.
యానిమల్, కబీర్‌సింగ్ బ్లాక్ బస్టర్లు కావచ్చుగాక… ప్రస్తుతం భారీ డిమాండ్ ఉన్న దర్శకుడే కావచ్చుగాక… అశ్లీలం, అసభ్యం, వెగటు, బోల్డ్ ఎట్సెట్రా దుర్వాసనల్ని వెదజల్లే ఆ సినిమాలు హిట్ అయిఉండవచ్చుగాక…
కానీ… వంగా సందీప్ రెడ్డి మాటల్లో ఓరకమైన ఇగోయిస్టిక్ ఆధిపత్య ధోరణి కనిపిస్తూ ఉంటుంది… గతంలో తనను విమర్శించిన వారిపై ఎత్తిపొడుపు మాటలతో, వెటకారాలతో సోషల్ మీడియాలోనే కౌంటర్ చేయడాన్ని చూశాం… కౌంటర్ చేయకూడదని కాదు, కానీ అందులోనూ ఓ పొగరుబోతుతనం కనిపిస్తుంది…
Ads
ఇప్పుడు దీపిక పడుకోన్‌ను టార్గెట్ చేశాడు… ప్రభాస్‌తో తను చేయబోయే స్పిరిట్ సినిమా కోసం తను ముందుగా ఆమెను బుక్ చేసుకున్నాడు… కథ చెప్పాడు… చెప్పకతప్పదు… ఆమె ప్రస్తుతం బాలీవుడ్ అగ్రకథానాయిక… ఏమీ చెప్పకుండా సంతకం ఎలా చేస్తుంది..?
ఆమె ఆలోచించుకొని… కొన్నాళ్లకు ఈ అసభ్య సీన్లు, బోల్డ్ కంటెంటులో నటించడం అవసరమా అనుకుని (అలాంటివి ఆమె ఇంతకుముందు చేయలేదని కాదు, కానీ ఎందుకో వంగ దర్శకత్వం, యానిమల్ సినిమా పోకడను చూసి…) సినిమా నుంచి తప్పుకుంది… ఆమె ఏమీ చెప్పలేదు… లేదా త్రిష తరహాలో క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెప్పి ఉండవచ్చు…
వంగా అహాన్ని దెబ్బతీసింది అది… తన మెంటాలిటీ తెలుసు కదా.,. తనే ఓ అర్జున్ రెడ్డి… దీపిక ప్లేసులో తృప్తి డిమ్రిని తీసుకున్నాడు… యానిమల్‌లో బోల్డ్‌గా ఆరబోసిన నటి… దీపికతో పోలిస్తే పాపులారిటీ, సీనియారిటీ, ఇమేజ్, మెరిట్ ఎట్సెట్రా ఏం పరిగణనలోకి తీసుకున్నా ఆమె చాలా దూరంలో ఉండిపోతుంది…
కానీ వంగా ఏమంటున్నాడు తాజాగా…. ఆ తృప్తిని తొక్కడానికి దీపిక తను చెప్పిన స్పిరిట్ కథను లీక్ చేయడానికి ప్రయత్నిస్తోందట… డర్టీ పీఆర్ గేమ్స్ అంటున్నాడు…
స్టోరీ లీక్ చేయకూడదనే ఇంగితం లేదా అన్నట్టు ప్రశ్నిస్తున్నాడు… ఓరకంగా నింద మోపుతున్నాడు… (ఎవరి పేర్లూ పెట్టకపోయినా తను ప్రస్తావించింది పరోక్షంగా దీపిక, తృప్తి పేర్లనే)…
అసలు లీక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తనకెలా తెలుసు..? అంటే, లీక్ గాకుండానే లీక్ చేయడానికి ప్రయత్నించడాన్ని ఎలా పసిగట్టినట్టు..? మరి నేరుగా తనకు పక్కాగా తెలిస్తే ఆమె పేరే పెట్టవచ్చుకదా… డర్టీపీఆర్ గేమ్స్ అనే నింద దేనికి..? కొంచెం కొంచెం లీక్ చేయిస్తున్నదనేది తన భావన…
ఇదేం ఫెమినిజం అంటాడు..? దీపిక నేను ఫెమినిస్టును అని డప్పు కొట్టుకుందా ఎక్కడైనా..? మధ్యలో ఫెమినిజం ప్రస్తావన దేనికి..? దానికి వంగ మార్క్ డెఫినిషన్లు దేనికి..? ఫెమినిజం ఎలా ఉండకూడదో ఈయన క్లాస్ దేనికి..?
నిజానికి తృప్తి రేంజును బట్టి దీపికకు ఆమెను తొక్కాల్సిన సీన్ ఏముంటుంది..? పైగా దీపిక మీద ఇలాంటి నిందలు గతంలో ఏమీ లేవు… తను ప్రొఫెషనల్ అనే బాలీవుడ్ ఫిలిమ్ సర్కిళ్లలో పేరు… పైగా స్పిరిట్ కథ మొత్తం ఎవరికైనా చెప్పు, నాకేం ఫరక్ పడదు అని మళ్లీ తలెగరేయడం…
అంత ధీమా ఉంటే, ముందే కథ తెలిసినా సరే, తనకు ఏ నష్టమూ లేదనే అతి ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మరిక డర్టీపీఆర్ గేమ్స్ అనే నింద దేనికి..? నీ పిచ్చి, బోల్డ్ సీన్లలో చేయడం ఇష్టం లేక తప్పుకుంటే ఇలా టార్గెట్ చేయాలా..? ఇండస్ట్రీలో ఎవరూ శుద్దపూసలు కాకపోవచ్చు, కానీ స్థూలంగా చూస్తే మాత్రం వంగా తొందరపడుతున్నట్టు కనిపిస్తోంది..!!
Share this Article