.
పేరు ఎందుకులే గానీ… పైన నాయకుడు ఛాపర్‌లోనో, ఛార్టర్డ్ ఫ్లయిటులోనో వెళ్తుంటే… కింద పోలీసులు ట్రాఫిక్ ఆపేసిన ఉదాహరణలు మనం గతంలో చెప్పుకున్నాం.,. అలా విపరీతమైన రాజసాన్ని, అరాచకాన్ని, అతిని అనుభవించిన పాలకుడు భ్రష్టుపట్టిపోయాడు, అది వేరే సంగతి…
వీవీఐపీల పర్యటనలు ఎప్పుడూ జనానికి అవస్థే… బందోబస్తులు, ఆంక్షలు, పర్యటనల వేళ ట్రాఫిక్ మళ్లింపులు ఎట్సెట్రా కామన్ అయిపోయాయి… అలాగని వీళ్లు ఉద్దరించేది ఏమీ ఉండదు… జనం మీద పడి బతకడం తప్ప…
Ads
తెలుగులోనో, ఇంగ్లిషులోనో ఈ ధోరణికి ఏదైనా మంచి పదం అన్వేషించాలి… భారీ కాన్వాయ్‌లు, పోలీసు సెక్యూరిటీ, బందోబస్తు, మన్నూమశానం… ప్రతి నాయకుడూ అలాగే తయారయ్యాడు… కాదు, వాళ్లను మించి అనుచర గణం వేషాలు ఎక్కువ… పోలీసులు అతి మరీ అతిన్నర అతి…
ఓ చిన్న వార్త వాట్సప్ న్యూస్ గ్రూపులో కనిపించింది… ఇదీ అది…
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హెలికాప్టర్ వస్తుంది, మీ వడ్లు తీసేయండి…
సొంత పొలంలో ఆరబోసుకున్న వడ్లు తీసేయాలని రైతుల మీద అధికారుల హుకుం…
మేం చెప్తే ఇప్పటికిప్పుడు వడ్లు తీయాల్సిందే, వీడియోలు తీసి ఏం చేస్తారు, ఏం చేయలేరు అంటూ ఎమ్మార్వో దౌర్జన్యం…
మంత్రి ఉత్తమ్ కుమార్ పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ కోసం రైతులను ఇబ్బందులు పెడుతున్న అధికారులు…
సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో ధాన్యం ఆరబోసుకున్న పొలం వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలి, అర్జెంట్‌గా ధాన్యం మొత్తాన్ని ఖాళీ చేయాలని హుకుం జారీ చేస్తున్న అధికారులు…
రైతులకు బెదిరింపులు, ఇప్పటికిప్పుడు అంటే కుదరదని, అయినా మా సొంత పొలంలో వడ్లు
ఆరబోసుకున్నాం, హెలిప్యాడ్ కోసం మా వడ్లు ఎందుకు తీయాలి అని అధికారులను నిలదీసిన రైతులు…
కావాలనే రైతులను వేధిస్తున్నారని మండిపాటు….
నిజంగా దొరవారు దిగడానికి వేరే స్థలమే దొరకడం లేదా ఫాఫం… ఇదుగో ఇలాంటి పోకడలతోనే జనానికి దూరమవుతారు… ఛి, ఈ దొరలకన్నా మనకు ఆ పాత పెద్ద దొరే నయం అనుకునేలా చేస్తారు… ఇలాంటివే జనంలో, రైతాంగంలో ప్రభుత్వం పట్ల, పార్టీ పట్ల, నాయకుల పట్ల వ్యతిరేక భావనల్ని పెంచుతాయి…
ఎస్, ఓ మిత్రుడు చెప్పినట్టు… బీఆర్ఎస్ నేతలే అనుకుంటే వీళ్లు వాళ్ల తాతలు తయారయ్యారు… రాక రాక వచ్చిన అధికారాన్ని హేండిల్ చేయడం అస్సలు చేతకావడం లేదు… జనం అన్నీ గమనిస్తున్నారనే సోయి కూడా లేకుండా పోయింది..!!
అయ్యా, మహా ప్రభువులు తమరు… కాస్త రైతాంగం పట్ల ప్రేమను, వ్యవసాయం పట్ల గౌరవాన్ని నిజంగా గాకపోయినా కాస్త నటించండయ్యా …
Share this Article