మన నిర్మాతలు… ఏ భాష హీరోనైనా పట్టుకొచ్చి తెలుగులో సినిమా తీస్తారు… మలయాళం, తమిళం నుంచి మరీ ఎక్కువ… వాళ్ల సొంత భాషల్లో ఆదరణకన్నా తెలుగులో ఎక్కువ ఆదరణ పొందిన హీరోలు కూడా ఉన్నారు… కానీ దిల్ రాజు వెరయిటీ… అదే జయసుధ, అదే ప్రకాష్‌రాజ్, అదే సంగీత… అంతా తెలుగు నటులే కనిపిస్తుంటారు… హీరో విజయ్‌తో తమిళంలో ఆ సినిమా తీశాడు… రష్మిక హీరోయిన్… దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా తెలుగే… అన్నట్టు ఫాఫం శ్రీకాంత్ కూడా ఈ సినిమాలో చేశాడు…
ఓ పాతచింతకాయ పచ్చడి కథ,.. ఇక దీన్ని పట్టుకుని తమిళంలో ఎంట్రీ ఇచ్చి, చెలరేగిపోవాలని అనుకున్నాడేమో దిల్ రాజు… తమిళవాళ్లు రానివ్వరు, ఎదగనివ్వరు, ఎదిగితే మొక్క కత్తిరిస్తారు… అది ఇంకా రుచిచూడాల్సి ఉంది దిల్ రాజు… ఆ తమిళంలో తీసిన సినిమాను తెలుగులోకి తర్జుమా చేసి, దాని కోసం తెలుగు నిర్మాతలు, హీరోలతో గోక్కున్నాడు… సంక్రాంతి బరిలో ఆ వారసుడు సినిమాను తను అనుకున్న రీతిలో రిలీజ్ చేయడానికి చాలా కథలు పడ్డాడు దిల్ రాజు…
తీరా చూస్తే… ఈమాత్రం కథకు, ఈ మాత్రం సినిమాకు దిల్ రాజు ఇంత ఫైటింగుకు దిగి చివరకు ఇజ్జత్ పోగొట్టుకున్నాడా అనిపిస్తుంది… సినిమాలో ఏమీ లేదు… ముందే చెప్పినట్టు తమిళ అతి ప్లస్ విజయ్ ఇమేజీ బిల్డప్పు ప్లస్ పాత చింతకాయపచ్చడి కథ… ప్రభావశూన్యంగా థమన్ మ్యూజిక్… హీరోయిన్ ఉన్నదంటే ఉంది… అసలు రొమాంటిక్ ట్రాక్‌కు ఇంపార్టెన్సే లేదు సినిమాలో… ఈమాత్రం దానికి రష్మిక దాకా దేనికో… విలన్ ట్రాకు కూడా వీకే…
Ads
తమిళంలో అనుకున్నట్టే రిలీజ్ చేశారు… ప్రేక్షకుల నుంచి పెద్ద పాజిటివ్ స్పందన ఏమీ లేదు… ఏదో విజయ్ ఫ్యాన్స్ ఆహా, ఓహో అంటున్నా స్థూలంగా సినిమా మాత్రం ప్చ్ ప్చ్… ఇలాంటి కథల్ని తెలుగు హీరోలు గతంలో చేశారు… ఓ వ్యాపార కుటుంబం… ఎవరు వారసుడు అని వెతుకులాట… కుటుంబంతో సరిగ్గా పడక వేరే ఉంటున్న హీరో మళ్లీ కుటుంబానికి దగ్గరై, చెడు శక్తులను ఏరివేయడం, చివరకు శుభం కార్డు పడటం… తెలుగు హీరోలతోనే బోలెడుసార్లు చూసిన కథను తమిళ హీరోతో తెలుగులో చూడాలంటే కష్టమే… పైగా తమిళంలో తీయబడి తెలుగులోకి తర్జుమా అయిన సినిమాను..!
ఇప్పుడు మౌత్ టాక్ వచ్చింది… ఉస్సూరని నిట్టూర్చింది… వాల్తేరు వీరయ్యకు, వీరసింహుడికి చాలా దూరంలో ఉండిపోతాడు ఈ వారసుడు… సో, ఎప్పుడైనా విడుదల చేసుకో… ఏమో, అందరూ తేలికగా తీసిపడేసిన అజిత్ సినిమా తెగింపు ముందు వరుసలోకి రావచ్చునేమో… ఈ మాత్రం వారసుడు సినిమాకు ప్రమోషన్ కూడా తను వెళ్లి వేస్ట్ అనుకున్నాడేమో… నిర్మాత ఎంత దిల్ రాజు అయితేనేమి అనుకుని విజయ్ దాన్ని పట్టించుకోలేదు… ప్రమోషన్ లేక, కొత్తదనం లేక… ఏం చూసుకుని ఈ సినిమాతో అనవసర ఫైరింగులు చేశాడో, ఎందుకు చేశాడో దిల్ రాజయ్యకే తెలియాలి…
Share this Article