ఒకప్పటి తిరుమల లడ్డూ అంటే ఎంత ఖ్యాతి..? ఎంత రుచి..? పదిలంగా తెచ్చుకుని, పది మందికీ పంచుకునేవాళ్లం కదా… ఇప్పుడు దాని నాణ్యతను, రుచిని భ్రష్టుపట్టించారు స్వామివారి భృత్యగణం… రుచి పక్కనపెడితే, గతంలో ఉన్నన్నిరోజులు కూడా నిల్వ ఉండటం లేదు ఇప్పుడు… (దర్శనానంతరం గుడిలోనే పెట్టే ప్రసాదం మాత్రం భేషుగ్గా ఉంటుంది)… ఆయా గుళ్ల ఆచారాలను బట్టి రకరకాల ప్రసాదాలు నివేదిస్తారు కానీ అత్యధికంగా తెలుగు రాష్ట్రాల గుళ్లల్లో వినియోగమయ్యే ప్రసాదం లడ్డూలు, పులిహోర… వాడే సంభారాలను బట్టి వాటి రుచి మారుతూ ఉంటుంది… పోస్టల్ శాఖ ప్రసాదాల్ని డోర్ డెలివరీ చేయడానికి తాజాగా ఒప్పందాలు కుదుర్చుకుంటోంది… కానీ మనం ఆర్డర్ పెట్టి, వాళ్లు మన ఇంటికి చేరవేసేవరకు నిల్వ ఉండవు కదా… అందుకని దద్యోజనం, పులిహోర, లడ్డూ వంటి ప్రసాదాలకు బదులు డ్రై ఫ్రూట్స్, రవ్వపొడి వంటివే డోర్ డెలివరీ చేస్తారు… అవునూ, ప్రసాదాల గురించి ఇంత చెప్పుకుంటున్నాం కదా, అత్యంత ఎక్కువ వెరయిటీల ప్రసాదాల దేవుడు ఎవరు..? అత్యంత భోజనప్రియుడైన ఆ దేవుడు ఎక్కడుంటాడు..? ఏమిటా ప్రసాదాలు..?
పూరి… జగన్నాథుడికి కనీసం 56 రకాల ప్రసాదాలు (చప్పన్ బోగ్) నివేదిస్తారు… అన్నీ అక్కడే వండుతారు… ప్రపంచంలోకెల్లా పెద్ద వంటశాల అనాలేమో దాన్ని… 240 పొయ్యిలు, అవీ కట్టెల పొయ్యిలు… 600 మంది వంటవాళ్లు… అబ్బో… అది ఓ పెద్ద వ్యవస్థ… మట్టికుండల్లో, పాత్రల్లో వండుతారు… భక్తులకు కూడా అమ్ముతారు… అన్ని పుణ్యక్షేత్రాల్లో ఉన్నట్టుగానే అక్కడ కూడా దోపిడీ, అరాచకం గట్రా విసిగించినా… ఈ ప్రసాదాల విశిష్టత మాత్రం అందరినీ ఆకర్షిస్తుంది… మనకు ఎంతసేపూ లడ్డూలు, దద్జోజనం, వడ, రవ్వకేసరి, పులిహోర తప్ప వేరే ప్రసాదం కనిపించవు కదా మన గుళ్లల్లో… మరి ఈ 56 నుంచి 64 రకాల ప్రసాదాలు ఏమై ఉంటాయి..? రకరకాల ఫుడ్ అంటే ఆసక్తి ఉన్న వారికి ఈ ప్రసాదాలు ఏమిటో తెలుసుకోవాలనీ ఉంటుంది కదా… ఆ పంచభక్ష్యాలను ఓసారి లుక్కేద్దాం… (MahaPrasadam, CheppanBhog)
Ads
- గుడ ఉఖుడ… (బెల్లం మరమరాలు…)
- నదియా కుర… (కొబ్బరి లడ్డు…)
- ఖువా… (పాలను బాగా మరిగించి చేసే కోవా)
- దహి… (గడ్డ పెరుగు…)
- పచ్చిల కడాలి… (బాగా మగ్గబెట్టిన అరటి…)
