Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరదలా మరదలా తమ్ముని పెళ్ళామా… ఏమమ్మా, వైనమేమమ్మా…

March 17, 2024 by M S R

Subramanyam Dogiparthi…..   మరదలా మరదలా తమ్ముని పెళ్ళామా ఏమమ్మా వైనమేమమ్మా , వదినమ్మ వదినమ్మ అన్నయ్య పెళ్ళామా ఏమమ్మా వైనమేంటమ్మా . సి నారాయణరెడ్డి పాట ఆరోజుల్లో వదినామరదళ్ళ సరసం , ప్రేమాభిమానాలను అద్భుతంగా చూపించారు దర్శకులు NTR . బహుశా అలాంటి సున్నితమైన , ఆహ్లాదకరమైన సరసం ఇప్పటి తరం వదినామరదళ్ళకు తెలియదేమో ! ఇప్పటి తరం ఆడపిల్లలు యూట్యూబులో ఈ పాటను తప్పక ఆస్వాదించాలి . సావిత్రి , కృష్ణకుమారిల హావభావాలు కూడా నిజమైన వదినామరదళ్ళ లాగానే ఉంటాయి .

కొసరాజు వ్రాసిన మరో నృత్యగీతం ఎందుకీ తొందర అనే మేజువాణి పాట . పల్లెటూళ్ళల్లో పెళ్ళి ముందు మేజువాణిని ఏర్పాటు చేస్తారు . నేను కూడా చూడలేదు . మా వయసులో ఉన్న వారు కూడా చాలామంది చూసి ఉండరు . మేజువాణి ఎలా ఉంటుందో తప్పక చూడవలసిందే . NTR స్వీయ దర్శకత్వంలో నిర్మించబడిన ఈ వరకట్నం సినిమాలో ఇలా చాలా విశేషాలు ఉన్నాయి . మరో విశేషం సైసై జోడెడ్ల బండి అనే రాజనాల పాట . పాట మధ్యలో రావి కొండలరావు మహాప్రభో అనటం బాగుంటుంది . పద్మనాభం , చంద్రకళల మీద రెండు పాటలు . మల్లెపూల పందిట్లోన చందమామ , గిలకల మంచం ఉంది పాటలు ఈ జంట మీద బాగుంటాయి .

పుట్టలోన నాగన్నా లేచి రావయ్యా పాట ఇప్పటికీ ఆడవాళ్లు నాగులచవితి నాడు పాడుతూనే ఉంటారు . మరో హిట్ పాట ఇదేనా మన సంప్రదాయమిదేనా . అలాగే రేలంగి మీద పాట . ఎవరు చేసిన ఖర్మ వారనుభవించకా ఎప్పుడయినా తప్పదన్నా . ఏదో సమయంలో అందరమూ ఇప్పటికీ పాడుకోక తప్పని పాట , పాడుకుంటున్న పాట . మొన్ననే నా సతీమణికి ఈ పాట వినిపించాను . NTR , కృష్ణకుమారిల పాటలు కూడా ఎంతో శ్రావ్యంగా ఉంటాయి . ఒక పాటలో వారిద్దరూ ఇంకా ఎక్కువ అందంగా కనిపించే రాజకుమారుడు , రాజకుమారి దుస్తుల్లో ప్రేక్షకులను అలరిస్తారు .

Ads

పాత్రల పరంగా అగ్రతాంబూలం సావిత్రిదే . ఆ తర్వాత నాగభూషణం , అల్లు రామలింగయ్యలది . దీన్సిగ తరగ అనే నాగభూషణం ఊతపదం బాగా పేలింది . నిర్మాత , దర్శకుడు , హీరో అయినప్పటికీ తన పాత్రను కావాలని ఎలివేట్ చేసుకోకుండా కధానుసారం ఇతర పాత్రలను ఎలివేట్ చేసారు NTR .

హేమలత , రేలంగి , సూర్యకాంతం , సత్యనారాయణ , చంద్రకళ , పద్మనాభం , మిక్కిలినేని ఇతర పాత్రల్లో నటించారు . వరకట్నం , కన్యాశుల్కం వంటి సాంఘిక దురాచారాల మీద ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమాలో NTR మార్కు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది . ఆయన పంచెకట్టు కూడా ఈ సినిమాలో ప్రత్యేకంగా ఉంటుంది .

తాడేపల్లిగూడెం , తణుకు ప్రాంతాలలో ఔట్ డోర్ షూటింగ్ చేసారు . కమర్షియల్ గా NTR లెవెల్లో సక్సెస్ కాకపోయినా , వంద రోజులు ఆడటమే కాకుండా జనం మెప్పు పొందింది . జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికయింది . మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో రెండు మూడు సార్లు చూసి ఉంటా . యూట్యూబులో ఉంది . ఈతరం యువతీయువకులు ఆనాటి సాంప్రదాయాలు , గ్రామాల్లో పంతాలు పట్టింపులు , కామందుల బదులు పాలేర్లు కొట్టుకోవటం , మేజువాణి , వదినామరదళ్ళ సరసాలు – ఆప్యాయతలు తెలుసుకోవాలంటే ఈ సినిమా తప్పక చూడవలసిందే . ఆదివారమే కదా ! చూసేయండి .

#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #telugureels

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions