రాంచరణ్ కాస్త డిఫరెంట్… తన అడుగులు డిఫరెంటుగా పడుతుంటయ్… తను సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడో లేక డాడీ చిరంజీవి గైడెన్స్ ఉంటుందో తెలియదు గానీ… వేరే హీరోలతో పోలిస్తే డిఫరెంటే… తాజా ఉదాహరణ ఏమిటంటే… జీ20 సదస్సుకు హాజరయ్యాడు… స్టెప్పులు వేశాడు… దేశదేశాల ప్రతినిధులతో రాసుకుని పూసుకుని తిరిగాడు… మంచి సినిమాయేతర ఎక్స్‌పోజర్… భిన్నమైన అనుభవం… పైగా దేశ, విదేశీ మీడియా కవరేజీతో కొత్త ఇమేజీని సంపాదించుకున్నాడు…
అసలు ఇదేకాదు… సొంతంగా ఓ విమానయాన సంస్థను స్టార్ట్ చేయడం, తను హీరోగా నటించడంకన్నా చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి వచ్చాక తనతో సినిమాలు నిర్మాతగా నిర్మించడం వంటివి రాంచరణ్‌లో కొత్త వ్యక్తిని చూపిస్తాయి… అంతెందుకు పెళ్లయ్యాక చాలా ఏళ్లకు గానీ పిల్లలు జోలికి పోవడం లేదు… ఆర్ఆర్ఆర్ సినిమాతో తను నటుడిగా ఓ మెట్టు ఎక్కాడు… ఓ పాటకు ఆస్కార్ రావడంతో తన ఇమేజీకి కూడా బాగా కలిసొచ్చింది… తాజాగా మరో వార్త వినిపించింది …
తనకు ఓ దోస్త ఉన్నాడు… పేరు విక్రమ రెడ్డి… తనది యూవీ క్రియేషన్స్… ఇద్దరూ కలిసి ‘వీ మెగా పిక్చర్స్’ అని కొత్త సంస్థను స్టార్ట్ చేశారు… ఇందులో వీ అంటే విక్రమ రెడ్డి అని… మెగా అంటే రాంచరణ్ ఫ్యామిలీ పేరు… రెండూ కలిస్తే వీ మెగా పిక్చర్స్… దీని సంకల్పం ఏమిటంటే..? యువతలో, కొత్తవారిలో టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడం…
Ads
కొత్త వాళ్లకు పాన్ ఇండియా కంటెంట్ రచనతోపాటు, ఇతరత్రా సినిమా విభాగాల్లో అవకాశాలనిస్తారు… వాళ్లకు ఈ వీ మెగా పిక్చర్స్ ఓ ప్లాట్ ఫామ్ అన్నమాట… కొత్తదనం కోసం తన్లాట… అవసరం కూడా… అందుకే ఈ కొత్త సంస్థ… సో, రాబోయే రోజుల్లో రాంచరణ్‌లోని నిర్మాత ప్రధానంగా పాన్ ఇండియా సినిమాల మీద కాన్సంట్రేట్ చేయబోతున్నాడన్నమాట…
‘‘సినిమా ప్రపంచంలోకి ఇంకా కొత్తదనం రావాలి… కొత్త ప్రతిభ వికసించాలి… వాళ్లకు సరైన ప్లాట్‌ఫామ్ కావాలి… అదే మా వీ మెగా పిక్చర్స్ ధ్యేయం… నిపుణులైన సీనియర్లు కొత్తవారికి మార్గదర్శకత్వం వహిస్తారు…’’ అని సదరు ప్రొడక్షన్ హౌజ్ పేరిట రాంచరణ్ ప్రకటన వెలువడింది… స్పష్టంగా ఈ సంస్థ ఏం చేస్తుందో ఎవరికీ స్పష్టత లేదు, రాబోయే రోజుల్లో చూడాలి… కొత్త ఆర్టిస్టులు, రైటర్లు, డైరెక్టర్లు, టెక్నిషియన్లకు ఓ ప్లాట్‌పామ్‌గా ఉంటుందనేదే ప్రాథమికంగా విక్రమరెడ్డి వెల్లడించిన విషయం…
Share this Article