.
దురంధర్ సినిమాపై, ప్రత్యేకించి దురంధర్ 2 సినిమాపై సోకాల్డ్ లిబరల్స్ చిమ్ముతున్న విషం అంతా ఇంతా కాదు… దానికి మతం రంగు పులిమి, బీజేపీ ప్రాపగాండా సినిమా అని ముద్రవేసి… రకరకాల వ్యాఖ్యానాలతో నెగెటివిటీని కృత్రిమంగా రుద్దుతున్నారు… నిజానికి అది దేశం సినిమా… ఉగ్రదేశంతో మన దేశం ఆడుకునే గూఢచర్యం ఆట…
దాన్ని దేశం కోణంలో చూడలేని గుడ్డితనం మన ‘యాంటీ- ఇండియన్స్’ నైజం… ఆ విమర్శలకు హీరో రణబీర్ సింగ్ గానీ, దర్శకుడు ఆదిత్య ధర్ గానీ ఎక్కడా సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నించడం లేదు… వస్తున్న వసూళ్లు, జనంలో కనిపిస్తున్న ఆదరణే సమాధానం చెబుతుందనేది వాళ్ల ధోరణి… దానికి తగ్గట్టే ఈ సినిమా బాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాస్తోంది…
Ads
నిజానికి వసూళ్లు అనేది అప్రస్తుతం… జాతీయ స్థాయిలో ఈ సినిమా గురించి చర్చ సాగుతోంది… అది అతి పెద్ద విజయం… జస్ట్, 300- 400 కోట్లు ఖర్చు పెట్టి, రెండు భాగాల దురంధర్ సినిమాతో ఏకంగా 4000 కోట్ల థియేటరికల్ వసూళ్లు, 400 కోట్ల నాన్ థియేటర్ రెవిన్యూ (ఇప్పటికి) సాధించడం కూడా మామూలు విజయం కాదు…
అదే చాలామందిలో అసూయ మంటను రేపుతోంది… బాలీవుడ్‌ను ఇన్నేళ్లుగా ‘తెగ ఉద్దరించిన’ రియల్ ప్రాపగాండాయిస్టులు’ కిక్కుమనడం లేదు, కనీస అభినందన లేదు… కానీ ఇప్పుడు సందీప్ రెడ్డి ట్వీట్ ఒకటి అలాంటోళ్లందరికీ చెంపపెట్టులా ఉంది… అది ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది…

సందీప్ రెడ్డి వంగా ట్వీట్ సారాంశం… సందీప్ తన పోస్ట్‌లో రాసిన మాటలు అక్షరాలా ఇవే…
“రచయితలు, నటులు కొందరు తప్పుడు ప్రచారాల (propaganda) మీద కెరీర్లు నిర్మించుకున్నారు. అప్పట్లో ఇండస్ట్రీ అంతా పిల్లుల్లా మౌనంగా ఉండిపోయింది. కానీ ఇప్పుడు అదే ముఠా ‘ధురంధర్’ సినిమాను ఎగతాళి చేస్తోంది. ఎదుటివారిని వెక్కిరించడమే మీ మొదటి లక్షణం అయితే, మిమ్మల్ని మీరు లిబరల్ (ఉదారవాదులు) అని పిలుచుకునే హక్కు మీకు లేదు. అసలు నిజాన్ని ఎప్పటి నుండి ప్రచారంగా (propaganda) ముద్ర వేయడం మొదలుపెట్టారో అర్థం కావడం లేదు… వింతైన పరిస్థితులు…”
అంతటితో ఆగకుండా, సినిమా దర్శకుడు ఆదిత్య ధర్, హీరో రణవీర్ సింగ్‌లను ఉద్దేశించి హిందీలో ఒక ఘాటు వ్యాఖ్య చేశాడు…
“ఈ కాలి (నలుపు) దృష్టి (దిష్టి) ఊరికే పోదు.. కేవలం గుప్పెడు మిరపకాయలతో పని జరగదు, ఏకంగా పొలాన్నే తగలబెట్టాల్సి ఉంటుంది (అంటే అంతటి భారీ స్థాయిలో సమాధానం చెప్పాలని అర్థం). ‘ధురంధర్ 2’ చూశాను.. అద్భుతమైన సినిమా!”
అందరికీ ఒక్కటే జవాబు!
ఈ అభినందన కేవలం ఒక సినిమా ప్రశంస మాత్రమే కాదు, ఎంతో కాలంగా ఇండస్ట్రీలో ఒక వర్గం సాగిస్తున్న విమర్శలకు చెంపపెట్టు వంటిది…
-
ద్వంద్వ ప్రమాణాలకు అద్దం: ‘లిబరల్స్’ అని చెప్పుకుంటూ ఒక వైపు భావప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడేవారే, తమ భావజాలానికి విరుద్ధంగా ఉన్న సినిమాను ఎగతాళి చేయడంపై సందీప్ సూటిగా ప్రశ్నించాడు…
-
ప్రచారమా? నిజమా?: దేశభక్తి లేదా వాస్తవ సంఘటనల ఆధారంగా తీసే సినిమాలను ‘ప్రొపగాండా’ అని ముద్ర వేసే ధోరణిని ఆయన తప్పుబట్టాడు…
-
ఆదిత్య ధర్-రణవీర్‌లకు అండగా: విమర్శల రూపంలో వస్తున్న ‘దిష్టి’ని పోగొట్టాలంటే అంతకు మించిన భారీ విజయాలతోనే జవాబు చెప్పాలని ఆయన తనదైన శైలిలో ధైర్యాన్ని నింపాడు…
మొత్తానికి, ‘యానిమల్’ వంటి చిత్రాలతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు ‘ధురంధర్ 2’ విషయంలోనూ అదే దూకుడును ప్రదర్శించి, విమర్శకుల నోళ్లు మూయించాడు. ఈ సినిమా కేవలం బాక్సాఫీస్ విజయం మాత్రమే కాదు, సిద్ధాంతాల పోరాటంలోనూ నిలబడిందని ఈ ట్వీట్ ద్వారా స్పష్టమవుతోంది….
Share this Article