.
వారణాసి సినిమా మీద ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉందంటే..? ఓ చిన్న ఉదాహరణ… గ్లింప్స్ రిలీజ్ ప్రోగ్రామ్‌కు మిలియన్లలో వ్యూస్… అంతేకాదు, మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా ఫోటో పెట్టి కొందరు పాటలు రిలీజ్ చేస్తున్నారు…
ప్రైవేటు వీడియోలే… అందులో వేరే వీడియో సబ్‌స్టాన్స్ ఏమీ ఉండదు… జస్ట్ మూణ్నాలుగు ఫోటోలు… అలాంటి వీడియో ఒకదానికి ఏకంగా 8 లక్షల వ్యూస్ కనిపిస్తున్నాయి… లిరిక్స్ కనిపిస్తుంటాయి, బ్యాక్ గ్రౌండ్‌లో మ్యూజిక్, ఆడ మగ గొంతులతో ఓ పాట కూడా…
Ads
అచ్చం సినిమాల బాపతు లిరికల్ సాంగ్‌లాగే… కాకపోతే ఇది అచ్చమైన వారణాసి సినిమా సాంగ్ అన్నట్టుగానే వీడియో కింద డిటెయిల్స్ పెట్టేశారు… బహుశా రాజమౌళి కూడా అంత సమగ్రంగా వివరాలు పెట్టలేడేమో… ఆ వీడియో
ఆరు రోజుల్లో 8 లక్షల వ్యూస్ మాత్రమే కాదు, 8 వేల లైక్స్ కూడా..! వీడియో టైటిలే వారణాసి లవ్ సాంగ్ (4కే) అని ఉంటుంది… ఇంకేం..? జనం ఆసక్తిగా ఓపెన్ చేయడం, చూడటం… బహుశా ఫ్యాన్ మేడ్ వీడియో కావచ్చు…
మహేశ్ బాబు మీద అభిమానంతోనే చేసి ఉంటారు… సరదా క్రియేషనే… కానీ వారణాసి పేరును, ఆ టీమ్ పేర్లను వాడుకుంటే, బహుశా రాజమౌళికి తెలిస్తే ఇబ్బంది పెడతాడు… అది ఊహించనట్టున్నారు మేకర్స్… (ఏమోలే, ఇలాగైనా సినిమాకు ప్రమోషన్ దక్కుతోందని నవ్వుకుని లైట్ తీసుకోవచ్చు కూడా…)
ఆ పాట కూడా ఎవరు రాశారో గానీ… వారణాసి కథకు తగ్గట్టుగానే రాశారు… ఇది ఒరిజినల్ వారణాసి సాంగే సుమా అన్నట్టుగా…! శివుడిని, పార్వతిని, వారణాసినీ, వైకుంఠాన్నీ కలిపి కొట్టాడు రచయిత… ప్రేమ మరీ పొంగిపోయి…
పాట మొదట్లోనే ఇది మన ప్రేమ కథ బదులు ఆ గాయకుడెవరో గానీ… లేదా ఆ రచయిత ఎవరో గానీ… ఇది మన ప్రేమ గద, ఈ గదలో దేవివి నువ్వే కదా, ఈ గదలో దాసుడు నేనే కదా… అని పాడేశారు, రాసేశారు… ఈ గద, బాణం ఎక్కడి నుంచి వచ్చాయి మాస్టారూ..?
ఇది మన ప్రణయ కథ, ఈ కథలో రాజువు నువ్వే కదా…
మన కథలో రాణిని నేనే కదా
నా ప్రియ అందానికీ, మన ప్రేమ గంధానికీ
పార్వతి పరవశమై నా ఎదపై వాలే
నా ప్రియ రుద్రుడికీ మన ప్రేమ బందానికీ
ఆ పరమశివుడే పరవశమై నా ఒడి చేరేలే
నీ కోసం నేను ఏ ఆపదనైనా దాటొస్తా
నీ కోసం నేను ఏ ఉపద్రవాన్నైనా ఎదిరిస్తా
నీ కోసం నేను ఏ ఆయుధాన్నైనా పట్టేస్తా
నీ కోసం నేను ఏ యుద్ధాన్నైనా చేసేస్తా
నీ కాలి మెట్టుకు తోబుట్టువు ఈ వారణాసి
నీ నుదుటి బొట్టుకు తోబుట్టువు ఈ వారణాసి
మన ప్రేమ పుట్టిన వైకుంఠం ఈ వారణాసి
మన పెళ్లి మెట్టింటికి వైకుంఠం ఈ వారణాసి
నిన్నూ నన్నూ పెనవేసింది మన ప్రణయ పిపాసి
నీకూ నాకూ వారధి కట్టింది ఈ వినయ వారణాసి
నీకూ నాకూ ముడివేసింది ఈ మకర సింహరాశి
నీకూ నాకూ జతచేసింది ఈ శుభకర హస్తవాసి
….. తెలుగులోకి డబ్బింగ్ చేసే సినిమాల్లో ఆ ట్యూన్ల నడుమ ఏవో తెలుగు పదాలు పేర్చి జనంలోకి వదిలేస్తారు… అవి సరిగ్గా ఇమిడాయా, అర్థవంతంగా ఉన్నాయా అనేది అక్కర్లేదు… ఇదీ అలాగే వినిపిస్తోంది… కానీ ఏమాటకామాట… కీరవాణి ఈ ట్యూన్ ఓసారి వినాలి, ట్యూన్ వరకూ వోకే, పాడిన గాయని కూడా బాగానే పాడింది..!!
Share this Article