Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అద్వితీయుడైన అంతటి ఎన్టీయార్ ఓ ద్వితీయ పాత్రలో… కొడుకు కోసం..!!

September 10, 2024 by M S R

వేములవాడ భీమకవి . 1976 సంక్రాంతికి రిలీజయింది . టైటిల్ రోల్లో బాలకృష్ణ నటించారు . ఈ సినిమా గురించి చెప్పేముందు నాదో సినిమా చెపుతా . సెకండ్ ఫారంలోనో , థర్డ్ ఫారంలోనో మాకు తెలుగు పాఠంలో ఈ వేములవాడ భీమకవి పాఠం ఉంది . భీమకవికి భీమేశ్వరుడు వాక్సిద్ది వరం , శక్తిని ఇస్తాడు . భీమకవి ఏమంటే అది జరుగుతుంది . నేను గుడికి వెళ్లి దేవుడుని ఈ వాక్సిద్ది వరం ఇవ్వమని తెగ కోరుకునేవాడిని . కాలేజీకి వచ్చాక అది అయ్యే పని కాదని , ఆ వరం అడగటం మానేసా . భీమకవి పేరు గుర్తొస్తే నా చిన్నప్పటి పిల్లతనం గుర్తుకొస్తుంది . ఇంక అసలు సినిమాలోకి వెళదాం .

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉంది ఈ వేములవాడ . రాజరాజేశ్వరి దేవి , భీమేశ్వర ఆలయాలు ప్రసిధ్ధి . భీమకవి తొమ్మిదవ శతాబ్దపు కవిగా గుర్తించారు . ఆ ఊళ్ళో ఒక పెద్ద వయసు వ్యక్తి తనకన్నా వయసులో చాలా చిన్నదైన యువతిని పెళ్ళి చేసుకుంటాడు . మగ పిల్లవాడు కావాలనేది ఆయన కోరిక . ఆ కోరిక తీరక మునుపే ఆయన మరణిస్తాడు . అతని భార్య భీమేశ్వరుడిని అమాయకంగా కుంతీదేవి లాగా మగ బిడ్డను ప్రసాదించమని కోరుతుంది . దేవుడు తధాస్తు అనటం , ఆమెకు మగ బిడ్డ కలగటం జరిగిపోయాయి . భర్త లేకుండా బిడ్డ కలగటం వలన గ్రామస్తులు సహజంగానే భీమని ఎగతాళి చేయటం , వెలివేయటం వంటివి చేస్తూ ఉంటారు .

ఒకరోజు తల్లిని తన తండ్రి ఎవరని నిలేస్తే , ఆ భీమేశ్వరుడినే వెళ్లి అడగమని చెపుతుంది . భీమేశ్వరుని సన్నిధికి వెళ్లి , నిజం చెప్పకపోతే ఆత్మహత్య చేసుకుంటానని శపధం చేస్తాడు . దేవుడు ప్రత్యక్షమై , తను వరప్రసాది అని చెప్పి , వాక్సిధ్ధి వరాన్ని ప్రసాదిస్తాడు . ఆ తర్వాత ఒకరోజు గ్రామస్తులు ఒక పంక్తి భోజనంలో భీమని అవమానిస్తే భరించలేక అన్నమంత సున్నం కమ్మని , అప్పాలన్నీ కప్పలు కమ్మని అంటాడు . అలా అనగానే అలాగే జరుగుతుంది .

Ads

గ్రామస్తులు భీమకవి గొప్పని గుర్తించి గౌరవిస్తారు . ఆ తర్వాత భీమకవి దేశమంతా పర్యటించటం , ఆ పర్యటనలో కళింగ గంగు అనే రాజుని కలవటం , ఆ రాజు భీమకవిని అవమానించటం , భీమకవి శపించటం , క్షమాపణ అడిగాక శాపాన్ని ఉపసంహరించుకొనటం సినిమా కధ . రాజుగా యన్టీఆరే నటించారు .

భీమకవి కధంటే చిన్నప్పటి నుంచీ నాకు చాలా మక్కువ . మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసా . థియేటర్ అదే అని గుర్తు . తర్వాత ఎపుడూ టివిలో వచ్చినట్లు లేదు . NTR , బాలకృష్ణ , షావుకారు జానకి , సత్యనారాయణ , రాజనాల , విజయలలిత ప్రభృతులు నటించారు . యోగానంద్ దర్శకుడు . పెండ్యాల సంగీత దర్శకుడు .

సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు . బాలకృష్ణని ప్రమోట్ చేయటానికే ఈ సినిమాను తీసారు . యన్టీఆరే భీమకవిగా నటించి ఉంటే సక్సెస్ అయ్యేదేమో ! పాటలు కూడా హిట్ కాలేదు . ఎలాంటి వీడియోలు యూట్యూబులో కనిపించలేదు . పాటల ఆడియో మాత్రమే ఉంది . ఎప్పుడయినా టివిలో వస్తే NTR , బాలకృష్ణ అభిమానులు చూడవచ్చు . వీరిద్దరూ 12 సినిమాలలో కలిసి నటించారు . తండ్రీకొడుకులు ఇన్ని సినిమాలలో కలిసి నటించిన వారు ఇంకెవరూ లేరేమో ! #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు  (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions