ఒక్కొక్క కరోనా వైరస్ వేరియంట్ కు ఒక్కొక్క టీకా తీసుకొస్తానని భారత్ బయోటెక్ బాస్ ఎల్లా కృష్ణ చెబుతున్నాడు… అది ఎలా సాధ్యం..? తయారీ ఓకె… పేర్లు మార్చి అమ్మడమే కదా… కానీ సగటు మనిషికి తనను ఏ వైరస్ వేరియంట్ పట్టుకుంటుందో ముందే ఎలా తెలియాలి… ముందే తెలియకపోతే టీకా ఎలా తెలుసుకోవాలి..?
అసలు వైరస్ నిర్ధరణే కాస్ట్లీ… ఒకవేళ వైరస్ ఉందని తేలితే చికిత్స అవసరం తప్ప అప్పటికప్పుడు టీకా అక్కర్లేదు… కోట్ల వైరస్ నిర్ధరణ పరీక్షలు జరుగుతున్నాయి తప్ప ఏ వేరియంటో పరీక్షించడం లేదు… అరకొర వైరాలజీ సెంటర్స్ ఉన్న మన దేశంలో అది సాధ్యమే కాదు… మరి వేరియంట్ వారీ టీకాల ప్రకటన ఎవరికోసం..?
కొన్ని వందల వేరియంట్లు వస్తూనే ఉంటాయి… అది వైరస్ సహజ లక్షణం… ఎన్ని వందల రకాల టీకాలు దుకాణంలో అమ్మకానికి పెడతాడు ఈయన..? అసలు రోగులు అంటేనే ఈ కంపెనీలకు అలుసు… ప్రభుత్వానికి కూడా అలుసు… మరీ ఎల్లా కృష్ణకు జనం అంటేనే హౌలాగాళ్లు…
Ads
ప్రజలందరికీ మంచినీళ్ల సీసా ధరకే టీకా ఇస్తాను అన్నాడు… అంటే కారు చౌక తయారీ… తీరా ఏం చేశాడు..? అడ్డగోలు రేట్లకు అమ్మాడు… ఎవడు ధర ఖరారు చేసేది..? కళ్ళు మూసుకున్నాయి మెడికల్ రిలేటెడ్ వ్యవస్థలు అన్నీ… చివరకు సంపూర్ణ ప్రయోగ ఫలితాల పరిశీలన కూడా జరగలేదని ఆరోపణ…
ఇద్దరు పిల్లలు సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా మరణించారన్న కేసులో విచారణ సందర్భంగా కేంద్రం సుప్రీం కోర్టుకి ఏం చెప్పిందో తెలుసా ఈరోజు… “నిర్బంధంగా కాదు, వాక్సినేషన్ అనేది స్వచ్చందం… సో, నాకేమీ బాధ్యత లేదు”… అదెలా..? ప్రజల ప్రాణాలు, ఒక విపత్తు సంబంధ అంశాలపై నాకు బాధ్యత లేదని అనడం ఏమిటి…? ఆశ్చర్యం…
ఈ విచారణ ఇలా సాగుతూనే ఉంది … ఇంకోవైపు చుక్కల టీకాకు కేంద్రం ఇచ్చింది తాజాగా… అది బూస్టర్ కూడానట… ఎన్ని బూస్టర్లు..? ఎన్ని రకాలు ..? ఎన్ని వేల కోట్లు..? ఏమైనా జరిగితే మాత్రం ఎవరికీ బాధ్యత ఉండదట… దేవుడా… దేవుడా…
Share this Article