Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ తరానికి వారాలు చేసుకుని చదవడం అంటే తెలియకపోవచ్చు..!

February 8, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……… మురళీమోహన్ నూరవ చిత్రం 1981 డిసెంబర్ అయిదున వచ్చిన ఈ వారాలబ్బాయి సినిమా . ఆయన స్వంత నిర్మాణ సంస్థ జయభేరి పిక్చర్స్ ఆధ్వర్యంలో నిర్మించబడిన మొదటి సినిమా కూడా .

గిరిబాబు ప్రారంభించిన ఈ జయభేరిని మురళీమోహన్ అభ్యర్ధన మీద గిరిబాబు ఇచ్చేసాడు . మురళీమోహన్ కు జయభేరి పేరు బాగానే కలిసొచ్చింది . భవన నిర్మాణంలో కూడా ప్రసిధ్ధి .

Ads

కుటుంబ కధా చిత్రాలకు చిరునామా అయిన రాజాచంద్ర ఈ సినిమాకు డైరెక్టర్ . ప్రకాశం జిల్లా ఇంకొల్లు వాసి అయిన ఈయన హత్య చేయబడ్డాడు . ఇప్పటికీ ఆ హత్య మిస్టరీయే . దాసరి శిష్యుడు . సాదాసీదా కుటుంబ కధకు బిర్రయిన స్క్రీన్ ప్లే తయారుచేసుకుని హిట్ సినిమాగా మార్చుకున్నాడు . మురళీమోహన్ కు నటుడిగా మంచి పేరు , నిర్మాతగా డబ్బులు వచ్చాయి .

(తనను ఎవరో హీరోయిన్ హత్య చేయించింది అని కృష్ణవేణి గారు చెప్పారు కానీ, ఆమె పేరు మాత్రం బయటపెట్టలేదు…)

ఈ తరం వారికి వారాలు చేయడం అంటే ఏమిటో తెలియకపోవచ్చు . ఇప్పుడంటే ప్రభుత్వ హాస్టళ్లు , కుల సంఘాల హాస్టళ్లు ఎక్కడ పడితే అక్కడ కావలసినన్ని . ఒకప్పుడు పేద విద్యార్థులు ఆ ఊళ్ళో ఉన్న మనసున్న మారాజుల ఇళ్ళల్లో భోజనాలు ఉచితంగా చేసేవారు . వారానికి ఒక ఇల్లు . దీనినే వారాలు చేయటం అంటారు . అలా చదువుకునే విద్యార్ధిని వారాలబ్బాయి అంటారు .

తన చెల్లెలికి అన్యాయం చేసిన ఒక ప్రబుధ్ధుడి ఊరెళ్ళి వాళ్ళ ఇంట్లోనే వారాలబ్బాయిగా చేరి , వాళ్ళకు తల్లో నాలిక అయి , తన చెల్లెలి కాపురాన్ని చక్కదిద్దుకుంటాడు హీరో . టూకీగా ఇదీ కధ .

హీరో చెల్లెలుగా సుమిత్ర , హీరోయినుగా మాధవి , ప్రబుధ్ధుడిగా గిరిబాబు , అతని తల్లిదండ్రులుగా షావుకారు జానకి , ప్రభాకరరెడ్డిలు , పెద్దమ్మ పెద నాన్నలుగా సత్యనారాయణ , జయవిజయలు నటించారు . ఇతర పాత్రల్లో ప్రసాద్ బాబు , కె విజయ , కృష్ణవేణి నటించారు .

కృష్ణవేణి ఈ సినిమా దర్శకుడు రాజాచంద్రకు రెండవ భార్య . సినిమాలో సత్యనారాయణ నటన హైలైట్ . షావుకారు జానకికి కాస్త చిన్న పాత్రే . సినిమా అంతా మురళీమోహన్ , సత్యనారాయణల మీదే నడుస్తుంది . కధే ఈ సినిమాకు హీరో అని చెప్పవచ్చు .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో నాలుగు పాటలు ఉన్నాయి . థియేటర్లో బాగానే ఉన్నా బయట హిట్ కాలేదు . కాకమ్మ కాకి కలవాళ్ళ కాకి లోకాన ఏకాకి బాగుంటుంది . అర్ధరేతిరి వచ్చాడంట ఆకలేసి ఉన్నదంట , తాంబూలం వేశాడే మేనమామ , లటుకు చిటుకు లంక తోటలో అటుకు ఇటుకు పాటలు శ్రావ్యంగా ఉంటాయి . పాటలను అన్నీ జాలాదే వ్రాసారు .

బోర్ కొట్టకుండా , సస్పెన్సుతో , సంసారపక్షంగా , ఎలాంటి అసభ్యత లేకుండా నిదానంగా మన చేత సినిమా చూపించుకోబడుతుంది . ఇంతకుముందు చూసి ఉండకపోతే చూడండి . చూడబులే . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . A neat , family-oriented , feel good movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ… హఠాత్తుగా ఈ కులగణన తెరపైకి తెచ్చారెందుకు భయ్యా..?!
  • చైనాలో ఏం జరుగుతోంది..? వంద మంది సైనిక జనరల్స్ గల్లంతు..?
  • ఒమర్ అబ్దుల్లా తెలివైనవాడు… సమయస్పూర్తి ప్రదర్శించాడు…
  • కథ రాసేవాడికి చూసేవాడు లోకువ… ఫాఫం, రోజా ఫస్ట్ ఫిలిమ్ కథ ఇదే…
  • 77 వయస్సులో… 55 ఏళ్ల నాటి… ఓ ప్రేమ- పెళ్లి మురిపెం కథ…
  • సీఎం రేవంత్ రెడ్డి ఇది తప్పకుండా చదవాలని కోరుకుంటూ..!!
  • సమకాలీనులు వేరు- సమస్కంధులు వేరు… బోత్ ఆర్ నాట్ సేమ్…
  • లేడీ-D @ నిదా ఖాన్…! నాసిక్ మత స్కాం బట్టబయలైంది ఇలా..!!
  • మన అన్ని వ్యవస్థల్లోకీ జొరబడిన ‘టెర్రరిజం’… బహుపరాక్…
  • కొత్త సీన్..! ఈసారి తమిళేతరుల హవా..! ప్రత్యేకించి తెలుగు కులాలు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions