Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జగమెరిగిన గాయని ఆశా భోస్లే ఓ మంచి మాట చెప్పింది… ఏమిటంటే..?

July 12, 2021 by M S R

ఆశా భోస్లే… భారతీయ సినీ సంగీతాన్ని ప్రేమించేవాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు… మెలొడి, క్లాసిక్ మాత్రమే కాదు, రకరకాల ట్యూన్లకు ప్రాణం పోసింది ఆమె గాత్రం… 87 ఏళ్లు ఆమె వయస్సు ఇప్పుడు… ఆమె ఇండియన్ ఐడల్ షోకు వచ్చింది ఈవారం గెస్టుగా… నిజంగా ఇలాంటివాళ్లను పిలిచి, పాత స్మృతుల్లో పరవశిస్తేనే షోకు నిజమైన విలువ… షణ్ముఖప్రియ ఓ పాట పాడింది… తనకు అలవాటైన రీతిలోనే, తను ఎప్పుడూ అటెంప్ట్ చేసే ఓ పాప్ సాంగ్ పాడింది… పాప్, జాజ్, రాక్, యెడ్లీ… ఏదయితేనేం షణ్ముఖ అలవోకగా రక్తికట్టించగలదు… అలాగే పాడింది… ఆశా ఆమెను అడిగింది… ‘‘నాకోసం ఏదైనా మంచి క్లాసిక్ రెండు లైన్లు పాడగలవా…’ ఆమె పాడింది… అందరూ చప్పట్లు కొట్టారు, సరిపోయింది… షణ్ముఖ ఎంతసేపూ ఈ పాప్ తరహా తప్ప క్లాసిక్ పాడటం లేదు అనే అసంతృప్తి ప్రేక్షకుల్లో ఉంది… సోషల్ మీడియాలో పనిగట్టుకుని ఆ భావనతో ఆమె మీద ట్రోలింగ్ కూడా సాగుతోంది… పలు సైట్లు కూడా ఆమెను టార్గెట్ చేసి నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్నాయి…

ashish kulakarni

ఆమధ్య తృటిలో ఎలిమినేషన్ తప్పించుకుంది కదా… ప్రేక్షకుల వోట్లు ప్రతివారం తగ్గిపోయి షణ్ముఖప్రియ మెడ మీద ఎలిమనేషన్ కత్తి వేలాడుతూనే ఉంది… ఈ స్థితిలో ఆశ ఆమెను అడిగి మరీ ఓ క్లాసిక్ పాడించడం ఏదో స్క్రిప్టెడ్ బిట్ అనిపించింది… ఆమెతో కావాలనే అడిగించి, షో నిర్మాతలు పాడించినట్టున్నారు… సరే, అదీ మంచిదే… అయితే ఇక్కడ ఆశ చెప్పిన కొన్నిమాటలు విలువైనవి… ఎంతసేపూ మాతృభాష, అన్యపదాలతో సంకరం వంటి వివాదాలు నడుస్తుంటయ్ కదా… ఆమె సంగీతాన్ని ప్రస్తావిస్తూ… ‘‘మిడిల్ ఈస్ట్, ఇటాలియన్ సహా చాలా దేశాల సంగీతాల్ని వింటూ ఉంటాను నేను, ఇష్టపడతాను.., మన శాస్త్రీయం సరే, వేరే సంగీత ప్రవాహాలూ వచ్చి కలుస్తూ ఉంటయ్, ప్రభావం ఉంటుంది… అప్పుడే మన సంగీతం కూడా పరిపుష్టం అవుతుంది’’ నిజం… భాష, సంస్కృతి, సాహిత్యం, సంగీతం, జీవనవిధానం ఏదీ మడికట్టుకుని… నన్నంటుకోకు అన్నట్టుగా ఉండలేదు… మాతృభాష కూడా ఇంతే… దాన్ని కాపాడుకోవాలి, అదేసమయంలో ఇతర పదాల్ని కూడా అవసరమైతే కలుపుకుంటూ సమృద్ధం చేసుకోవాలి… (ఆశా భోస్లే సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, భజనలు, సంప్రదాయ లలిత సంగీతం, శాస్త్రీయం, జానపదం, ఖవ్వాలీ… వాట్ నాట్… పాశ్చాత్య సంగీతాన్ని కూడా అనుకరించేది పలుసార్లు… 2000లోనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందింది… పద్మవిభూషణ్ పొందింది…)

Ads

arunitha

సరే, ఈ షో నుంచి పూణెకు చెందిన ఆశిష్ కులకర్ణి ఎలిమినేట్ అయిపోయాడు… షణ్ముఖప్రియ బచాయించింది… వాస్తవంగా వారం రోజులుగా హిందీ సైట్లు, నార్తరన్ మీడియా మొత్తం ఎందుకోగానీ షణ్ముఖప్రియతోపాటు డానిష్‌ను కూడా కలిపి టార్గెట్ చేసింది, ఇద్దరూ ఎలిమినేట్ అయినట్టే అని కథనాలకు దిగింది… ఫేక్ వోటింగ్ ఫలితాల్నీ చెప్పసాగింది… షణ్ముఖకు మరీ లీస్ట్ వోట్లను ప్రొజెక్ట్ చేయసాగింది… కానీ ఇవేమీ షణ్ముఖను ఏమీ నెర్వస్‌నెస్‌కు గురిచేయలేదు, లైట్ తీసుకుంది, ఆ ధోరణి బాగుంది… ప్రేక్షకుల వోట్లు అధికంగా పడ్డవి అరుణితకు… కలకత్తాకు చెందిన ఈ సింగర్ గొంతు నిజంగానే శ్రావ్యం… ఆమె అధిక వోట్లకు అర్హురాలే… దాన్ని కాపాడుకోవడం పెద్ద టాస్క్, ఎందుకంటే ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్‌దీప్, మహారాష్ట్రకు చెందిన సయాలీ, డానిష్ బలమైన పోటీదారులు, షణ్ముఖ సరేసరి… గతంలో ఇంతగా వార్తల్లోకి రాలేదు ఈ షో… కానీ ఈసారి నాణ్యతపరంగా, వివాదాలపరంగా కూడా తరచూ వార్తల్లోకి వస్తోంది… ఆ వార్తల్లో తరచూ కేంద్రబిందువు అవుతున్నది మన షణ్ముఖ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions