మొత్తానికి కొన్ని స్టోరీలు ఎలా జనరేట్ అవుతాయో అర్థం కాదు… ప్రత్యేకించి బిగ్‌బాస్ కంటెస్టెంట్ల గురించి..! ఏవేవో రాసేస్తూనే ఉంటారు… తీరా చూస్తే హౌజులో అడుగుపెట్టేది వేరు… కాకపోతే బిగ్‌బాస్ టీవీషో పాపులర్ కాబట్టి, చదువుతారు కాబట్టి ఏదో ఒకటి అలా రాస్తూనే ఉంటారు, వ్యూస్ వస్తూనే ఉంటాయి… సరే, అది పొట్టతిప్పలు… తప్పు పట్టలేం… మెయిన్ స్ట్రీమే ఏవేవో రాస్తుంటే… ఫాఫం సోషల్ మీడియాను తప్పుపట్టి ప్రయోజనం ఏముంది..? పైగా ఇదేమో ఉపాధి సమస్య…
విషయం ఏమిటంటే..? జగన్ ఓడిపోయాక వేణుస్వామి మీద విపరీతమైన ట్రోలింగ్ సాగింది… అంతకుముందు లేదని కాదు, కాకపోతే ఈ ప్రిడిక్షన్ దారుణంగా ఫెయిల్ కావడంతో ఇక టీడీపీ కూటమి దారుణంగా టార్గెట్ చేసింది… అందరికీ తెలుసు అది… ఏపీ అంటేనే రెండు వర్గాలు… ఒక ఇంటి మీద కాకి మరో ఇంటి మీద వాలడానికి వీల్లేదు… సో, వేణుస్వామిని జగన్ ఇంటి మనిషిగా ముద్ర వేసేసి, దొరికాడు కదాని ‘షూట్’ చేస్తూనే ఉన్నారు…
అరె, ప్రిడిక్షన్స్ అన్నీ నిజం కావు, స్ట్రయిక్ రేటు ప్రధానం అని ఎంతమందికి చెప్పుకుంటాడు ఆయన… ఛి, దీనమ్మజీవితం అనుకుని, అసలు ఈ సెలబ్రిటీల జాతకాలే బహిరంగంగా చెప్పను, నా దగ్గరికి వస్తే తప్ప అని ఓ భీషణ నిర్ణయం తీసుకున్నాడు, అయిపోయింది… అది తనిష్టం, తన నిర్ణయం… అందులో తప్పొప్పుల విశ్లేషణ అనవసరం…
Ads
వేణుస్వామి మీద ఏం రాసినా వైరల్ అవుతుందని తెలిసి, ఇక అందరూ ఏదో ఒకటి రాసేస్తున్నారు… ఎవరో బ్రాహ్మణులు ఎక్కడో మేక మటనో, కోడి చికెనో తింటుంటే… ఆ ఫోటోషేర్ చేసి వేణుస్వామి శిష్యులు అని పోస్టాడు ఓ క్రియేటర్… సరే, అదంతా ఓ డిఫరెంట్ పబ్లిసిటీ ఇస్తున్నామనే సోయి లేదు, అది వేరే కథ… తాజాగా ఆయన బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నాడు అని వార్తలు…
నిజానికి అది అసత్యమేమీ కాదు… కాకపోతే అంతా అయిపోయి, తను కమిటైనట్టు రాయడమే ఓ విశేషం… తనను అడుగుతున్నమాట నాకు తెలిసి నిజం… దాదాపు కోటి రూపాయల వరకూ ఆఫర్ కూడా వచ్చినట్టుంది… కానీ అక్కడ పదీపన్నెండు వారాలు ఉంటే తను కోల్పోయే సంపాదనలో అది ఏ మూలకూ సరిపోదు… పైగా అదొక తలతిక్క హౌజు… అది యంగ్ సెలబ్రిటీల డాన్సులు, వెకిలి జోకులు, తలతిక్క గేమ్స్ గట్రా ఉంటయ్… తనెలా సూటవుతాడు…?
ఒరే బాబూ, అది నాకు సూట్ కాదు, వదిలేయండిర భయ్ అంటాడు ఆయన… పర్లేదు స్వామీ, ఇంకేమైనా ఎక్కువ కావాలంటే అడగండి అంటారు వాళ్లు… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీల వామాచార పూజల ఆఫర్లు వస్తే సరి, ఈ బిగ్‌బాస్ ఇచ్చేది దేనికీ సరిపోదు… సరిపోలదు… నో, నో, వేణుస్వామి బిగ్‌బాస్ కంటెస్టెంటు అని రాస్తూనే ఉంటాం అంటారా..? వోకే… డిమాండ్ పెంచాలనుకుంటే వోకే…!!
నాగార్జున జాతకాల్ని నమ్ముతాడో లేదో తెలియదు… అసలే ఆటగాడు… కొడుకుల జాతకాలు ఏమాత్రం మెరుగుపడటం లేదు… ఒకరి వివాహం విడాకులు… ఒకరి వివాహం కాకముందే విడాకులు… అసలు నాగార్జున మొదటి పెళ్లే విడాకులు… ఈయన్ని గనుక బిగ్‌బాస్ హౌజులోకి తీసుకుంటే… మై డియర్ నాగ్, ఓసారి లోపలకు రండి, మీ జాతకం ఏమిటో చూద్దాం అంటాడు ఈయన… డౌటే లేదు..!!
Share this Article