ఏం చేస్తాం అనుకుని… చివరకు వేరే పాట కంపోజ్ చేశారు.., అదే కంటెంటు, కానీ ట్యూన్ మార్చారు… కానీ అది అంత పవర్‌ఫుల్‌గా రాలేదు… దాన్ని పాత పాట స్థానంలో పెట్టేసి ఓటీటీల్లో రిలీజ్ చేశారు… చాలామందికి ఆ పాట నచ్చలేదు… ఈ కొత్త పాట మొత్తం సినిమా ప్రాణం తీసేసిందని విమర్శలు వచ్చాయి… ఈలోపు కొజిక్కోడ్ కోర్టు తను విధించిన స్టే ఎత్తేసింది… కాంతార టీం ఊపిరి పీల్చుకుంది… కానీ పాలక్కాడ్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు అలాగే ఉంది…
ఆ మలయాళీ మ్యూజిక్ కంపెనీ విడిచిపెట్టదలుచుకోలేదు… కొజిక్కోడ్ డిస్ట్రిక్ట్ కోర్టు స్టే ఎత్తేయడం మీద హైకోర్టుకు వెళ్లింది… హైకోర్టు ఏం చేసిందంటే… కొజిక్కోడ్ జిల్లా కోర్టు స్టే ఎత్తేస్తూ ఇచ్చిన తీర్పు మీద స్టే విధించింది… సో, కథ మళ్లీ మొదటికొచ్చింది… హైకోర్టు ఈ సినిమా నిర్మించిన హొంబలె బ్యానర్, దర్శకుడు రిషబ్ శెట్టి, ఓటీటీ వేదిక అమెజాన్ సెల్లర్ సర్వీస్, గూగుల్ తదితరులకు నోటీసులు జారీ చేసింది…
Ads
మరోవైపు పాలక్కాడ్ జిల్లా కోర్టు విధించిన స్టే అలాగే ఉంది… ఈ కోర్టు కేసులతో కాంతార టీంకు 400 కోట్ల వసూళ్ల ఆనందం కాస్తా పంక్చరైపోతోంది… 15 కోట్ల పెట్టుబడికి 400 కోట్ల వసూళ్లు అనేది ఓ మ్యాజిక్… దేశవ్యాప్తంగా సినిమా పక్షులన్నీ ఈ సినిమా సక్సెస్ మీదే చర్చించుకుంటున్నాయి… నిజానికి ఆ పాటను చోరీ చేశారా అనే అంశం మీద విచారణ జరిగితేనే బాగుండు…
కర్నాటక సంగీతంలో పేరెంట్స్ రాగాలుగా పేర్కొనే మేళకర్త రాగాల్నే అందరూ వాడుకుంటున్నారు… దానికి ఇందులో మోడరన్ మ్యూజిక్ ఫ్యూజన్… అదొక ప్రయోగం… జనానికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు… కానీ ఆ రాగాలు ఓపెన్ సోర్స్, ఎవరికీ వాటిపై పేటెంట్స్ లేవు… ప్చ్, ఇదేమీ లేకుండానే స్టే, స్టే ఎత్తివేత, ఎత్తివేతపై స్టే… ఇలా నడుస్తోంది కథ… గుళిగ, పంజుర్లీ దేవతలకు కోపం రానివ్వకండి… !! అవునూ, రిషబ్ తాజా ట్వీట్ లో మేం గెలిచాం, త్వరలో పాత పాట ott లో అంటాడేమిటి మరి..?!
Share this Article