కేసీయార్ ఢిల్లీకి వెళ్లొచ్చాక… బీజేపీ మీద సైలెన్స్… అసలు తెర మీదికే రావడం లేదు… ఏ పార్టీ మీద ఏ కామెంట్లూ లేవు… ప్రత్యకించి గ్రేటర్ ఎన్నికల సందర్భంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ వేడి బాగా కనిపించింది… బండి సంజయ్ రోజూ అందులో పెట్రోల్ పోసేవాడు… కానీ హస్తినకు కేసీయార్ వెళ్లొచ్చాక వేడి చల్లారింది… అప్పటిదాకా డిష్యూం డిష్యూం అని కొట్టేసుకున్న రెండు పార్టీల సోషల్ మీడియా కేడర్, ఫ్యాన్స్ కూడా కొన్నిరోజులపాటు సైలెన్స్… ఎన్నికలవేళ టీన్యూస్ వర్సెస్ వీ6 ఒకవైపు… నమస్తే వర్సెస్ వెలుగు మరోవైపు… ఆ డిష్యూం కూడా ఆగిపోయింది… కానీ ఆ రాజీసూత్రం హస్తినకే పరిమితం… రాష్ట్ర స్థాయిలో కొట్టేసుకుందాం అన్నట్టుగా సంజయ్, వివేక్, అర్వింద్ తదితరుల ధోరణి ఉండటంతో… ఇక టీఆర్ఎస్ సోషల్ మీడియా, మీడియా మేమూ సై అంటున్నాయి… ఈమధ్య బీజేపీ మీద టీఆర్ఎస్ ఫ్యాన్స్ సోషల్ దాడి కొంత పెరిగింది… ఈ నేపథ్యంలో…
వెలుగు దినపత్రిక ప్రతిరోజులాగే చిన్న కేసీయార్ వ్యతిరేక కథనం ఒకటి పబ్లిష్ చేసింది… ఒకప్పుడు కేసీయార్ ప్రసంగాలు, ప్రెస్మీట్లకు మస్తు ఫాలోయింగ్ ఉండేది… ఇప్పుడు తన ప్రోగ్రామ్స్ ఎవరూ దేకుతలేరు… అసలు ఎవరూ ఆన్లైన్లో గానీ, టీవీల్లో గానీ తనను పట్టించుకోవడం లేదు… ఇప్పుడు కామెంట్లు లేవు, వ్యూస్ లేవు, లైక్స్ లేవు అని రాసుకుంటూ పోయింది… ఏవో లెక్కలు కూడా చెప్పింది… మొత్తానికి కేసీయార్ గ్రాఫ్ అడ్డగోలుగా పడిపోయింది అని చెప్పడం ఆ కథనం ఉద్దేశం… కేసీయార్ వ్యక్తిగత సోషల్ ఖాతాలే గాకుండా పార్టీ, ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాలు కూడా వెలవెలబోతున్నయ్ అనేది వెలుగు నివేదిక… సరే, ఆ పత్రిక ఎలాగూ కాషాయం పులుముకుంది… యాంటీ-టీఆర్ఎస్ పొలిటికల్ లైన్ తీసుకుంది… ఇలాంటి కథనాలు వస్తూనే ఉంటయ్, దాన్ని పక్కన పెడితే…
Ads
మరి టీఆర్ఎస్ సోషల్ ఫ్యాన్స్ కూడా ఊరుకోరు కదా… హమ్మ, ఇంత పెద్ద కథనాన్ని రాశారు కదా అనుకుని వెలుగు, వీ6, వాటి ఓనర్ వివేక్ సోషల్ ఖాతాలను, పేజీలను కెలకడం స్టార్ట్ చేశారు… ఓచోట వివేక్ వెంకటస్వామి అనే ఫేస్బుక్ పేజీ కనిపించింది… దాని చరిత్ర తవ్వారు… నవ్వొచ్చే విషయం ఏమిటంటే..? ఆ పేజీని ఏడేళ్ల క్రితం ఎవరో పవన్ కల్యాణ్ ఫ్యాన్ స్టార్ట్ చేశాడు… అప్పట్లో ఆ పేజీ పేరు ఏంటో తెలుసా..? ‘‘పవన్ కల్యాణ్ అంటే పడిచస్తాం’’… దాన్ని ఏడాదిలో పవన్ రిపబ్లిక్ పార్టీ అని మార్చారు… సరే, జనసైనికులు కొందరు ఆపరేట్ చేసే పేజీల పేర్లు అలాగే ఉంటయ్… దాన్నలా వదిలేస్తే… 2014లో ఆ పేజీ పేరు డాక్టర్ జి.వివేకానందగా మారిపోయింది… గత ఏడాది వివేక్ వెంకటస్వామి అని మార్చారు… అంటే అప్పుడెప్పుడో ఆ పేజీని కొనేశారన్నమాట… 2.6 లక్షల దాకా ఫ్యాన్స్ ఉన్నారు ఈ పేజీకి…
నిజానికి ఫాలోయర్స్ ఉన్న సోషల్ పేజీలను కొనుక్కోవడం, వాటిని సొంతంగా ఆపరేట్ చేసుకోవడం… సోషల్ మార్కెట్లో కామనే… ఆ పేజీలో మనం కంటిన్యూ చేసే కంటెంటును బట్టి పాత లైకర్లు ఉంటే ఉంటారు, లేకపోతే పేజీని అన్‌ఫాలో కొట్టేస్తారు… అయితే ఓ చానెల్, ఓ టీవీ, ఓ సైట్ ఉండి, సోషల్ మీడియా వింగ్ మెయింటెయిన్ చేసే వివేక్… ఇలా వేరేవాళ్ల సోషల్ పేజీలను కొనుక్కోవడం ఏమిటి అంటూ టీఆర్ఎస్ ఫ్యాన్స్ నిన్న ఫేస్బుక్లో రచ్చ చేయడానికి ప్రయత్నించారు… వివేక్ టీం దాన్నలా వదిలేస్తే పోయేది, ఎందుకోగానీ ఆ పేజీని డిలిట్ కొట్టేశారట… అలా ఉలిక్కిపడాల్సిన అవసరం ఏముంది..? కొందరు నాయకులు, పార్టీలు ఇలా సోషల్ పేజీలు కొనడం, తమ ఫోల్డ్‌లోకి తీసుకుని, పార్టీ ప్రచారానికి వాడుకోవడం తప్పేమీ కాదు… ఏదో దొరికిపోయాం అన్నట్టుగా ఉలిక్కిపడి డిలిట్ కొట్టేయడమే అసలు తప్పు…!!
Share this Article