.
కొన్ని ఉద్విగ్న క్షణాలు ఉంటయ్… వాటిని అక్షరాల్లోకి దించలేం… ఇండియా- ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌లో మన తెలుగు క్రికెటర్ నితిష్ కుమార్ రెడ్డి దంచిన సెంచరీ అలాంటిదే…
ఎహె, సెంచరీలను ఇప్పటివరకు వేలాది మంది క్రికెటర్లు సాధించారు కదా అనొచ్చు… కానీ కొన్ని సెంచరీలకు వేరే విలువ ఉంటుంది… అలాంటిదే ఇది కూడా…
Ads
ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్సే అధికంగా ఉన్న ఆ 80 వేల మంది ప్రేక్షకుల చప్పట్లతో హోరెత్తింది స్టేడియం… అదీ ఆ సెంచరీ విలువ… ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న ఇండియన్ క్రికెట్ ఫ్యాన్సయితే ఇక చెప్పనక్కర్లేదు…
కామెంటరీ బాక్సులో ఉన్న ఇండియన్ కోచ్ రవిశాస్త్రి కళ్లల్లో కూడా నీటిచెమ్మ… ఎందుకు..? విపరీతమైన ఒత్తిడిలో… కోహ్లి, రోహిత్ వంటి టాప్ స్టార్లు బ్యాట్లు ఎత్తేసి, వరుసగా ఫెయిల్ అవుతున్న నేపథ్యంలో… సెవెన్త్ డౌన్‌లో వచ్చిన ఈ ఇరవయ్యేళ్ల ఒక జూనియర్ ఆటగాడు… ఫాలో ఆన్, మరో ఘోర ఓటమి ముంగిట్లో నిలుచుని మరీ… ఆ ఆసీస్ బౌలర్లను ఎదుర్కుంటూ సెంచరీ సాధించడం విశేషం…
కుర్రాడే కదా… సెంచరీ అయ్యాక పుష్ప తరహాలో బ్యాటుతోనే గడ్డం నిమురుతూ పెట్టిన ఫోజుతో యావత్ ఇండియన్ క్రికెటర్లు ఫిదా అయిపోయారు… తను బౌలర్, తను బ్యాటర్… ఆల్ రౌండర్… తన క్రికెట్ వయస్సు జస్ట్ 4 నాలుగు మ్యాచులు… మూడు టీ20లు… అంతే… ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు… అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ తన అరంగేట్రం జస్ట్ నెల రోజుల క్రితమే…
ఇవన్నీ సరే… ఆ స్టేడియంలో కూర్చుని ఆనందంతో వెలిగిపోతున్న తన తండ్రి మొహాన్ని చూడాలి… ఇంతకు మించి ఏం కావాలి తనకు అని అనడానికి ముందు తను పడిన కష్టాన్ని కూడా ఓసారి నెమరేసుకోవాలి మనం…
తండ్రి పేరు ముత్యాల రెడ్డి… హిందుస్థాన్ జింక్ ఉద్యోగి… తనకు ఉదయపూర్‌కు బదిలీ అయ్యాక, ఇక ఆ ఉద్యోగమే మానేసి పూర్తిగా కొడుకు క్రికెట్ కెరీర్ మీదే దృష్టి పెట్టాడు… బంధుగణం, మిత్రులు తనను పిచ్చోడిలా చూశాడు… కానీ తన కొడుకు ఆట మీద తనకు పెద్ద నమ్మకం… ఎవరేమనుకున్నా తన నిర్ణయం మీదే నిలబడ్డాడు…
https://www.facebook.com/reel/3696039650694033
నాగాలాండ్ మీద జరిగిన ఓ పోటీలో 345 బాల్స్‌తో ఏకంగా 441 రన్స్ చేశాడు… మొత్తం ఆ టోర్నమెంటులో 176 సగటుతో 1237 రన్స్ దంచాడు… 2023లో తనను ఐపీఎల్ సన్‌రైజర్స్ జస్ట్ 20 లక్షలకు కొనుక్కుంది… 2025 ఐపీఎల్ కోసం అదే జట్టు అదే ఆటగాడికి 6 కోట్లు ఇవ్వనుంది… అందుకే ఈ సెంచరీకి ఓ విలువ… అదీ ఆ తండ్రి ఆనందానికి కారణం… కంగ్రాట్స్ టు న్యూ హీరో ఆఫ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్…
Share this Article