.
ఓ వార్త ఆసక్తికరంగా అనిపించింది… ఏబీఎన్ నుంచి న్యూస్ డిబేట్ ప్రజెంటర్ పర్వతనేని వెంకటకృష్ణ వైదొలుగుతున్నాడు అని…
తరచూ ఇలాంటి వార్తలు యూట్యూబులో మూడేళ్ల నుంచీ కనిపిస్తూనే ఉన్నాయి… వెళ్లగొట్టబడ్డాడా, వెళ్లిపోతున్నాడా..? వంటి విశ్లేషణలూ కనిపించేవి… అందుకని మొదట నమ్మలేదు, కానీ నిజమే… తను ఏబీఎన్ చానెల్‌ను వదిలేస్తున్నది నిజమే… రూఢీ…
Ads
ఐతే ఇంకా రాజీనామా పత్రాలు ఇవ్వలేదు, రాధాకృష్ణకు చెప్పలేదు… కానీ ఆయనకూ వేరేమార్గాల్లో తెలుసు వెంకటకృష్ణ వెళ్లిపోతాడు అని..! సరే, సంస్థ మీద ఉద్యోగికి కోపం వచ్చినా, ఉద్యోగి మీద సంస్థకు కోపం వచ్చినా వెళ్లిపోవల్సింది ఉద్యోగే… పెద్ద విశేషమో, పెద్ద వార్తో కాదు నిజానికి…
కానీ గతం వేరు, ప్రస్తుతం వేరు… జర్నలిస్టులే రకరకాల కారణాలతో వార్తల్లో వ్యక్తులవుతున్న రోజులివి… అర్ణబ్ గోస్వామి వంటి నేషనల్ కేరక్టర్లను వదిలేస్తే… ఓసారి తెలుగు టీవీ జర్నలిజానికి వస్తే… కొందరు పాపులర్… రాజకీయ ధోరణులతో… కొందరేమో పిచ్చి పదాలు, తర్కాలు, పర్వర్షన్లతో…
సరే, మరీ అత్యంత అతి ప్రదర్శించే ఒక సాంబశివరావు టీవీ5 వదిలేయాల్సి వచ్చింది… టీవీ5 నాయుడిని మించిన బాబుభక్తిపరుడు అనిపించే మూర్తి కొనసాగుతున్నాడు అక్కడే… రుధిర వర్షం వంటి పిచ్చి పదాలతో, గెటౌట్ ఫ్రమ్ మై స్టూడియో అంటూ నవ్వులాటగా మార్చిన టీవీ9 దేవి వెళ్లిపోయింది సినిమా ఇండస్ట్రీకి… పోస్కో, ఆటోస్పై రజినీకాంత్ సిట్యుయేషన్ ఏమిటో ఇంకా పూర్తిగా తెలియదు…
టాల్కమ్ పౌడర్ మహా వంశీ తన సొంత చానెల్ కాబట్టి ఢోకా లేదు… ఇలా కొన్ని ఉదాహరణలు… జాఫర్ వంటి జర్నలిస్టులది ఓ యూనిక్ స్టయిల్… కానీ తమ సంస్థల పొలిటికల్ లైన్లను మించి జర్నలిస్టులు, ప్రత్యేకించి డిబేట్ ప్రజెంటర్లు ప్రవర్తించడం మన తెలుగు టీవీల్లోనే కనిపిస్తుంది… అందుకే ఒక కొమ్మినేని వార్త టీడీపీ క్యాంపుకి కావాలి, ఒక వెంకటకృష్ణ వార్త వైసీపీ క్యాంపుకు కావాలి… పొలిటికల్ రైవల్రీ… ఇదే వెంకటకృష్ణను బుక్ చేద్దామని వైసీపీ సర్కారు ప్రయత్నించింది కూడా…
ఈ నేపథ్యంలోనే వెంకటకృష్ణ ఏబీఎన్ వదిలేసే వార్తకు కాస్త ఇంపార్టెన్స్… నిజమే, ఏబీఎన్ చానెల్‌లో కొన్ని అంతర్గత, సంస్థాగత సమస్యలు ఉన్నాయి… అవి రాధాకృష్ణకూ తెలుసు… అక్కడి జర్నలిస్టులు కొన్నాళ్లుగా మొత్తుకుంటున్నదే… సరే, వెంకటకృష్ణ వాట్ నెక్స్ట్..? మరో చానెలా..?
కాదు… ఇక ఎక్కడా పనిచేయడు… తనే సొంతంగా ఓ డిజిటల్ మీడియాను ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నాడు… యూట్యూబ్ చానెల్స్, ఓ వెబ్ సైట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఎట్సెట్రా… ఏబీఎన్‌లో తొడుక్కున్న పచ్చ చొక్కాను అక్కడే వదిలేసి వచ్చి, తెల్ల చొక్కా, అనగా న్యూట్రల్ వెంకటకృష్ణ అనిపించుకునే సొంత ప్రయత్నం… మంచి నిర్ణయమే… ఆల్ ది బెస్ట్…!! (నాకు తెలిసి టీవీ9లో కూడా కొన్ని కుదుపులు ఉండవచ్చునేమో…)
Share this Article