Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నటన అంటే ఆయన… దీటైన మేటి నటప్రదర్శన అంటే ఆమె…

February 14, 2024 by M S R

Subramanyam Dogiparthi….   ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది . దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఈ పాట ఈ సినిమాను వంద రోజులు ఆడించటమే కాదు ; జనం వెయ్యేళ్ళు ఆస్వాదించే పాటయింది . మనసున్న జనం గుండెల్ని పిండే పాటయింది . ఈ పాటలో ప్రతి పదం అద్భుతం . దేవులపల్లి వారి పద విరాట రూపం . ఆ సాహిత్యానికి ధీటుగా ముఖ భావాలను చూపించింది వాణిశ్రీ . 1960s అంతా కళాభినేత్రిగా ప్రేక్షకుల మన్ననలను పొందటానికి వాణిశ్రీ చాలా కష్టపడి సద్వినియోగం చేసుకొంది .


SVR నటన మహాద్భుతం . యుధ్ధరంగంలో కళ్ళు పోయినా , మనస్సుతో ప్రపంచాన్ని అడుగులతో సహా కనుక్కోకలిగిన పాత్రలో గొప్పగా నటించారు . క్రమశిక్షణ , మానవత్వం , క్షమాగుణం కలబోసిన పాత్ర . బహుశా ఆయన్ని కాకుండా మరోకర్ని ఈ పాత్రలో ఊహించుకోవడం కూడా కష్టమే . ఈ సినిమాలో మరొక గొప్ప పాత్ర చంద్రమోహన్ ది . ఆయన కూడా 1960s ని వాణిశ్రీ లాగానే తన వెయ్యి సినిమాల కెరీర్ కు కావలసిన పునాదిని వేసుకున్నారు . అన్నగా , తన చెల్లెలిని మోసం చేసిన దుర్మార్గుడిని చంపిన తర్వాత అతని తండ్రి చేతులలోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయే పాత్రకు జీవం పోసారు .

ఈ ముగ్గురి తర్వాత మెచ్చుకోవలసింది రామకృష్ణనే . చక్కగా నటించారు . జయలలిత ముద్దు బొమ్మగా అందంగా తిరగాడుతుంది సినిమాలో , SVR ఇంట్లో . రమణారెడ్డి , సూరేకాంతం , సారధి ప్రభృతులు నటించారు .

Ads

తమిళంలో సూపర్ హిట్ అయిన మేజర్ చంద్రకాంత్ సినిమా రీమేకే మన తెలుగు సినిమా . కె బాలచందర్ కధ ఇది . I N మూర్తి దర్శకుడు . ప్రధానంగా అభినందించవలసింది యస్ పి కోదండపాణి సంగీతాన్ని . దేవులపల్లి వారి మరో పాట మేడంటే మేడా కాదు గూడంటే గూడు కాదు పాట చాలా బాగుంటుంది . బీహార్ క్షామ సహాయంగా కాలేజిలో హరనాథ్ , వాణిశ్రీల బృంద నృత్యం , పాట కూడా చాలా బాగుంటాయి . ఎందరు ఉన్నారు మీలో ఎందరు ఉన్నారు పాట హుషారుగా , సందేశాత్మకంగా సాగుతుంది . పాత సినిమాల్లో దేశభక్తి పాటల్లో గాంధీ , నెహ్రూ , నేతాజీ బొమ్మల్ని చూపి ప్రేక్షకులను ఉత్తేజపరిచేవారు .

బాలచందర్ సినిమా రంగంలోకి రాక ముందే మేజర్ చంద్రకాంత్ నాటకాన్ని ప్రదర్శించేవారు . ఈ నాటకాన్ని ఊంఛే లోగ్ అనే టైటిల్ తో హిందీలో 1965 లో నిర్మించారు . హిట్ అయింది . జాతీయస్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్ర పురస్కారాన్ని పొందింది . AVM వారు ఈ హిందీ సినిమాను మేజర్ చంద్రకాంత్ టైటిల్ తో తమిళంలో నిర్మించారు . ఆ తర్వాత మన తెలుగులో రీమేక్ అయి ఘన విజయాన్ని సాధించింది .

ఇప్పటికీ తరచుగా టి విలో వస్తూనే ఉంటుంది . ఓ నెల కింద కూడా టి విలో చూసా . ఏ థియేటర్లో చూసానో గుర్తు లేదు కానీ మా నరసరావుపేటలోనే చూసా . యూట్యూబులో ఉంది . తప్పక చూడవలసిన మనసు చిత్రం . ఆర్ద్రత , మనుషుల మీద ప్రేమ , లాలిత్యం అన్నీ కలబోసిన మనసు సినిమా . నాకు చాలా ఇష్టమైన సినిమా . ఈ సినిమాలో వాణిశ్రీ నటనకు ఫిదా అవుతాను చూసిన ప్రతీ సారి .

#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #telugureels #telugucinema #TeluguCinemaNews

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియా భాయ్… హేట్సాఫ్ సిరాజ్… నువ్వూ ట్రూ హైదరాబాదీ…
  • కర్త, కర్మ, క్రియ కేసీయారే..! ఖ్యాతి మసకబారి, తొలి అధికారిక మరక..!!
  • వంగా సందీప్‌రెడ్డి మార్క్ రోల్… నో, నెవ్వర్, సాయిపల్లవికి అస్సలు నప్పదు…
  • నౌషాద్ ఆఫ్ సౌత్ ఇండియా… ఘంటసాలకూ ఆరాధ్యుడు ఈ సుబ్బరామన్…
  • ఆదాయమే పరమార్థమై… ఆ ‘దేవాదాయ ధర్మాదాయ’ నామకరణాలు…
  • ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది… వందేమాతరం..,
  • జేజమ్మ..! బిరబిరా సాగే నదీప్రవాహం… ప్రేమలో అందరినీ తడిపేస్తూ…!!
  • కడుపు చించుకోవద్దు… రేవంత్‌రెడ్డి మాటల్లో తప్పేముంది..?!
  • ఊరికే రావు జాతీయ అవార్డులు… ఎక్కడైనా సరే లెక్కలుంటాయండీ…
  • 5600 కోట్ల విలాసం అది… అడుగే పెట్టలేదు, అమ్మేస్తున్నాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions