలాగే ఉంటుంది . మొత్తం పార్టీని జీరో నుండి పునర్నిర్మించుకోవాలి . ఎవరికి అంత ఓపిక !?

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • టీ20 వరల్డ్ కప్..! కెప్టెన్ అనాలోచిత వైఖరే ఇండియాకు పెద్ద బలహీనత..!!
  • స్ట్రాటో ఫోర్ట్రెస్..! అమెరికా గగన వజ్రాయుధం యుద్ధరంగంలోకి..!!
  • మానవతా సంస్కారం..! పల్లెలో ఇంకా ‘మంచి మనసులు’ బతికే ఉన్నయ్…!
  • చోకర్స్ కాదు..! దక్షిణాఫ్రికా దురవస్థ ప్రతిభ లేక కాదు..! అదృష్టం లేక…!!
  • అమిత్ షా ఎదుటే ‘నక్సల్ ముక్త భారత్’ ఫైనల్ షో..!
  • కన్నతల్లి జడ్జిమెంటే అంతిమం… అదే అసలు సిసలు డీఎన్ఏ తీర్పు…
  • అడకత్తెరలో పాకిస్థాన్… యుద్ధ శిఖండి పాత్రపై ఇరాన్ రుసరుస…
  • అగ్రి సోలరైజేషన్… తెలంగాణ రైతు రియల్ ‘పవర్ స్టార్’…
  • నేను చెప్పిందే ఫైనల్..! రేవంత్‌రెడ్డి మాటే హైకమాండ్ మాట…!
  • ప్రపంచం కాలిపోతున్నా… మనింట్లో పాయసం మరుగుతూనే ఉంటుంది…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions