సినిమా అన్నాక ప్లాపులుంటయ్, హిట్లుంటయ్…. కాకపోతే తెలుగు సినిమాకు ఆదాయాన్ని భారీగా తీసుకొచ్చే మార్గాలు పెరిగాక… రేంజ్ పెరిగింది… సినిమా ఎంత చెత్తగా ఉన్నా సరే, మరీ ఎక్కువ నష్టాలతో నిర్మాతలు ఏమీ తలపై తువ్వాలేమీ కప్పుకోవడం లేదు… ఒకేసారి ఇతర భాషల్లో రిలీజ్ చేయడం, శాటిలైట్ టీవీ హక్కులు, ఓటీటీ హక్కులు, ఓవర్సీస్ హక్కులు గట్రా చాలా రూట్లలో రెవిన్యూ వస్తోంది… కానీ కరోనా దెబ్బకు ఇండస్ట్రీ కకావికలం అయిపోయింది… థియేటర్లు దివాలా తీసే దుస్థితి…
ఈ పరిస్థితిలో నాని ‘వి’ సినిమాను ఒక ఓటీటీ ప్లాట్ఫారానికి అడ్డగోలు రేట్లకు అంటగట్టారు… మధ్యలో దళారులే ఎక్కువ లబ్ధి పొందారనీ, ఆ సినిమా అతి తక్కువ వ్యూస్ చూసి, సదరు ఓటీటీకి దిమ్మతిరిగిపోయిందనీ మార్కెట్ సమాచారం… అంత ఫ్లాప్ అయ్యింది సినిమా… ఈ దెబ్బకు ఇక కొత్త, భారీ సినిమాలను నేరుగా ఓటీటీల్లో రిలీజ్ చేయడం ఆగిపోయినట్టే… అంటే అంత భారీ రేట్లను ఓటీటీలు ఆఫర్ చేసే సీన్ ‘వి’ ఫ్లాపుతో దూరం అయిపోయింది…
Ads
సరే, ఓటీటీలో ఫ్లాప్ అయిపోయింది… ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారని ఏదో వార్త కనిపించింది… నిజానికి శుద్ధ దండుగ ఆలోచన… థియేటర్లకు జనం ఎవరూ రావడం లేదు… ఇప్పట్లో రారు… థియేటర్లకు పవర్ చార్జెస్ కూడా వసూలు కావడం లేదు… అదే కాదు అసలు కారణం… సినిమా ఆల్రెడీ ఫ్లాపే కాబట్టి ఎవరికీ ఇంట్రస్టు ఉండదు… ఫ్లాప్‌ను నిర్ధారించింది ఆ ఓటీటీ కాదు… తాజాగా రిలీజ్ అయిన బార్క్ టీవీ రేటింగ్స్…
నిజం… ఈ చార్ట్ ఒకసారి చూడండి…
ఇది హైదరాబాద్ బార్క్ రేటింగ్స్ తాజా చార్ట్… వి సినిమా రేటింగ్స్ అయిదు లోపు… ఫాఫం… మరీ ఓ థర్డ్ రేట్ సినిమాకు కూడా ఎక్కువ రేటింగ్స్ వస్తాయి… అవి కూడా దక్కించుకోలేకపోయింది… అంటే జనానికి టీవీల్లో వస్తే కూడా దాన్ని చూడటానికి ఇంట్రస్టు లేదు… మరిక థియేటర్లలో ఎవరు చూస్తారు సార్..?
ఎస్, సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ అనీ, విలన్ అనీ మొదట ప్రచారం చేశారు… నిజానికి నాని హీరో… దాంతో సినిమాకు హైప్ తీసుకురావడానికి ఉద్దేశించిన ప్రచారం కాస్తా ఎదురుతన్నింది… పక్కా రొటీన్, ఫార్ములా, బోరింగ్… అవే సూపర్ మ్యాన్ ఫైట్లు… పిచ్చి హీరోయిజం గట్రా… పైగా ఇందులో మరో హీరో సుధీర్ బాబు ఉన్నాడు… ప్రతిభ కలిగిన తారలు నివేదా థామస్, అదితిరావు హైదరీ ఉన్నారు… కానీ ఏం ఫాయిదా..,? నాని సెంట్రిక్ కథలో ఎవరికీ సరైన స్కోప్ లేకుండా పోయింది… వెరసి సినిమా తన్నేసింది… నానీ… హిట్ కొట్టి ఎంతకాలమైంది…? భిన్నమైన నటుడు, నేచురల్ నటుడు అని నెత్తి మీద ఎక్కించుకుంటే, నువ్వూ సగటు తెలుగు సినిమా ఫార్ములా హీరోగా మారిపోయావు కదా… ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో…!!
Share this Article