Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంబానీ వారింటి పెళ్లి అతిథుల కోసం మన తెలుగు వీణానాదం…

July 12, 2024 by M S R

చాలా లారీల వెనుక, వ్యానుల వెనుక ఓ నినాదం రాసి ఉంటుంది గమనించారో లేదో గానీ… నీ ఏడుపే నా దీవెన… అద్భుతమైన పాజిటివ్ వాక్యం అది… ఎదుటి వాడు ఎంత ఏడిస్తే నేనెంత ఎదుగుతాను, మీ ఏడుపులు నన్నేమీ చేయలేవు అని చెప్పడం…

వేణుస్వామి పాపులారిటీ చూస్తే అలాగే అనిపిస్తుంది… తిట్టేవాళ్లు, వెక్కిరించేవాళ్లు, ఆన్‌లైన్ ట్రోలర్లు రోజూ తనతో ఆడుకుంటూనే ఉంటారు… తీరా చూస్తే తన యాక్టివిటీ మాత్రం వీసమెత్తు తగ్గినట్టు కనిపించడం లేదు… పైగా ఆయన శ్రీమతి ఇప్పుడు మరో విశేషాన్ని మూటగట్టుకుంది…

వేల కోట్ల ఖర్చుతో అంగరంగ వైభవంగా… ప్రపంచం అబ్బురపడేలా ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి జరుగుతోంది కదా… ప్రపంచ స్థాయి అతిథులు, అట్టహాసానికి మరోపేరుగా పెళ్లి కార్యక్రమాలు… ప్రత్యేకంగా ఫ్లయిట్లు, విడిది ఏర్పాట్లు, ఆడంబరపు కానుకలు, వేల వెరయిటీల వంటకాలు… నభూతో అన్నట్టుగా జరిపిస్తున్నాడు ముఖేష్ తన సంపదను ప్రదర్శించే ఓ వేదికగా…

Ads

View this post on Instagram

A post shared by Venu Swamy Parankusham (@parankushamvenu)

ఎందరో కళాకారులు అక్కడ తమ ప్రతిభను ప్రదర్శించే ఏర్పాట్లు చేశారు… ఏరి కోరి కొందరిని పిలిచారు… అదుగో, అలా ఆహ్వానం పొందింది శ్రీవాణి… అదేనండీ వేణుస్వామి సతీమణి… తన వీణ ప్రోగ్రాములతో పాపులరే కదా, దేశవిదేశాల్లో ప్రోగ్రామ్స్ చేస్తుంటుంది… ఇప్పుడు ముఖేష్ అంబానీ పెళ్లిలో వీణానాదం కోసం వెళ్లింది… పైన ఉన్న ఇన్‌స్టా వీడియో తన ఆనందాన్ని తెలియజేసేదే…

అబ్బే, ఓ పెళ్లిలో పాట పాడితే, వీణానాదం చేస్తే గొప్పేమిటి అంటారా..? ఆమెకు ఓ విశేషమైన గుర్తింపే అది… ఎందరో వీణ కళాకారులున్నారు దేశంలో, ఆమెకే ఆ అవకాశం దక్కడం అభినందనీయమే కదా… ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ స్వయంగా ఆతిథ్యం ఇచ్చి, కార్యక్రమం ఏర్పాటు చేసి, వసతి ఇతర సౌకర్యాల్ని చూసుకోవడం ఖచ్చితంగా ఒక మెమరీయే ఆమెకు… ఆల్ ది బెస్ట్ శ్రీవాణీ… అదరగొట్టేయండి మీ వీణానాదంతో అతిరథ మహారథ అతిథుల్ని…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?
  • ‘రా’ కొత్త చీఫ్‌గా ఆపరేషన్ సిందూర్ మాస్టర్ మైండ్..!!
  • చిరంజీవే హీరో అయినాసరే… మాధవి పాత్రదే అల్టిమేట్ డామినేషన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions