మీరు సంగీతం… నృత్యం… కామెడీ… ఏ టీవీ షో అయినా తీసుకొండి… గ్లామర్ మసాలా మస్ట్… లవ్ ట్రాకులూ మస్ట్… అవి లేకపోతే టీవీ షోలు రక్తికట్టవు అని మన టీవీ షోల నిర్మాతల అభిప్రాయం… యాంకర్లు, మెంటార్లు, టీం లీడర్లు… పేరు ఏదయితేనేం… బోలెడుమంది రూపగత్తెల్ని తీసుకురావడం… ఏవేవో ట్రాకుల్లో ముంచి కథ నడిపించడం ప్రజెంట్ ట్రెండ్… చివరకు షో ఫ్లాపయితే ఫస్ట్ బకరాలయ్యేది కూడా వాళ్లే పాపం…
నాగబాబు ఫ్లాప్ షో అదిరింది తెలుసు కదా… ఫస్ట్ సమీరను వెళ్లగొట్టారు… తరువాత భానుశ్రీని వెళ్లగొట్టారు… ఇప్పుడు శ్రీముఖి వచ్చి చేరింది… ఆ హైపిచ్ నవ్వులతో షో బెదిరిపోతోంది… నిజానికి వాళ్లు చేసేది ఏముంటుంది..? కామెడీ స్కిట్లు చూస్తూ పకపకా పళ్లు ఇకిలించడమే కదా… సేమ్, అదే టీవీలో సరిగమ షో వస్తుంది… పాటల షో… ఐనా అక్కడా ఇదే తంతు… సింగర్ హారిక నారాయణ్‌తో యాంకర్ ప్రదీప్ ట్రాక్ పెట్టారు… పైగా పాటపాటకూ నడుమ ప్రదీప్ కామెడీ పంచులు…
Ads
ఈటీవీ ఢీ షో కూడా అంతే కదా… ఆ సర్కస్ ఫీట్ల నడుమ… రష్మి, సుధీర్ లవ్ ట్రాకు… కొన్నాళ్లు హైపర్ ఆది, వర్షిణి ట్రాకు… తరువాత పూర్ణ, ప్రదీప్ ట్రాకు… అసలే పులిహోర, అందులో మసాలా… ఇప్పుడు అకస్మాత్తుగా అందులో నుంచి వర్షిణి మాయం అయిపోయింది… కొత్తగా కింగ్స్, క్వీన్స్ సీరిస్ స్టార్ట్ చేస్తున్నారు కదా… ఓ కొత్త యాంకరిణి… టీం లీడర్ అనాలేమో… కనిపిస్తోంది… పేరు దీపిక పిల్లి…
ఎవరీమె..? టిక్‌టాక్ స్టార్… ఇప్పుడు ట్రెండంతా యూట్యూబ్, టిక్‌టాక్ స్టార్లదే కదా… అన్నట్టు ఈమెను కూడా బిగ్‌బాస్ నాలుగో సీజన్ కోసం అడిగారు, క్వారంటైన్‌కు కూడా వెళ్లింది అన్నారు… తరువాత ఏమైందో ఏమో గానీ… వర్కవుట్ కాలేదు… హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వలేదు…
కామెడీ బిట్లకు లిప్ మూమెంట్ ఇవ్వడం, పాటలకు హమ్ చేయడంతోనే ఈమె మస్తు పాపులర్ అయిపోయింది… ఇన్‌స్టాగ్రాంలో లక్షల మంది ఫాలోయర్లు… ఇప్పుడిక ఢీ షోలోకి రావడం అంటే… ఓ కొత్త యాంకర్ ప్రభ వెలిగినట్టే… మరి రాగానే ఊరుకుంటారా..? హైపర్ ఆది పులిహోర స్టార్ట్ చేసేశాడు… ‘మీ అందరికీ చెబుతున్నా, దీపిక పిల్లి మీ అందరికీ చెల్లి’ అని మొదలుపెట్టేశాడు, అంటే ఈ పిల్లి నాది, మీరెవరూ పోటీకి రాకండి అన్నట్టుగా… ఈ గడుసు పిల్ల మరింత గడుసుగా ‘నీకు కూడా చెల్లినే ఆది అన్నా’ అని బౌన్సర్ వేసేసింది…
ఇప్పుడు ఈమె గురించి చెప్పుకోవడం దేనికంటే..? యూట్యూబ్ స్టార్లను, టిక్‌టాక్ స్టార్లను తేలికగా తీసుకోవద్దు… షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్లే తరువాత కాలంలో పెద్ద సినిమాల డైరెక్టర్లు అయిపోయినట్టుగా… ఈ టిక్‌టాకర్లే భవిష్యత్తులో యాంకరిణిలు… ఏమో… పెద్ద తారలు కూడా అవుతారేమో…! ప్రస్తుతం బిగ్‌బాస్ దాదాపు ఫైనల్స్ దాకా నెట్టుకొచ్చిన అరియానా, హారిక కూడా యూట్యూబర్లే కదా…! నక్కిలీసు గొలుసు దుర్గారావు కథ తెలిసిందే…!!
Share this Article