వరుడు కావలెను… ఈ సినిమా గురించి చెప్పాలంటే కాస్త హీరో నాగశౌర్య అసాధారణ పోకడ గురించి చెప్పాలి… సాధారణంగా తెలుగులో హీరో అంటే అంతా తనే అయిఉండాలి… తనే సినిమాను డామినేట్ చేయాలి… ప్రతి సీనూ తనదే… ప్రతి పంచ్ డైలాగూ తనదే… ఇంకెవరికీ ఏ ప్రాధాన్యమూ ఉండకూడదు… అన్నీ ఉత్తుత్తి సొల్లు పాత్రలే కావాలి…. అలా అనిపిస్తాయి కదా మన తెలుగు సినిమాలు… కానీ ఈ సినిమాలో నాగశౌర్య ఆ భేషజాల జోలికి పోకుండా, ఆ ఫాల్స్ తెలుగు హీరో మార్క్ ఇమేజీ అని పాకులాడకుండా… హీరోయిన్ రీతూవర్మకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చాడు… కొన్నిసార్లు ఇది హీరోయిన్ సెంట్రిక్ సినిమా అన్నంతగా రీతూకు ప్రాధాన్యం ఇచ్చారు సినిమాలో… ఈ విషయంలో నాగశౌర్యను అభినందించాలి… కథకు తగ్గట్టు, హీరోయిన్‌ను గౌరవిస్తూ ఎక్కడా పేచీలు పెట్టకుండా, తన పాత్ర పరిధికే పరిమితమయ్యాడు… గుడ్…
మరో అభినందనీయమైన విషయం… నదియా..! ఆమె మంచి మెరిట్ ఉన్న నటి… సరైన పాత్ర పడాలే గానీ రమ్యకృష్ణకు తాతమ్మ ఆమె… దృశ్యం, అత్తారింటికి దారేది తదితర సినిమాల్లో చూశాం కదా… ఈ సినిమాలో కూడా ఓ మోస్తరు ప్రాధాన్యం ఉన్న పాత్రే… అక్కడక్కడా ఆ పాత్ర కేరక్టరైజేషన్ అతి ప్రదర్శిస్తుంది గానీ, ఈ సినిమా బలాల్లో ఒకటి నదియా కూడా..! తెర మీద ప్లజెంటుగా కనిపిస్తుంది… (అఫ్‌కోర్స్, హీరోయిన్‌కన్నా కొన్నిసార్లు…) అలాగే సినిమాలో మెచ్చదగిన మరో అంశం ఉంది… హీరోయిన్‌కు నప్పీనప్పని, అరకొర పీలికల్ని తొడిగి, మోడర్న్ డ్రెస్సులు అనే కలర్ ఇవ్వకుండా… కాటన్ చీరెల్ని చుట్టారు… రీతూకు అందంగా సూటయ్యాయి కూడా…! (నిజానికి మోడర్న్ డ్రెస్సులు వేసినచోట్ల మరీ ఎండుకపోయినట్టుగా కనిపించింది…) ఇంకో విషయం కూడా ఉంది… దర్శకురాలు లక్ష్మి సౌజన్య తొలి సినిమా ఇది… ఓ సున్నితమైన, సన్నని కథను అలవోకగా లాగించేసింది… ఎక్కడా అసభ్యత లేకుండా క్లీన్‌గా ఉంది…! (ఆ దిగుదిగుదిగు పాటే వెగటుగా, చీపుగా ఉంది… సంగీత దర్శకుడు, రచయిత సిగ్గుపడేలా… ఓ భక్తిపాటను ఇలా భ్రష్టుపట్టించడాన్ని దర్శకురాలు ఆమోదించకుండా ఉంటే బాగుండేది… రీతూ కూడా ఆ పాటలో ఏదోలా ఉంది…)
Ads
నిజానికి సెకండాఫ్‌లో వచ్చే ఆ పిచ్చి ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అంతా ఒకటీరెండు నిమిషాల్లో కత్తిరించిపారేస్తే సినిమా మరింత ఆహ్లాదంగా మారుతుంది… ఆ ఎపిసోడ్లన్నీ బోరింగ్… అసలే పెద్దగా ట్విస్టులు, ఇంట్రస్టింగు దూకుడు లేని కథ కదా… చాలా సీన్లు ఆకట్టుకునేలా చిత్రీకరించినా, డైలాగులు కూడా ఎక్కడికక్కడ సీన్‌కు తగ్గట్టు బాగానే పండినా… సినిమాకు బలంగా నిలిచేది కామెడీ సీన్లే… టిక్‌టాక్, జబర్దస్త్ తరహా స్కిట్లలా అనిపించినా సరే, మరీ తీసిపారేయదగినవి కాదు… పర్లేదు, ఇంకాస్త శ్రమపడితే చాలు, మరో మహిళా దర్శకురాలు తెలుగులో నిలబడగలదు… లక్ష్మి సౌజన్య కాస్త ప్రూవ్ చేసుకున్నట్టే… ఎటొచ్చీ, దిగు దిగు వంటి చిల్లర పాటల దగ్గర ఈ థమన్లను, అనంత శ్రీరాంలకు స్వేచ్ఛనివ్వకుంటే చాలు… శ్రేయాఘోషాల్ పాడినా, షణ్ముఖప్రియ పాడినా సరే వాటిల్లోని వెగటుతనం పోదు…!
Share this Article