.
Subramanyam Dogiparthi…. హీరో వెంకటేష్ అయితే షీరో జయసుధ . వెంకటేష్ , రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన సినిమా ఈ ఒంటరి పోరాటం .1989 లో వచ్చిన ఈ సినిమా స్టోరీ రొటీన్ పగ సాధింపే అయినా పరుచూరి బ్రదర్స్ కొత్త కలనేతలతో నేసారు .
చాలా సినిమాల్లోలాగానే కంస మేనమామ దౌష్ట్యానికి బలయిన మేనల్లుడు తాను ఆ మేనమామకు మేనల్లుడు అని తెలవకుండానే సవాల్ విసురుతాడు . ఆ సవాలుకు ప్రధాన కారణం ఆ మేనమామ కూతురు కూడా . అలా మేనమామ , మరదలు ఇద్దరితో హీరో వెంకటేష్ నాలుగేళ్ళలో మేనమామకన్నా ఎక్కువ సంపాదిస్తానని ఛాలెంజ్ చేస్తాడు .
Ads
ఇంతవరకే అయితే ఓకే . గెలిస్తే కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తాననే షరతు కూడా ఉంటుంది . ఇది ఆధునిక నాగరిక కాలంలో అన్యాయం . పందెం కాయటానికి కూతురిని ఫణంగా పెట్టే కధల్ని రచయితలు వ్రాయటం అన్యాయం .
(యండమూరి నవల డబ్బు ది పవర్ ఆఫ్ డబ్బు- చాలెంజ్ సినిమా)... ఈ ఒంటరి పోరాటం సినిమా కథకు ఆధారం సూర్యదేవర రాసిన త్రినేత్రుడు సీరియల్... దాదాపు యండమూరి నవలకే కాస్త అటూ ఇటూ సేమ్ అనుకరణ...)
మరో సవాల్ జయసుధ , సత్యనారాయణ మధ్య . ఈ సవాల్ ఏకంగా ద్రౌపదిలాగా శపథం . సత్యనారాయణ అంతు చూసేదాకా కురులు ముడవననే ఛాలెంజ్ . ఈ ఛాలెంజ్ కొరకు హీరో వెంకటేషుని బాణంలాగా వదులుతుంది . ఇద్దరికీ కామన్ విలన్ సత్యనారాయణే .
మధ్యలో సత్యనారాయణకు తోడు జయసుధ మాజీ భర్త మోహన్ బాబు కూడా చెయ్యి కలుపుతాడు . జయసుధ , వెంకటేషు కలిసి సత్యనారాయణను ఓడించి జైలుకు పంపుతారు . క్లైమాక్స్ ఫైటింగ్ సీన్లో జయసుధ మాజీ భర్తను చంపేసి జైలుకు వెళుతుంది . మేనమామ కూతురిని పెళ్ళి చేసుకోవడంతో సినిమా శుభాంతం అవుతుంది .
ఈ సినిమా పేరు చెప్పగానే ఎవరికయినా గుర్తుకొచ్చే సీన్ : ఓ బిల్డింగులో లిఫ్ట్ దగ్గర ఆడవాళ్ళ రద్దీని కంట్రోల్ చేయటానికి అద్దాలు పెట్టడం . ఆ తర్వాత గుర్తుకొచ్చేది జయసుధను ఒంటి కాలి మీద నిలబెట్టడం .
నటనపరంగా మొదటి మెప్పు వెంకటేష్ , జయసుధలకే . ఇలాంటి పాత్రలకు ఇద్దరూ పెట్టింది పేరు .
మెయిన్ హీరోయినుగా ఫరా . టైటిల్సులో శ్వేత అని వేసారు ఎందుకనో . ఈ ఫరా టాబూ అక్క . గ్లామర్ బొమ్మ . (కొందరు శ్వేత అనీ, కొందరు సోనియా అని చెబుతుంటారు గానీ... అధికారిక రికార్డుల్లో, వికీలో ఉన్నది ఫరా పేరే... ఈమె తెలుగులో చేసింది రెండే సినిమాలు)...
సెకండ్ హీరోయిన్ రూపిణి . తమిళ హీరోయిన్ . మోహన్ బాబు , సత్యనారాయణలకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే . మోహన్ బాబుది soft looking cruel villainy . ఇతర పాత్రల్లో సుధాకర్ , చిట్టిబాబు , అన్నపూర్ణ , బ్రహ్మానందం , మమత , శుభ , శివాజీ రాజా , పి జె శర్మ తదితరులు నటించారు .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటల చిత్రీకరణ రాఘవేంద్రరావు స్టైల్లో ఉండవు . వేటూరి , జొన్నవిత్తుల వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ , చిత్ర పాడారు . బయట గొప్పగా హిట్ కాలేదు కానీ థియేటర్లో బాగానే ఉంటాయి .
అన్నీ వెంకటేష్ , ఫరా మీద డ్యూయెట్లే . పెదవి మీద ముద్దు ప్రేమ కొద్ది దిద్దు , మేడలొద్దు మిద్దెలొద్దు , నువ్వు రెడీ నేను రెడీ వయసు రెడీ బావా , టిప్పు టాపు సోకులాడి , పడాలి ప్రేమలోన అంటూ సాగుతాయి పాటలు .
పరుచూరి బ్రదర్స్ డైలాగులు సినిమాకు కొంత బలం . రాఘవేంద్రరావు మేజిక్ కధనంలో , స్క్రీన్ ప్లేలో కొద్దిగా కనిపిస్తుంది . సినిమా యూట్యూబులో ఉంది . It’s a pure commercial , feel good entertainer . నేను పరిచయం చేస్తున్న 1222 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article