18 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత… సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ తరువాత… తేలికగా ఊపిరి పీల్చుకుని… రేవంత్ రెడ్డి, పొంగులేటి ఔదార్యంతో వెయ్యిమంది జర్నలిస్టులు పండుగ చేసుకుంటున్న వేళ… హఠాత్తుగా విషవర్షం కురుస్తోంది… ఎవరున్నారు దీనివెనుక..? అటు పాడి కౌశిక్ రెడ్డి ఆంద్రోళ్ల మీద విద్వేషాన్ని చిమ్ముతున్నాడు… కేటీయార్, హరీష్ పోయి మద్దతు పలుకుతున్నారు… ఇటు ఈ జర్నలిస్టుల హౌజింగ్ ససొైటీ మీద విషప్రసారం మొదలైంది… ఎవరున్నారు దీని వెనుక..?
సుప్రీంకోర్టు తీర్పు తరువాత స్వాగతించిన కేటీయార్… మొన్నటి స్థలం అప్పగింత కార్యక్రమం తరువాత కిక్కుమనలేదేం..? అంతకుముందు కేసీయార్ ఆ స్థలం అప్పగింతను సీటు కింద పెట్టుకుని, ఎవరికీ టైమ్ ఇవ్వకుండా, ఏదీ తేల్చకుండా ఉంటే అదే క్యాంపులోని, అదే సొసైటీ బాధ్యులు, లబ్దిదారులు ఒక్క మాటా మాట్లాడలేదేం..? ఇదేం నైతికత..? పోరాటాలు, విప్లవాలు, నక్సలైట్లు అంటూ ప్రవచించే పెద్దమనిషి ఎక్కడకు పోయాడు..? ఈరోజుకూ మాట పెగలదేం..?
ఆ స్థలాన్ని కాజేయాలని కుట్రలు పన్నిందెవరు..? నిజాంపేట స్థలంలో ఆక్రమణలు… పేట బషీరాబాద్‌లో కబ్జాలు… ఎవరు వారి వెనుక ఉన్నది..? ఒక హరీష్, ఒక కేటీయార్ ఎందుకు మాట్లాడరు..? మనస్సుల్లో కుళ్లుతున్న ఆ మర్మమేమిటి..? ఇప్పుడు మరోరకం విషం..? ఆంధ్రోళ్లకు ఒక్కొక్కడికి 100 కోట్ల స్థలమట… మొత్తం 3600 కోట్లు ధారాదత్తమట… 1000 మందికి 100 కోట్ల చొప్పున 3600 కోట్లట… వావ్, నీ తెలివికి జోహార్ బ్రదరూ… నీ వెనుక ఉన్నవాడికి మల్టిపుల్ జోహార్లు…
Ads
రేవంత్‌రెడ్డిని ఈ సాకుతో తారా చౌదరితో లింకు పెట్టి దూషిస్తే మీడియా అడ్వయిజర్‌కు కనిపించదు… ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై విమర్శల్లో చంకనాకడం వంటి పదాలతో తిడుతుంటే ఈ రాష్ట్ర పోలీసులకు, ప్రభుత్వానికి సిగ్గూశరం ఉండదు, కనిపించదు… సీఎం పోస్టు నుంచి దిగాల్సిందే, యూట్యూబ్ చానెళ్లను తిడతాడా..? లేకపోతే రాబోయే ఎన్నికల్లో దుంపనాశనం చేస్తాం అంటుంటే డీజీపీ, పోలీస్ కమిషనర్ కళ్లు కనిపించవు, చెవులు వినిపించవు… సునీల్ కనుగోలును లాగితే కూడా పీసీసీకి కూడా చురుకు పుట్టదు… ఏం వ్యవస్థలురా బాబూ..?
భావ ప్రకటన స్వేచ్ఛ అవసరమే… కానీ మరీ ఇలాగా..? అందుకే యూట్యూబర్లను జర్నలిస్టులు కాదు అంటున్నది… రేవంత్ రెడ్డీ అదే అంటున్నది… పోనీ, నచ్చలేదు, కాదు, మా వివరణ ఇదీ, మా అభ్యర్థన ఇదీ అని కదా అడగాల్సింది… ఒరేయ్ రేవంతూ, నీ అంతు చూస్తాం అనే హెచ్చరిక ఏ కోవ జర్నలిజం..? ఏదీ, ఒక్క మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టు గొంతూ పెగలదేం..?
నమస్తే, వదిలేయండి, వాళ్లూ లబ్దిదారులే అయినా కేటీయార్, కేసీయార్, హరీష్‌లకు కోపం వస్తుందని వణికి ముడుచుకున్నారేమో… మరి మిగతా పత్రికల జర్నలిస్టుల బుర్రలు ఎక్కడ ఏ మర్రిచెట్టు తొర్రలోకి పారిపోయాయి..? ఎస్, అదే క్యాంపు… మళ్లీ మళ్లీ జర్నలిస్టుల హౌజ్ సైట్లపై విద్వేషం, విషం… అదే నిజం, అదే వాస్తవం…
ఏం..? హైదరాబాదులో వైఎస్ హయాంలో, అంతకుముందు ఏ ఉద్యోగ సొసైటీలకూ స్థలాలు ఇవ్వలేదా..? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఇచ్చారు కదా… వాళ్లలో ఆంధ్రోళ్లు లేరా..? ఈ పాత కేసీయార్ క్యాంపు కేరక్టర్లు లేవా..? వాళ్లు కిక్కుమనరేం..? అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్… హైదరాబాద్ జర్నలిస్టుల సొసైటీ అది… కోట్లకుకోట్ల డబ్బు కట్టిన సొసైటీ అది… పుణ్యానికి ఏమీ ఇవ్వడం లేదు..? మరెందుకు ఈ విషం..?
కేటీయార్ వాట్ డు యు సే, మిస్టర్ వారస సీఎం సాబ్..? జర్నలిస్టులపై డొల్ల ప్రేమలేనా..? హరీష్ రావూ..? ఏమంటావు..? ఉత్తుత్తి కబుర్లేనా..? సహించలేకపోతున్నారా..? ఏదో స్పష్టంగా చెప్పొచ్చు కదా… ఎందుకీ దోబూచులాట, దొంగాట..? మీకు చచ్చీచెడీ జర్నలిస్టులంతా అత్యధిక ప్రాధాన్యమిస్తూ కవరేజీలో గులాంగిరీ చేయాల్సిందేనా..? ఎస్, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే ఈ దిశలో ఓ ఆలోచన లేదు, కార్యాచరణ లేదు, ఉత్తుత్తి డొల్ల వాగాడంబరం తప్ప… mr. revanth… why dont you take action against these poisonous social attacks..?
Share this Article