- కనిక… (నెయ్యి, చక్కెర, డ్రైఫ్రూట్స్ వేసి వండే పరమాన్నం…)
- టత్త ఖేచుడి… (పొడిపొడిగా వండే కిచిడీ…)
- మెంధా ముండియా… (ఓ రకం దొడ్డు అట్టు…)
- బడ చంద్ర క్రాంతి… (వేయించే దొడ్డు అట్టు…)
- మిఠా పులి… (బియ్యం, మినుములతో వేసే అట్టు…)
- హంసకేళి… (తీపి అట్టు…)
- జిలి… (పలచగా వేసే తీపి దోసె…)
- ఎండూరి… (తీపి ఇడ్లీలు…)
- అద పచ్చెడి… (అల్లం పచ్చడి…)
- సాగా… (ఆకుకూర…)
- కడాలి బాజా… (వేయించిన గవ్వలు తరహా మిఠాయి…)
- మారీచ లడ్డు… (కారం లడ్డూ లేదా గోధుమపండి, నెయ్యితో చేసే తీపి లడ్డూ…)
- లబంగా… (లవంగాలతో చేసే మిఠాయి…)
- బిరిబర… (వడ, తీపి లేదా కారం…)
- అరిశ… (వరిపిండితో చేసే మిఠాయి…)
- బూంది… (తీపి లేదా కారం బూంది…)
- పఖాలా… (పులిహోర…)
- ఖిరి… (బియ్యం పాయసం…)
- కాదంబ… (ఒడియాలో దొరికే రవ్వలడ్డూ వంటి ఓ మిఠాయి…)
- పాట మనోహర్… (ఓరకం మిఠాయి…)
- టకువా… (పాల తాలికల్లాంటి మిఠాయి…)
- భగ పిత… (అరిశెల్లాంటి మిఠాయి…)
- గొటాయ్… (కాస్త ఉప్పగా ఉండే దొడ్డు అట్టు…)
- దాల్మా… (కూరగాయలు వేసిన పప్పు…)
- బడా కాకర… (ఉండ్రాళ్లు వంటి వంట…)
- లూని ఖురుమ… (ఉప్పగా ఉండే బిస్కెట్లు…)
- అమలు… (చక్కెర పాకం వేసిన అరిశెలు…)
- పొడ పిత… (కాల్చిన దొడ్డు అట్టు…)
- బిరి బుహ… (మినప అట్టు…)
- ఝాడయ్ నదా… (చిన్న ఉండలుగా వేయించిన వంట…)
- ఖాస్త పూరి… (మెత్తటి పూరీలు…)
- కడాలి బార… (వేయించిన అరటి…)
- ఖాజా… (పొరలుపొరలుగా చేసే తీపి పూరి…)
- ఫెనా సకర్… (చక్కెర గోళీ…)
- పులి పిత… (కాల్చిన ఓరకం అట్టు…)
- కంజి… (కూరగాయలు వేసిన పులిహరో…)
- దహి పఖాల్… (పెరుగు సద్ది…)
- బల్సా… (బాదుషా తరహా మిఠాయి…)
- తిపురి… (వరి పిండి, నెయ్యి మిఠాయి…)
- చెనా పొడ… (మందంగా చేసే కేక్…)
- సుజి ఖిరి… (సేమ్యా పాయసం…)
- ముగ సిజా… (ఉడికించిన పెసలు…)
- మనోహర్… (ఓరకం ఒడిస్సీ మిఠాయి…)
- మగజ లడ్డూ… (రవ్వ లడ్డూ తరహా…)
- నబటా పానా… (తీపి పానకం…)
- సాధా భాతా… (మామూలు అన్నం…)
- ఘీయా భాతా… (నెయ్యి అన్నం…)
- మీఠా దాలి.., (బెల్లం వేసిన పప్పు…)
- బేసర… (పలు కూరగాయలతో చేసే కూర…)
- మహూర్… (ఆవాలతో చేసే కూర…)
- సాగా భాజా… (ఆకుకూరల వేపుడు…)
Share this Article