అభినందించాల్సిన వార్త ఇది… వర్తమాన వ్యవహారాలపై నిశిత పరిశీలన, సమాచార సేకరణ, సరైన ప్రజెంటేషన్ అవసరం ఏ జర్నలిస్టుకైనా… ఎంతసేపూ పాలకభజన కాదు కదా… నిజానికి ఇది ఫస్ట్ పేజీ వార్త… ఎందుకంటే..? కరోనా చికిత్సకు సంబంధించి ఫీల్డులో ఏం జరుగుతున్నదో గమనించి రాసిన వార్త… వాస్తవానికి వార్తలు అంటే ఇవే… ఈ వార్త ఓసారి చదవండి… జింక్, ఐవర్ మెక్సిన్, డాక్సీ సైక్లిన్ తదితర మాత్రలతో కూడిన ఓ కిట్ పాపులరైంది… మైల్డ్ లక్షణాలుంటే అయిదారు రోజులు, మరీ తగ్గకపోతే మరో డోస్… జస్ట్, 150 రూపాయలకు ఓ కిట్… ఇది ఏపీలోనే కాదు, యూపీ, బీహార్, ఒడిశా, అస్సాం, ఉత్తరాఖండ్, గోవా, బెంగాల్లో వైద్యులు విపరీతంగా వాడుతున్నారు… జస్ట్, కరోనా లక్షణాలుంటే చాలు, బెడ్ మీదకు ఎక్కించేసి లక్షలకు లక్షలు గుంజుతున్న ఈ రోజుల్లో ఈ వార్త ఎంత ఉపయుక్తం..? అసలు ఇవే కదా వార్తలంటే… ఈ రిపోర్టర్‌కు అభినందనలు… ఎందుకంటే..?
అల్లాటప్పాగా నోటికొచ్చింది రాయలేదు… ప్రత్యేకించి ఐవర్ మెక్టిన్పై కొంత సమాచారం సేకరించి కొంత సాధికారంగా వార్తను ప్రజెంట్ చేసినందుకు..! వాస్తవానికి ఆ మందును జంతువుల అవసరాల కోసం తయారు చేశారు… కానీ జంతువులకే కాదు, 50 ఏళ్లుగా మనుషులకూ వాడుతున్నారు.. వైరస్ అంటే వైరసే… అది జంతువులకు సోకినా, మనుషులకు సోకినా సేమ్ కదా… ఎహె, మనిషి కూడా జంతువే కదా… వైరస్‌కు ఆ తేడా ఏముంటుంది..? ఏరకమైన వైరస్ అయినా సరే, ఆ ప్రభావం తగ్గించడానికి మనుషులకూ చాలా ఏళ్లుగా వాడుతున్నారు… ఇప్పుడు కరోనాకు కూడా కొందరు డాక్టర్లు వాడుతున్నారు…
Ads
నో, నాన్సెన్స్ అంటుంది అమెరికాలోని ఎఫ్‌డీఏ… కరోనాకు సంబంధించి దీన్ని వాడకూడదని హెచ్చరిస్తుంది… ఎవడు హెచ్చరిస్తే ఎవడు ఊరుకుంటాడు,,, తమ చూస్తున్న ఫలితాల ఆధారంగా చికిత్సకు వాడుతుంటారు కదా… చాలామంది వైద్యులు ఈ డ్రగ్ కూడా చాలారోజులుగా వాడుతున్నారు… డ్రగ్ మాఫియాకు ఈ విషయం ముందే తెలిస్తే బ్లాక్ చేసి, అడ్డగోలు ధరలను పెంచి కుమ్మేసేవారు… ఐనా వాళ్లకు రెమ్‌డెసివర్ అక్రమాలు చాలు కదా… అందుకే వదిలేసినట్టున్నారు.. పలు కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న కరోనా రోగుల చికిత్సకు దీన్ని వాడుతున్నారు… ప్రత్యేకించి హోం ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లకు సూచిస్తున్నారు… ఇక్కడ 150 రూపాయలు అనే స్వల్ప ధర అనేది కాదు… అందుబాటులో ఉన్న పాత మందుల్ని వాడుకోవడం అనేదే ప్రధానాంశం… దీంతోపాటు డాక్సీసైక్లిన్ అనే యాంటీ బయాటిక్… మరి నిజంగానే ఐవర్‌మెక్టిన్ అంత ప్రభావశీలి అయితే, అధికారికంగానే దాన్ని వాడే అవకాశాలు పరిశీలించాలి కదా… భలేవారే… అధికారంలో ఉన్నవాళ్లకు నానా ‘‘ఆబ్లిగేషన్స్… రిలేషన్స్’’ గట్రా ముఖ్యం… తొక్కలో ప్రజారోగ్యం, కారుచౌక వైద్యం ఎవడికి కావాలి…!!
Share this Article