సర్ప్రయిజ్… బహుశా ఇప్పటివరకూ నాలుగు సీజన్లలో కలిసి బిగ్‌బాస్ తనంతటతాను ఒక కంటెస్టెంటుకు ఇంత పెద్ద సర్టిఫికెట్ ఇచ్చినట్టు గుర్తులేదు… అనూహ్యం… అభిజిత్ దానికి అర్హుడా కాదా అనేది వేరే సంగతి… అందరూ అనుకుంటున్నట్టు చివరకు తను విజేతగా నిలుస్తాడా లేదా అనేది వేరే ముచ్చట…. కానీ బిగ్‌బాస్ స్వయంగా అభిజిత్‌కు ఓ దండ వేసి, పేద్ద శాలువా కప్పి సత్కరించేశాడు… ఇక ఆ ట్రోఫీ తన చేతికి వచ్చినా రాకపోయినా జానేదేవ్…
ఇంతకీ తను ఏం సర్టిఫికెట్ ఇచ్చాడనే కదా మీ ప్రశ్న… ‘‘నీవంటి తెలివైన, మెచ్యూర్డ్ కంటెస్టెంటు ఈ షోలో ఉండటం మాకే గర్వంగా ఉంది…’’ ఇదీ బిగ్‌బాస్ తనను పొగడ్తల్లో ముంచెత్తుతూ చేసిన వ్యాఖ్య… అఫ్ కోర్స్, ఇది మిగతావాళ్లను తక్కువ చేసినట్టు ఏమీ కాదు.., కానీ ఈ స్థాయి ప్రశంస కాస్త విస్మయకరంగానే ఉంది…
Ads
నిజానికి తను ఓ అండర్ డాగ్‌గా వచ్చాడు షోలోకి… తనకు పేమెంట్ ఎంతో తెలియదు గానీ… తను ముందుగానే మంచి పీఆర్, సోషల్ మీడియా టీం ఏర్పాటు చేసుకున్నాడు… భారీగా ఖర్చు పెడుతున్నాడు… అది తనకు వోట్లు సంపాదించి పెడుతోంది… 11 సార్లు నామినేషన్లలో ఉన్నా తనకు ఫరక్ పడతలేదు… తనంతటతాను నామినేట్ చేసుకొండి అని తోటి కంటెస్టెంట్లకు సవాళ్లు విసరడం వెనుక ఉన్న ధీమా కూడా అదే…
బట్… తనకు ఆ ఏర్పాట్లు పాపులారిటీ తెచ్చిపెట్టలేదు… నిజంగానే తన ఆటతీరు, తన బిహేవియర్‌తో ఆకట్టుకుంటున్నాడు… మరీ నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే ఈ సీజన్ బిగ్‌బాస్ ఓ పేద్ద ఫ్లాప్ షో… గత మూడు సీజన్లతో పోలిస్తే కంటెస్టెంట్లు వీక్… టాస్కులు, గేమ్స్… అన్నీ సోసో…
బిగ్‌బాస్ అంచనాల్లోనూ అభిజిత్ లేడు మొదట్లో… కానీ అనివార్యంగా గుర్తించాల్సి వస్తోంది… గీతమాధురి, శ్రీముఖిలాగా లాస్య, క్లిక్ అవుతుందని అనుకున్నారు… ఫెయిల్… నోయల్ మధ్యలోనే ఎగ్జిట్… అతిగా ఊహించిన అవినాష్ కూడా ఫెయిల్… బిగ్‌బాస్ ఊహించని రీతిలో అభిజిత్, సొహెల్ దూసుకొచ్చారు… అసలు అరియానా ఇక్కడి దాకా వస్తుందని కూడా ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు…
ఒకవేళ అభిజిత్‌ను బిగ్‌బాస్ గనుక వద్దు అనుకుంటే… తనకు వచ్చే ఈ వోట్ల లెక్కలన్నీ పక్కనపెట్టేసి, ఎప్పుడో బయటికి పంపించేసేవాళ్లు… కానీ అభిజిత్ పట్ల ప్రేక్షకుల్లో పాపులారిటీ పెరిగిన తీరును బిగ్‌బాస్ టీం గుర్తించింది… అందుకే పలుసార్లు అభిజిత్ బిగ్‌బాస్ రూల్స్‌కు భిన్నంగా పోయినా తనపై వేటు పడలేదు… తను లేకపోతే షో మరీ వీక్ అయిపోతుంది కాబట్టి… తను షోలో ఉండాలి కాబట్టి…
ఎస్, తను వీక్ కంటెస్టెంటు ఒకరకంగా… ఒక షోల్డర్ నొప్పి, చురుకుగా టాస్కుల్లో ఉండడు… డాన్సులు ఉండవు… ఓవర్ ఎమోటివ్ అనిపించడు… తనలోని ఉద్వేగాలను బలంగా ప్రదర్శించడు… కేకలు వేస్తూ, కెవ్వున అరుస్తూ… వాళ్లనూవీళ్లనూ కెలుకుతూ ఉండే కేరక్టర్ కాదు… మొదట్లో మోనాల్‌తో లవ్వు, ఇప్పుడు హారికతో లవ్వు కూడా ఏదో షోకు కావల్సిన మసాలా కోసమే తప్ప… బిగ్‌బాస్ స్క్రిప్టు మేరకు నటించడమే తప్ప… ఆ లవ్వుల్లో డెప్త్ లేదు… లైఫూ లేదు…
తను చాలా అంశాల్లో వీక్ కంటెస్టెంటే అయినా ఇక్కడి దాకా రావడానికి కారణం… తను ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఉండటం… మెచ్యూర్డ్‌గా కనిపించడం… గతంలో విన్నర్లు శివబాలాజీ, కౌశల్, రాహుల్‌లతో పోల్చినా అభిజిత్ పాపులారిటీ చాలా ఎక్కువ ఇప్పుడు… ప్రతి సీజన్లోనూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్లకు చివరి వారంలో వాళ్ల జర్నీ చూపించడం పరిపాటే… ఎందుకంటే ఫినాలేలో అవి చూపించడం కుదరదు కాబట్టి… ఈసారి కూడా వాళ్ల జర్నీ వీడియోలను వాళ్లకే చూపించి, నాలుగు మంచి మాటలు చెబుతున్నాడు బిగ్‌బాస్… ఈరోజు అఖిల్, అభిజిత్… గురువారం హారిక, అరియానా, సొహెల్… ఈ సందర్భంగానే అభిజిత్‌ను ఉద్దేశించి… షోలో కంటెస్టెంటుగా ఉండటం మాకు గర్వంగా ఉంది అని బిగ్‌బాస్ చెప్పడం విశేషమే… అది అతిశయోక్తిగా అనిపించినా… మరీ అబద్ధం ఏమీ కాదు… కొంతవరకు అభిజిత్ ఈ ప్రశంసకు అర్హుడే…!
Share this Article