#MaDongSeok …. ఈయన దక్షిణ కొరియా నటుడు… పాపులర్… మంచి మార్కెట్ ఉన్నవాడు… తనను తీసుకొచ్చి పుష్ప సీక్వెల్‌లో ఓ విలన్‌గా ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు… అబ్బా, ఫహాద్ ఫాజిల్ ఉంటాడు, అదనంగా ఈయన కూడా… బహుశా అందుకే ఫాజిల్‌కు చిరాకెత్తుతూ ఉన్నట్టుంది… ఏవేవో కామెంట్లు విసురుతున్నాడు ఈమధ్య…
సరే, తనను అలా వదిలేద్దాం కాసేపు… ఎప్పుడో ఆగస్టులో రిలీజ్ అనుకున్నది కాస్తా నాలుగైదు నెలల దూరానికి వెళ్లిపోయింది… ప్రస్తుతానికి అదీ వాయిదా కాలం… తరువాత..?
ఏమోలే… 30 నుంచి 40 శాతం ఫీడ్ నాకు నచ్చడం లేదు, రీషూట్ చేయాల్సిందే అంటున్నాడు బన్నీ అని కొన్ని వార్తలు… యాక్టర్లు సరిగ్గా పర్‌ఫామ్ చేయకపోయేసరికి మెగాఫోన్ విసిరేసి అసహనంలో ఊగిపోయాడు డైరెక్టర్ అని మరికొన్నివార్తలు…
Ads
ఏదోలా మళ్లీ మొత్తం ప్లాన్ చేసి, రామోజీ ఫిలిమ్ సిటీ దాకా లాక్కొచ్చి క్లైమాక్సు యాక్షన్ సీన్లు షూట్ చేస్తున్నారని ఇంకొన్ని వార్తలు… అటు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా తెర మీదకు బలంగా దూసుకొచ్చిన రాంచరణ్, జూనియర్ ఎన్టీయార్… పాన్ వరల్డ్ రేంజుకు ఎదిగిపోతున్న ప్రభాస్… త్వరలో రాబోయే మంచు కన్నప్ప… ఈ సిట్యుయేషన్‌లో పుష్ప-2 విషయంలో ఏమాత్రం రాజీపడకూడదనే పట్టుదల బన్నీది… గుడ్…
అసలే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌తో పడటం లేదు… ఇప్పటికిప్పుడు మారిపోయిన రాజకీయ పరిస్థితుల్లో సినిమా విడుదల చేయకుండా కొన్నాళ్లు ఆగుదామనేది ప్లాన్ అట… ఆరు నెలలు దాటినా అదలాగే ఉంటుంది కదా..? ఏమో, లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక… కాకపోతే బన్నీ ఫాదర్ అరవింద్ మాత్రం అప్పుడే పవన్ దగ్గర ఓ కుర్చీ సంపాదించేశాడు మొన్న నిర్మాతల్ని పట్టుకుపోయి…
సో, బన్నీకి పుష్ప ఫస్ట్ పార్టుకు మించిన హిట్ కావాలి… అదీ పట్టుదల… కాకపోతే పుష్ప ఫస్ట్ పార్ట్ హిట్టుకు ఒక కారణం పాటలు… మరి సీక్వెల్‌కు ఏమాత్రం ఉపయోగపడతాయో వేచిచూడాలి…
అరె, అసలు విషయానికి వద్దాం… సదరు సౌత్ కొరియన్ విలన్ గనుక పుష్ప-2 ప్రాజెక్టులో చేరి ఉంటే బన్నీకి బాగా ఫ్లెచయ్యేది… కానీ బడ్జెట్ ఇప్పటికే అదుపు దాటిపోయిందట… సో, సదరు విలనుడు కాస్తా ఆ ప్రాజెక్టు నుంచి ఔట్ అంటున్నారు…
అంతేకాదు, వంగా సందీప్‌రెడ్డి… అదేనండీ యానిమల్… తను ప్రభాస్ హీరోగా తీయబోయే స్పిరిట్ సినిమాకు ఆ సౌత్ కొరియన్ విలన్‌ను లైన్‌లో పెట్టారట… ఎందుకు..? ప్రభాస్ స్పిరిట్ సినిమాను కల్కి రేంజు దాటించి, చైనా, కొరియా భాషల్లోకి కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్…
అంటే, పాన్ వరల్డ్ మూవీ… మొత్తానికి వంగా సందీప్‌రెడ్డి ఏదో పెద్ద ప్లాన్‌లోనే ఉన్నాడు… రాజమౌళి, నాగ్ అశ్విన్‌ను బీట్ చేయాలని… ఇంట్రస్టింగు… దున్నేయండర్రా… తెలుగు వెండితెర పతాకలు మీరు..!!
Share this Article