Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బుడ్డోడిని ఆడించలేదు – చివరకు ఐర్లాండ్ కూడా ఆడుకుంది – ఓడించింది

June 26, 2026 by M S R

.
ఎస్, ఇగోలకు పోయి, ఆఫ్టరాల్ పదిహేనేళ్ల పోరడిని మాతో దీటుగా ఆడించుకోవాలా అనుకున్నారేమో మన ఇండియన టీ20 జట్టు క్రికెటర్లు… తోపులు… కానీ కాగితాలపైనే… అలా అనుకుని చివరకు ఆ ఐర్లాండ్ జట్టు మీద అవమానకరంగా ఓడిపోయింది…

ఇజ్జత్ కచరా అంటారు దీన్నే… ఒక్క అభిషేక్ శర్మను వదిలేస్తే, అందరూ టపటపా ఏదో పనున్నట్టుగా వికెట్లు సమర్పించుకుని పెవిలియన్ దారి పట్టారు, ఒక్కడూ ఒక మంచి షాట్ కొట్టింది లేదు… సరైన భాగస్వామ్యం లేదు, బాధ్యతాయుత బ్యాటింగు లేదు…

పేరుకు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే … ఒక్కడు కూడా కుదురుగా కుదురుకోలేదు క్రీజులో… వైభవ్ కోసమే సగం జనం వచ్చారు స్టేడియానికి… సోనీ లివ్ వాడు కూడా మొదటి నుంచీ తన ఫోటో పెట్టి ప్రోమోస్ వదిలాడు…

Ads

తీరా చూస్తే తను లేడు చివరకు ఆడే జట్టులో… (జియో స్టార్ జియో స్టారే, ప్రత్యక్ష ప్రసారంలో సోనీ లివ్ అట్టర్ ఫ్లాప్)… నిజానికి ఐర్లాండ్ 51 పరుగులకు 4 వికెట్లు… ఆ స్థితి నుంచి 185 రన్స్ దాకా తీసుకుపోయారు… కారణం ఏమిటో తెలుసా..?

మన వాళ్లు వేసిన లూజ్ బాల్స్, పూర్ ఫీల్డింగ్, క్యాచ్ మిస్సులు… బాధ్యతారాహిత్యం… పేరుకే సర్పంచ్ సాబ్ (శ్రేయాస్ పేరు కెప్టెన్సీలో తోపు) పేలవమైన నాయకత్వం… అసలు ఇది ఓ అంతర్జాతీయ జట్టేనా అనిపించేలా ఉంది మన జట్టు ఆటతీరు…

బ్యాటింగుకు వచ్చాక మరీ దారుణం… ఏతావాతా తేలిందేమిటయ్యా అంటే, జింబాబ్వే, వెస్టిండీస్, కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న దేశాల జట్లు కాస్త దృష్టి పెట్టి, కాన్సంట్రేట్ చేస్తే ప్రస్తుత ఇండియా టీ20 జట్టును ఓడించొచ్చు… అత్యంత పరాభవకరంగా… ప్రస్తుతం ఐర్లాండ్‌తో అనుభవం ఇదే…

నిజానికి వైభవ్ లేడు అనేసరికి 60- 70 శాతం మంది మ్యాచ్ చూడటమే మానేశారు… తీరా చూసిన వాళ్లు భంగపడ్డారు… ఎస్, ఇది టీ20 క్రికెట్, ఎప్పుడు ఏమైనా జరగొచ్చు, కానీ మరీ ఇలాంటి మ్యాచ్ మాత్రం జరగొద్దు..!! మరీ 148 పరుగులకు, అదీ ఐర్లాండ్ మీద ఆలౌట్… అత్యంత సిగ్గుచేటు ఓటమి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం తెలుగు దినపత్రికలు – నానాటికీ దిగదుడుపు… సాక్షి సహా !!
  • ప్రైవేటు రాకెట్ విక్రమ్-1 విజయాన్ని ఇలా అర్థం చేసుకుందాం!!
  • సోనమ్ దీక్ష భగ్నం సరైన చర్య! ఇప్పటికే ఆలస్యమైంది కూడా!!
  • ఐశ్వర్య ఫ్లాప్ – లయ డబుల్ ఫ్లాప్ – నాగదుర్గ డిజాస్టర్ – ఏమిటీ దురవస్థ..!!
  • TRS … ఈ పేరుపై BRS ప్రేమ ఏమీ లేదు… భయం, కలవరం..!!
  • అదే పాత కథ- అదే పాత తారాగణం- అదే పాత కథనం… చీప్ కామెడీ అదనం !!
  • … దాంతోనే మొదలైంది యండమూరి సుదీర్ఘ రచన ప్రస్థానం !
  • అనగనగా ఓ దట్టమైన అడవి… దారితప్పిన ఆరుగురు ఫ్రెండ్స్
  • ఓ పాకిస్థానీ గూఢచారి (స్పై) దొరికాడు… కానీ ఒప్పుకోవడం లేదు
  • ‘లయ’ తప్పింది ! ‘వదలా’ అంటూ బోరించే కథాకథనాలు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions