Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పట్లో ‘స్వాతి’ – తరువాత ‘మా నాన్నకు పెళ్లి’ – ఇప్పుడు ‘వంద దేవుళ్లు’

June 19, 2026 by M S R

.

బహుశా 1984 కావచ్చు… అప్పట్లోనే క్రాంతి కుమార్ ఓ సినిమా తీశాడు, పేరు స్వాతి… సుహాసిని జీవించేసింది అందులో… తన సింగిల్ మదర్‌‌కు పెళ్లి చేస్తుంది… ఈ సినిమా కథ అప్పట్లో తెలుగు ప్రేక్షకుల్లో చర్చనీయాంశం… పెళ్లికెదిగిన బిడ్డ తన తల్లికి పెళ్లి చేయడం అప్పట్లో ఓ కొత్త కంటెంటు…

తరువాత 1997 లో… మా నాన్నకు పెళ్లి… ఈవీవీ దర్శకుడు… (ఆయన మార్క్ మోటు హాస్యం ఏమీ ఉండదు)… ఇందులో పెళ్లికెదిగిన కొడుకు తండ్రికి పెళ్లి చేస్తాడు, కొడుకు శ్రీకాంత్, తండ్రి కృష్ణంరాజు… ఇదీ ప్రేక్షకాదరణ పొందింది…

Ads

ఒంటరి తల్లి లేదా ఒంటరి తండ్రి… కొడుకో, బిడ్డో పూనుకుని, రెండో పెళ్లి చేయడం సమాజంలో చాలా చూస్తున్నాం… ఎమోషనల్… శారీరక సుఖాల కోసం కాదు, ఓ సాహచర్యం కోసం, తోడు కోసం… అర్థం చేసుకుని, దగ్గరుండి పెళ్లి జరిపించే పిల్లలున్నారు ఇప్పుడు…

ఇదంతా ఎందుకు అంటే… ఈరోజు వంద దేవుళ్లు అనే ఓ సినిమా రిలీజైంది… సేమ్, పైన చెప్పిన కథలాంటిదే… కాకపోతే ఇందులో కొడుకు తల్లి పెళ్లి చేయాలనుకోవడం… ఒక కొడుకు ప్రేమకూ, మరో కొడుకు పెళ్లికీ, అమ్మ రెండో పెళ్లికీ లింకు…

అప్పట్లో బిచ్చగాడు అనే సినిమా వచ్చింది కదా, విజయ్ ఆంటోనీ హీరో… సూపర్ హిట్… తరువాత తన సినిమాలు తెలుగులో వస్తున్నాయి, పోతున్నాయి కానీ ఆ బిచ్చగాడు రేంజ్ హిట్ లేదు… ఇప్పుడు ఆ బిచ్చగాడు దర్శకుడు శశితో విజయ్ ఆంటోనీ సినిమా ఇది…

పాతికేళ్లకే భర్త చనిపోతాడు హీరోయిన్ శ్వాసికకు (ఈమే కదా తల్లి పాత్ర వేయడానికి పెద్ది ఆఫర్ తిరస్కరించింది..?) ఇద్దరు కొడుకులు, తనే పెంచుతుంది, పెద్ద చేస్తుంది, కుటుంబ సహకారం ఉండదు, మొగుడు చనిపోయిన ఆడది అంటే సొసైటీలో అందరికీ అలుసే కదా… సొసైటీ వేధింపులు, సందేహాలు భరించలేక రెండో పెళ్లికి సిద్దపడుతుంది…

అందరిలాగే ఉప్పూకారం తింటున్నాను, నాకు కోరికలు ఉండకూడదా అనీ అంటుంది… ఓ టీచర్ ద్వారా పిల్లలకు తన కోరికను వెల్లడిస్తుంది… అప్పటిదాకా కొడుకులే ప్రపంచంగా బతికే ఆమె బతుకులోకి విజయ్ ఆంటోనీ వస్తాడు… ఆ పెళ్లికి ఎదురయ్యే సవాళ్లే ఈ సినిమా కథ… కథ బాగుంది…

కానీ అంత బలమైన ప్రజెంటేషన్ లేదు… విజయ్ ఆంటోనీ పాత్ర కీలకమే కానీ శ్వాసిక ప్రతి సీన్‌లో, ప్రతి ఫ్రేములో పూర్తిగా డామినేట్ చేసింది… అసలు ఆమే ఈ సినిమాకు షీరో… కేవలం కథ కోసం, శ్వాసిక కోసం సినిమాకు వెళ్లొచ్చు… మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రష్మిక, పూజా హెగ్డే, ఐటమ్ సాంగ్… తమన్ భలే కథలు చెబుతాడు!
  • ఈ పిల్లాడిని బలిగొన్నది కేవలం ఆ ఒక్క మార్కేనా? ఓ మథనం అవసరం!!
  • హోటల్ పనివాడుగా మొదలై… స్టార్ హీరోలకు దీటుగా స్టార్ విలన్!
  • విద్యా శాఖ మాత్రం ఇవ్వొద్దుట ! – మంత్రిగా ఉంటే పర్లేదుట !!
  • భక్తి తప్పు కాదు – ఇదుగో ఇలాంటి మూఢ భక్తే ‘మోక్షమార్గం’!
  • ప్చ్… చివరకు ఈ అనంత జ్ఞాన శ్రీరాముడూ చెప్పేవాడయ్యాడు !!
  • హైడ్రా ! తెలంగాణ బీజేపీ బీఆర్ఎస్ అనుబంధ రాజకీయ విభాగమా ?!
  • ఇదంతా తెలంగాణ అస్థిత్వ సమస్యా? బీఆర్ఎస్ పార్టీ అస్థిత్వ సమస్యా!?
  • బొద్దింకల పార్టీ ! మీకు తెలియని ఒక అంతర్జాతీయ పొలిటికల్ మిస్టరీ !!
  • అసలు సమస్య ‘నీట్’ను దాటి… మన వైద్య వ్యవస్థలోనే ‘రోగాలు’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions