.
ఆమధ్య ఏదో సినిమా ఫంక్షన్‌లో ఏదేదో కూసి.., ఆ సినిమా నిర్మాతల్ని, హీరోను ఫుల్ డిఫెన్స్‌లో పడేసి.., ఎహె, నేను అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా మొదట మొండికేసి… తరువాత వింత క్షమాపణలు చెప్పుకున్న నటుడు పృథ్వి ఉదంతం తెలుసు కదా… చివరకు ఆ సినిమా చీదేసింది…
ఏదో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ, కామెడీ ప్రధానంగా ఏదో కథ నడిపించేసే పృథ్విని ఓ భారీ తమిళ చిత్రంలో విలన్‌గా ఎందుకు తీసుకున్నారనేది హాశ్చర్యం… నిజానికి తన నటనే అంతంతమాత్రం… తన పాత్రలూ అంతే… అలాంటిది వీరధీరశూర అనే సినిమాలో ఓ ప్రధానపాత్ర..!?
Ads
విక్రమ్‌కు ఓ హిట్ కావాలి ఇప్పుడు… సరైన పాత్ర పడితే తను ఎంత చెలరేగిపోతాడో తెలుసు కదా… సేమ్, అదే స్థాయిలో పర్‌ఫామ్ చేయగల ఎస్‌జేసూర్య కూడా ఉన్నాడు సినిమాలో… అలాంటప్పుడు మిగతా తారాగణాన్ని, ప్రజెంటేషన్‌ను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి..?
కారకులు ఎవరో గానీ పృథ్విని ఆ పాత్రకు తీసుకోవడం మైనస్ అయ్యింది… ఎవరైనా సీనియర్ విలన్‌ను తీసుకుని ఉంటే హీరో పాత్ర ఇంకా బాగా ఎలివేటయ్యేది… ఏ పాత్రకు ఎవరు అనేది కూడా సినిమా నిర్మాణంలో చాలా కీలకం… సేమ్, హీరో భార్య పాత్రకు తీసుకున్న దుషారా విజయన్ కూడా కాస్త మైనసే… ఈ ఇద్దరూ సినిమాలో సెట్ కాలేదు…
ఓ వివాదాస్పద చరిత్ర ఉన్న హీరో తరువాత కాలంలో అన్నీ మరిచి, విడిచి అనామకంగా బతుకుతూ, కథ డిమాండ్ చేసేసరికి మళ్లీ పూర్వపు యాక్షన్‌లోకి దిగడం అనే స్టోరీ లైన్ చాన్నాళ్లుగా చూస్తున్నదే… కాకపోతే దాన్ని ఎంత భిన్నంగా ప్రజెంట్ చేయగలమనేది ముఖ్యం… అక్కడ ఈ సినిమా నిరాశకు గురిచేసింది.,.
వోకే, విక్రమ్, సూర్య సూపర్… యాక్షన్ సీన్స్ సూపర్… బీజీఎం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అన్నీ సూపర్… కానీ సినిమాకు కేవలం ఎలివేషన్స్ మాత్రమే సరిపోవు, సరైన కథనం, ప్రజెంటేషన్ ముఖ్యం అని మరిచారు ఈ నిర్మాత, ఈ దర్శకుడు…
అసలు పార్ట్2 అనేది పార్ట్1 కు సీక్వెల్ కదా… ఇదేమో డిఫరెంటు, ముందుగా పార్ట్2 జనంలోకి పంపించేసి, తరువాత ఎప్పుడో పార్ట్1 ఇస్తారన్నమాట… అంటే పార్ట్1 అనేది ప్రీక్వెల్… (కాంతార కూడా అంతే కదా…) సరే, టీమ్ ఏదో బాగానే కష్టపడ్డట్టు కనిపించినా, యాక్షన్ సీన్స్ బాగున్నా కథనం ఇంకాస్త బాగుండాలని అనిపిస్తుంది… టైటిల్ కూడా దాన వీర శూర కర్ణ తరహాలో భలే పెట్టారు…
వెరసి, తమిళంలో తన ఫాలోయింగు కారణంగా అక్కడ ఏమైనా వర్కవుట్ అవుతుందేమో గానీ, తెలుగులో జనాన్ని థియేటర్ దాకా రప్పిస్తుందా అనేది డౌటే… పైగా రాబిన్‌హుడ్, మ్యాడ్ స్క్వేర్ పేరిట స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు మార్కెట్‌లోకి వచ్చేశాయి కూడా… అవునూ, పృథ్విరాజ్ ఓ తమిళ సినిమాలో తన ధోరణికి పూర్తి డిఫరెంట్ పాత్రకు ఎంపిక కావడం ఎలా జరిగిందబ్బా..!
Share this Article